న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్: ఆప్ఘన్ వికెట్ కీపర్ మహ్మద్‌ షాజాద్‌ మొత్తం టోర్నీకి దూరం

 CWC 2109: Mohammad Shahzad ruled out of ICC World Cup 2019, replacement announced

హైదరాబాద్: వరల్డ్‌కప్‌ మెగా టోర్నీలో పాకిస్థాన్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆప్ఘనిస్థాన్ స్టార్ బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ మహ్మద్‌ షాజాద్‌ ఐసీసీ వరల్డ్‌‌కప్ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. టోర్నీకి ముందు పాకిస్థాన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో మహ్మద్‌ షాజాద్‌ మోకాలికి గాయమైంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

అయినప్పటికీ... టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లతో జరిగిన తొలి రెండు మ్యాచ్‌ల్లో మహ్మద్‌ షాజాద్‌ ఆడాడు. అయితే, గాయం తీవ్రత మరీ ఎక్కువ కావడంతో టోర్నీ మొత్తానికి అతడు దూరమయ్యాడు. అతడి స్థానంలో యువ క్రికెటర్‌ ఇక్రమ్ అలీ ఖిల్‌ను ఆప్ఘన్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది.

మహ్మద్‌ షాజాద్‌ కీలక పాత్ర

మహ్మద్‌ షాజాద్‌ కీలక పాత్ర

ఈ మెగా టోర్నీలో ఆఫ్ఘనిస్థాన్ తరుపున మహ్మద్‌ షాజాద్‌ కీలక పాత్ర పోషిస్తాడని ఆ దేశ అభిమానులు భావించారు. అయితే, ఇలా గాయం కారణంగా అతడు టోర్నీ మొత్తానికి దూరం కావడం బాధాకరమని అంటున్నారు. 2015 వరల్డ్ కప్ నుంచి ఆప్ఘన్ జట్టులో ప్రధాన ఆటగాడిగా కొనసాగుతున్న షాజాద్‌ 55 మ్యాచ్‌ల్లో 1843 పరుగులు చేశాడు.

ఆప్ఘనిస్థాన్‌కు పెద్ద ఎదురుదెబ్బే

ఆప్ఘనిస్థాన్‌కు పెద్ద ఎదురుదెబ్బే

టాప్‌ ఆర్డర్‌లో అతడు లేకపోవడం ఆప్ఘనిస్థాన్‌కు పెద్ద ఎదురుదెబ్బేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో మహ్మద్‌ షాజాద్‌ డకౌట్‌గా వెనుదిరగగా... ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 12 బంతుల్లో 7 పరుగులు చేశాడు.

మహ్మద్‌ షాజాద్‌ స్థానంలో యువ క్రికెటర్

మహ్మద్‌ షాజాద్‌ స్థానంలో యువ క్రికెటర్

ప్రస్తుతం అతడి స్థానంలో యువక్రికెటర్‌ ఇక్రమ్ అలీ ఖిల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఖిల్‌ ఆప్ఘనిస్థాన్ తరఫున ఇప్పటివరకు రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఈ ఏడాది మార్చిలో డెహ్రాడూన్‌లో ఐర్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అతడు అరంగేట్రం చేశాడు.

రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ఆఫ్ఘన్

రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ఆఫ్ఘన్

2018లో అప్ఘనిస్థాన్ తరఫున అండర్‌-19 వరల్డ్‌కప్ జట్టులో ఆడిన అనుభవం ఉంది. ఆ సిరీస్‌లో మొత్తం నాలుగు మ్యాచ్‌ల్లో 185 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆప్ఘన్ ఓడిపోయింది. జూన్ 8న న్యూజిలాండ్‌తో తదుపరి మ్యాచ్‌ ఆడనుంది.

Story first published: Friday, June 7, 2019, 13:00 [IST]
Other articles published on Jun 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X