న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇరానీ కప్ విజేత విదర్భ

Clinical Vidarbha beat Rest of India to lift Irani Trophy

హైదరాబాద్: విదర్భ జట్టు ఖాతాలో మరో టైటిల్ చేరింది. ఈ సీజన్‌లో సమిష్టి ప్రదర్శనతో అదురగొడుతున్న ఫయాజ్ ఫజల్ కెప్టెన్సీలోని విదర్భ తాజాగా ఇరానీకప్‌లో విజేతగా నిలిచింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం(404 రెస్టాఫ్‌పై ఆతిథ్య విదర్భ విజయం సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 236/6తో ఆఖరి రోజైన ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన రెస్టాఫ్‌ మరో 154 రన్స్‌ జోడించి 390 వద్ద ఆలౌటైంది.

హనుమ విహారీ(327 బంతుల్లో 183, 23ఫోర్లు, 3సిక్స్‌లు) సూపర్ సెంచరీతో కదం తొక్కాడు.తన ఇన్నింగ్స్‌లో 23 ఫోర్లు, 3 సిక్స్‌లతో అలరించిన విహారీ..ఏడో వికెట్‌కు జయంత్ యాదవ్(96)తో కలిసి 216 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ జోడీని విడగొట్టేందుకు విదర్భ కెప్టెన్ ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఆఖరికి ఆదిత్య సర్వతే(3/97)బౌలింగ్‌లో స్టంప్‌ఔట్‌గా వెనుదిరిగాడు విహారీ.

వీరిద్దరూ ఏడో వికెట్‌కు 216 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక్కణ్నుంచి ఏ ఒక్కరూ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. రజనీష్‌ గుర్బానీ 4, అదిత సర్వతే 3, ఉమేశ్‌ యాదవ్‌ 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో విదర్భకు 410 రన్స్‌ ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు అక్షయ్‌ (50 నాటౌట్‌), సంజయ్‌ (27 నాటౌట్‌) రాణించడంతో ఆట చివరకు విదర్భ వికెట్‌ నష్టపోకుండా 79 రన్స్‌ చేసింది.

దాంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసినా తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం ఆధారంగా విదర్భ ట్రోఫీ కైవసం చేసుకుంది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో విదర్భ 800/7 (డిక్లేర్డ్‌) స్కోరు చేసింది. డబుల్‌ సెంచరీతో మెరిసిన వెటరన్‌ బ్యాట్స్‌మన్‌ వసీం జాఫర్‌ 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా నిలిచాడు.

Story first published: Monday, March 19, 2018, 9:44 [IST]
Other articles published on Mar 19, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X