న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రూట్‌, బట్లర్‌ సెంచరీలు వృథా.. ఇంగ్లాండ్‌కు షాకిచ్చిన పాకిస్థాన్‌

ICC Cricket World Cup 2019 : England Defeated Pak Despite Centuries From Buttler And Root | Oneindia
CWC2019: England vs Pakistan: Pakistan hit the revival trail to beat England despite centuries for Joe Root and Jos Buttler

పాకిస్తాన్‌ ఎప్పటిలాగే సంచలనం సృష్టించింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో టోర్నీ ఫేవరెట్‌, ప్రపంచ నెంబర్ వన్ ఇంగ్లాండ్‌ను ఓడించింది. తోలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై బ్యాటింగ్‌లో విఫలమయి 105కే కుప్పకూలి ఘోర పరాజయం చూసిన పాక్.. ఇంగ్లండ్‌పై భారీ పరుగులు చేసి ప్రపంచకప్‌లో బోణీ కొట్టింది. తొలి ఓటమి తర్వాత విమర్శలతో ఉక్కిరిబిక్కిరి అయిన పాక్‌.. బ్యాటుతో పరుగుల వరద పారించి, బంతితో రాణించి ఇంగ్లండ్‌ను పడగొట్టింది. ఛేదనలో ఇద్దరు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్‌ సెంచరీలు చేసినా.. విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

కష్టాల్లో ఇంగ్లండ్‌:

లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌కు శుభారంభం లభించలేదు. షాదాబ్‌ ఖాన్‌ మూడో ఓవర్లోనే ఓపెనర్ జేసన్‌ రాయ్‌ (8)ను ఎల్బీగా ఔట్‌ చేశాడు. అనంతరం 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రూట్‌ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో బాబర్‌ వదిలేసాడు. రియాజ్‌ బౌలింగ్‌లో మూడు ఫోర్లు కొట్టి దూకుడు మీదున్న బెయిర్‌స్టో (31 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్‌) అతని బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు. కెప్టెన్‌ మోర్గాన్‌ (9), బెన్‌ స్టోక్స్‌ (13) కూడా ఔట్ అవ్వడంతో ఇంగ్లండ్‌ కష్టాల్లో పడింది.

130 పరుగుల భాగస్వామ్యం:

130 పరుగుల భాగస్వామ్యం:

ఆ దశలో రూట్‌, బట్లర్‌ అద్భుత బ్యాటింగ్‌తో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. సింగిల్స్‌, డబుల్స్‌ తీస్తూ.. వీలైనప్పుడు బౌండరీలు కొడుతూ ఇంగ్లాండ్‌ను రేసులోకి తెచ్చారు. ఐదో వికెట్‌కు రూట్, బట్లర్‌ 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. షాదాబ్‌ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో బట్లర్‌ అర్ధ సెంచరీ పూర్తి చేయాగా.. రియాజ్‌ బౌలింగ్‌లో సింగిల్‌ తీసిన రూట్‌ (107; 104 బంతుల్లో 10×4, 1×6) సెంచరీ చేసాడు. సెంచరీ అనంతరం రూట్‌ను షాదాబ్‌ ఔట్‌ చేయగా.. కొద్ది సేపటికి సెంచరీ అందుకున్న బట్లర్‌ (103; 76 బంతుల్లో 9×4, 2×6) కూడా తర్వాతి బంతికే పెవిలియన్ చేరాడు.

పాక్‌ బౌలర్ల హవా:

పాక్‌ బౌలర్ల హవా:

ఈ దశలో క్రీజులోకి వచ్చిన వోక్స్‌, మొయిన్‌ అలీలు ఆమిర్‌ వేసిన ఓవర్లో 15 పరుగులు రాబట్టారు. ఇక చివరి మూడు ఓవర్లలో 38 పరుగులు చేయాలి. వాహబ్‌ బౌలింగ్‌లో వోక్స్‌ సిక్స్‌ బాదాడు. కానీ అద్భుతంగా బౌలింగ్‌ చేసిన వాహబ్‌.. వరుస బంతుల్లో అలీ, వోక్స్‌లను ఔట్‌ చేసి పాక్‌ విజయాన్ని దాదాపు ఖరారు చేశాడు. చివరి రెండు ఓవర్లలో ఇంగ్లాండ్‌ 29 పరుగులు చేయాల్సివుండగా.. 49వ ఓవర్లో ఆమిర్‌ 4 పరుగులే ఇచ్చి ఆర్చర్‌ను ఔట్‌ చేసాడు. చివరి ఓవర్లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్‌ భారీ షాట్లు ఆడకపోవడంతో.. పాక్ 14 పరుగుల తేడాతో గెలిచింది. పాక్‌ బౌలర్లలో వాహబ్‌ రియాజ్‌ మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. హఫీజ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' లభించింది.

చెలరేగిన పాక్ బ్యాట్స్‌మన్‌:

చెలరేగిన పాక్ బ్యాట్స్‌మన్‌:

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. పాక్‌ ఆటగాళ్లలో ఇమాముల్‌ హక్‌ (44:58 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), ఫకార్‌ జమాన్‌ (36:40 బంతుల్లో 6 ఫోర్లు), బాబర్‌ అజామ్‌ (63:66 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), హఫీజ్‌ ‌(84: 62 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు), సర్పరాజ్‌ అహ్మద్‌ (55: 44 బంతుల్లో 5 ఫోర్లు)లు రాణించడంతో పాక్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్లానికి 348 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో మొయిన్‌ అలీ, క్రిస్‌ వోక్స్‌లు తలో మూడు వికెట్లు తీశారు.

Story first published: Tuesday, June 4, 2019, 9:10 [IST]
Other articles published on Jun 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X