న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్ ఏకగ్రీవంగా ఎంపికయ్యే అవకాశం?

Bharat Arun Favourite To Retain Job As Team India's Bowling Coach || Oneindia Telugu
Bharat Arun favourite to retain job as India bowling coach of the Indian cricket team

టీమిండియా బౌలింగ్ కోచ్‌గా మళ్లీ భరత్ అరుణ్ ఏకగ్రీవంగా ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్ భాద్యతలు చేపట్టినప్పటినుండి భారత బౌలర్లు అద్భుతంగా రాణిస్తుండడంతో అతను తిరిగి ఎంపికయ్యే అవకాశం ఉంది. విండీస్ టూర్ అనంతరం టీమిండియా హెడ్ కోచ్‌తో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌కు సంబంధించిన అందరి పదవీకాలం ముగియనుంది. దీంతో ఆ పదవుల కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇప్పటికే దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే ఈ సారి కొత్తగా వయసు, ఎక్స్‌పీరియన్స్ లాంటి నిబంధనలను విధించింది. కపిల్ దేవ్ అధ్యక్షతన ఈ పదవులు ఎంపిక చేయబడతాయి.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

బలమైన పోటీదారు:

బలమైన పోటీదారు:

ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి మళ్ళీ హెడ్ కోచ్ పదవి పొందడానికి బలమైన పోటీదారుగా ఉన్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, రవిశాస్త్రిల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. భారత్ వీరిద్దరి కలయికలో ఆస్ట్రేలియాలో జరిగిన చారిత్రాత్మక సిరీస్ విజయంతో పాటు టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఈ మధ్య భారత్ మంచి విజయాలు అందుకుంది. ప్రస్తుతం భారత్ వన్డే, టెస్ట్ ర్యాంకింగ్స్‌లో మంచి స్థానాల్లో ఉంది. దీంతో మళ్లీ రవిశాస్త్రి ఎంపికయ్యే అవకాశం ఉంది. అయితే జయవర్ధనే, టామ్ మూడీ, మైక్ హేస్సన్, గ్యారీలు పోటీలో ఉన్నారు.

 ఏకగ్రీవంగా అరుణ్‌:

ఏకగ్రీవంగా అరుణ్‌:

ప్రస్తుత భారత బౌలింగ్ కోచ్ భరత్‌ అరుణ్‌కు కూడా చాలా మంది పోటీలో ఉన్నప్పటికీ.. తన స్థానాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అన్ని ఫార్మాట్లలో భారత పేసర్ల ప్రదర్శనను పరిశీలిస్తే అరుణ్ ఏకగ్రీవంగా ఎన్నికవనున్నారు. 'గత 18-20 నెలలుగా జట్టు కోసం అరుణ్ పడిన కష్టం అసాధారణమైనది. టెస్ట్ ఫార్మాట్‌లో ఉత్తమమైన బౌలర్లు ఉన్నారు. మహ్మద్ షమీ తిరిగి పుంజుకున్నాడు. బుమ్రా స్థిరంగా రాణిస్తున్నాడు. ఇదంతా అరుణ్ వల్లే. అతని స్థానంలో వేరే వారికి అవకాశం ఇవ్వడం కష్టం' అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

మళ్లీ ఎంపికవడం కష్టమే:

మళ్లీ ఎంపికవడం కష్టమే:

అయితే ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ మళ్లీ ఎంపికవడం కష్టమే అని సమాచారం తెలుస్తోంది. అతనికి దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్‌, దిగ్గజ ఫీల్డర్‌ జాంటీ రోడ్స్‌ ప్రధాన పోటీ ధారుడుగా ఉన్నాడు. మరోవైపు బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలానే ఉంది. మెగా టోర్నీలో భారత మిడిల్ ఆర్డర్ పూర్తిగా విఫలమవడంతో అతనిపై వేటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Story first published: Friday, July 26, 2019, 16:25 [IST]
Other articles published on Jul 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X