న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ సమయస్ఫూర్తి: పాక్‌కు కోచ్‌ అయినప్పుడు సలహా ఇస్తా

CWC 19, India vs Pakistan: Rohit Sharma cheeky response to what advice he had for Pakistans batsmen

టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ సమయస్ఫూర్తి ప్రదర్శించి తనదైనశైలిలో ఓ పాకిస్థాన్‌ రిపోర్టర్‌కి సమాధానం ఇచ్చాడు. ప్రపంచకప్‌లో భాగంగా మాంచెస్టర్‌ వేదికగా ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 'హిట్ మ్యాన్‌' రోహిత్‌ శర్మ సెంచరీ (140; 113 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

పాక్‌ కోచ్‌ అయినపుడు చెబుతా:

పాక్‌ కోచ్‌ అయినపుడు చెబుతా:

భారీ శతకం చేయడంతో రోహిత్‌కు 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది. అనంతరం మీడియాతో రోహిత్‌ మాట్లాడాడు. ఈ క్రమంలో ప్రస్తుతం కష్టాల్లో ఉన్న పాక్‌ బ్యాట్స్‌మెన్‌కు మీరు ఎలాంటి సలహా ఇస్తారు అని ఓ పాకిస్థాన్‌ రిపోర్టర్‌ ప్రశ్నించాడు. 'ఒకవేళ నేను పాకిస్థాన్‌ కోచ్‌ అయితే తప్పకుండా సలహా ఇస్తా. ఇప్పుడు ఏం చెప్పగలను' అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. ఈ సమాధానంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా నవ్వులు పూయించారు.

ఔటైన తీరుకు అసంతృప్తి చెందా:

ఔటైన తీరుకు అసంతృప్తి చెందా:

'జట్టు ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. గత మ్యాచ్ బాగా ఆడాలనుకున్నాం. వర్షంతో రద్దవడంతో నిరాశ చెందాం. ఈ రోజు మాత్రం మంచి క్రికెట్ ఆడాం. నేను ఔటైన తీరుకు అసంతృప్తి చెందా. ఆ షాట్‌ ఎంపిక నా నిర్ణయ లోపమే. ఒక్కసారి క్రీజులో నిలదొక్కుకున్నాక ఎక్కువ పరుగులు చేయాలి. మంచి భాగస్వామ్యం నెలకొల్పాక ఔటవడం సరైనది కాదు' అని రోహిత్ తెలిపారు.

నాకు కూతురు రాకతోనే:

నాకు కూతురు రాకతోనే:

'నిజంగా చెబుతున్నా.. డబుల్‌ సెంచరీ గురించి ఆలోచించలేదు. ఇది బ్యాటింగ్ పిచ్. నా బ్యాటింగ్ ఇంకా కొనసాగించాలనుకున్నా. కానీ అలా జరగలేదు. వచ్చే మ్యాచులలో మరిన్ని ఎక్కువ పరుగులు చేయడానికి ప్రయత్నిస్తా. ప్రస్తుతం నా జీవితంలో మంచి రోజులు నడుస్తున్నాయి. నాకు కూతురు రాకతోనే ఇదంతా' అని రోహిత్ అన్నారు.

ప్రపంచకప్‌లో పరుగుల వరద:

ప్రపంచకప్‌లో పరుగుల వరద:

ఐపీఎల్‌-12లో అంతగా ఆకట్టుకొని రోహిత్‌ శర్మ ప్రపంచకప్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై సెంచరీ (122 నాటౌట్) చేసాడు. రెండో మ్యాచ్‌లో ఆసీస్‌పై హాఫ్ సెంచరీ (57) సాధించాడు. మూడో మ్యాచ్‌ వర్షార్పణం కాగా.. పాకిస్థాన్‌ మ్యాచ్‌లో భారీ సెంచరీ (140 నాటౌట్) చేసాడు. రెండు ఇన్నింగ్స్‌లలో నాటౌట్ గా ఉండడం విశేషం. ఇన్నింగ్స్ మొదట నెమ్మదిగా ఆడే రోహిత్.. కుదురుకున్నాక భారీ ఇన్నింగ్స్‌లు అడుతున్నాడు.

Story first published: Tuesday, June 18, 2019, 8:33 [IST]
Other articles published on Jun 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X