న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గత రాత్రి నాతో ఏమన్నావ్‌.. గప్తిల్‌ను అడిగిన చాహల్!!

Chahal asks Guptill to repeat the Hindi cuss word, he responds in hilarious fashion

హామిల్టన్‌: ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్, న్యూజిలాండ్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్‌ మధ్య జరిగిన సంభాషణ తెలిసిందే. ఓ వీడియోలో చాహల్‌ను ఉద్దేశిస్తూ.. గప్తిల్ హిందీలో ఓ అసభ్యకరమైన పదాన్ని అన్నాడు. అయితే గప్తిల్‌కు హిందీ రాకపోవడంతో.. చాహల్ ఆ విషయాన్ని సరదాగా తీసుకున్నాడు. కానీ.. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో గప్తిల్‌ వద్దకు చాహల్ వెళ్లి దీని గురించి చర్చించాడు.

మూడో టీ20లో రోహిర్ వీరవిహారం.. కివీస్ లక్ష్యం 180మూడో టీ20లో రోహిర్ వీరవిహారం.. కివీస్ లక్ష్యం 180

'గత రాత్రి నాతో ఏమన్నావ్‌?' అని గప్తిల్‌ను చాహల్ అడిగాడు. దీనికి గప్తిల్ సరదాగా స్పందించాడు. 'నిన్ను ఏమన్నానో నీకు తెలుసుగా?. మరలా నన్ను ఎందుకు అడుగుతున్నావ్' అని నవ్వుతూ సమాధానిమిచ్చాడు. దీంతో ఇద్దరు ఆ విషయాన్ని అక్కడితో ముగించారు. దీనికి సంబందించిన ఈ వీడియోను చాహల్ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఇది కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

రెండో టీ20 మ్యాచ్ అనంతరం మైదానంలో గప్తిల్‌, రోహిత్‌ శర్మ ఏదో మాట్లాడుకుంటూ ఉండగా.. చహల్‌ వారి దగ్గరికి వెళ్లి ఏం జరుగుతోందని ప్రశ్నించాడు. చాహల్‌ను ఉద్దేశించి గప్తిల్‌ హిందీలో అనకూడని ఓ మాట అన్నాడు. దీంతో పక్కనే ఉన్న రోహిత్‌ నవ్వులు పూయించాడు. ఈ ఘటనంతా లైవ్‌లో రికార్డు అయింది. అయితే గప్తిల్‌ తెలిసీ తెలియని భాషలో అలా అనడంతో అక్కడున్న టీమిండియా ఆటగాళ్లు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.

ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హామిల్టన్‌లోని సెడాన్‌ పార్క్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20లో భారత్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసి కివీస్ ముందు 180 పరుగుల లక్ష్యంను ఉంచింది. తొలి రెండు టీ20ల్లో విఫలమైన ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (65: 40బంతుల్లో 6ఫోర్లు, 3సిక్సర్లు) మూడో టీ20లో పరుగుల వరద పారించాడు. హామిల్టన్‌ మైదానం పెద్దది అయినప్పటికీ సునాయాసంగా బౌండరీలు బాదేశాడు. కివీస్ పేసర్ హామిష్ బెన్నెట్ మూడు వికెట్లు తీసాడు. అనంతరం లక్ష్య ఛేదనలో కివీస్ పోరాడుతోంది. 13 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది.

Story first published: Wednesday, January 29, 2020, 15:37 [IST]
Other articles published on Jan 29, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X