న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మహ్మద్ ఆమీర్ అద్భుతం: ఆసీస్ ఆలౌట్, పాక్ విజయ లక్ష్యం 308

Amir Fifer Restricts Aussies to 307

హైదరాబాద్: టాంటన్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 111 బంతుల్లో 107(11 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీకి తోడు ఆరోన్ ఫించ్ 84 బంతుల్లో 82(6 ఫోర్లు, 4 సిక్సులు) చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లకు గాను 307 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో పాకిస్థాన్‌కు 308 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. పాకిస్థాన్ బౌలర్లలో మహ్మద్ ఆమీర్ ఐదు వికెట్లు తీయగా షహీన్ అఫ్రిది రెండు.. హసన్ అలీ, వాహబ్ రియాజ్, మహ్మద్ హఫీజ్ తలో వికెట్ తీశారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

వార్నర్ సెంచరీ: 307 పరుగులు చేసిన ఆస్ట్రేలియా
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దీంతో ఆరోన్ ఫించ్‌తో కలిసి వార్నర్ శుభారంభం అందించారు. జట్టు స్కోరు 146 పరుగుల వద్ద ఆరోన్ ఫించ్ (82)ను అమిర్‌ పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో తొలి వికెట్‌కు 146 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్‌(8), గ్లెన్ మ్యాక్స్‌వెల్(20) త్వరగానే పెవిలియన్‌కు చేరారు. అయితే, వార్నర్ మాత్రం నిలకడగా ఆడతూ సెంచరీ సాధించాడు. 111 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 107 పరుగులతో సెంచరీ సాధించాడు. వన్డేల్లో వార్నర్‌కి ఇది 15వ సెంచరీ.

సెంచరీ అనంతరం దూకుడుగా ఆడే క్రమంలో షహీన్ అఫ్రిది వేసిన 38వ ఓవర్‌లో ఐదో బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించిన వార్నర్... ఇమామ్ ఉల్ హాక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వార్నర్ క్రీజులో ఉన్నంత వరకు పరుగులు పెట్టిన స్కోరు బోర్డు అతడు ఔటైన తర్వాత నెమ్మదించింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఆటగాళ్లు స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు.

1
43660

పాక్ పేసర్ మహ్మద్ ఆమీర్ చివర్లో అద్భుత ప్రదర్శన చేశాడు. తన పదునైన బంతులతో ఆసీస్ బ్యాట్స్‌మెన్‌కు ముచ్చెమటలు పోయించాడు. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లు వేసిన ఆమీర్ 30 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో ఆమీర్‌కు ఇది తొలి ఐదు వికెట్ల హాల్ కావడం విశేషం.

ప్రపంచకప్‌ లాంటి మెగా టోర్నీలో తన తొలి ఐదు వికెట్ల హాల్‌ను తీయడంతో తెగ సంబరపడ్డాడు. దీంతో ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 307 పరుగులు చేసి ఆలౌటైంది. పాక్ బౌలర్లలో అమీర్ ఐదు, షాహీన్ అఫ్రిది 2, హసన్ అలీ, వహాబ్ రియాజ్, మహ్మద్ హఫీజ్ తలో వికెట్ తీశారు.

{headtohead_cricket_1_5}

Story first published: Wednesday, June 12, 2019, 19:00 [IST]
Other articles published on Jun 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X