న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్టార్క్, కమిన్స్‌కు విశ్రాంతినిస్తే ఇంకేమైనా ఉందా?

Dont want to tempt fate: Aaron Finch not keen on resting Mitchell Starc or Pat Cummins vs New Zealand

హైదరాబాద్: ప్రపంచకప్‌లో మరో రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య పోరకు రంగం సిద్ధమైంది. లార్డ్స్ వేదికగా శనివారం సాయంత్రం 6 గంటలకు ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌కి ముందు ఆరోన్ ఫించ్ మీడియాతో మాట్లాడాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

"విలియమ్సన్‌ నేతృత్వంలోని కివీస్‌ జట్టు ప్రతి ఆటనూ గెలవాలని చూస్తోంది. అది గ్రూప్‌ మ్యాచైనా లేదా ఫైనల్‌ మ్యాచ్‌ అయినా ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇదే వారిని ప్రత్యేకంగా నిలుపుతోంది. ప్రస్తుత జట్టు అన్ని విభాగాల్లో రాణిస్తోంది. ముఖ్యంగా ఫీల్డింగ్‌ విషయంలో అద్భుతం. స్టార్ ప్లేయర్లు ఉన్న ఆ జట్టుతో తలపడటం రసవత్తరంగా ఉంటుంది" అని ఫించ్ అన్నాడు.

టోర్నీలో ఒక్క భారత్‌తో మినహా

టోర్నీలో ఒక్క భారత్‌తో మినహా మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో గెలుపొందిన ఆస్ట్రేలియా... పాయింట్ల పట్టికలో మొత్తం 12 పాయింట్లతో ఇప్పటికే సెమీఫైనల్‌కు చేరిన తొలిజట్టుగా నిలిచింది. దీంతో ఈ మ్యాచ్‌లో ఆసీస్ ప్రాధాన బౌలర్లు మిచెల్‌ స్టార్క్‌, పాట్‌ కమిన్స్‌లకు విశ్రాంతినిస్తారా? అన్న ప్రశ్నకు కూడా ఆరోన్ ఫించ్ తనదైన శైలిలో స్పందించాడు.

సెమీస్‌ బెర్తు ఖరారు చేసుకున్నప్పటికీ

ఇప్పటికే సెమీస్‌ బెర్తు ఖరారు చేసుకున్నప్పటికీ ఈ మ్యాచ్‌లో తమ బౌలర్లకి విశ్రాంతినివ్వడం లేదని స్పష్టంచేశాడు. ఏడు మ్యాచ్‌ల్లో స్టార్క్‌ 19 వికెట్లు తీసి టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న కాంబినేషన్‌ను మార్చాలని అనుకోవడం లేదని ఆరోన్ ఫించ్ ఈ సందర్భంగా తెలిపాడు.

కివీస్‌కు గత మ్యాచ్‌లో షాకిచ్చిన పాకిస్థాన్‌

మరోవైపు టోర్నీలో ఓటమి అన్నదే లేకుండా సాగుతున్న కివీస్‌కు గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌ గట్టి షాకిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఐదింట గెలిచి 11 పాయింట్లతో న్యూజిలాండ్ మూడో స్థానంలో ఉంది. నాకౌట్‌లో ప్రవేశించాలంటే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లతో జరిగే మ్యాచ్‌ల్లో ఒకదాంట్లో గెలవాల్సి ఉంటుంది.

2015 ప్రపంచకప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమికి

2015 ప్రపంచకప్ ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమికి బదులు తీర్చుకోవాలని కివీస్ ఉవ్విళ్లూరుతుంటే.. ఈ మెగా టోర్నీలో తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని ఆసీస్ భావిస్తోంది. రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 136 మ్యాచ్‌లు జరగ్గా 90 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, 39 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌ నెగ్గాయి. ఏడింట్లో ఫలితం తేలలేదు. ఇక, ప్రపంచకప్ విషయానికి వస్తే ఇరు జట్ల మధ్య 10 మ్యాచ్‌లు జరగ్గా ఏడింట్లో ఆసీస్, మూడు మ్యాచ్‌ల్లో కివీస్‌ గెలుపొందింది.

Story first published: Saturday, June 29, 2019, 16:55 [IST]
Other articles published on Jun 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X