For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డే-నైట్ టెస్టుల్లో కూడా టీమిండియా విజయం సాధిస్తుంది: సౌరవ్ గంగూలీ

BCCI president Sourav Ganguly open to the idea of India playing day-night Test match

హైదరాబాద్: డే-నైట్ టెస్టు మ్యాచ్‌లను వీక్షించే సువర్ణావకాశం భారత అభిమానులకు త్వరలోనే రానుంది. బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సౌరవ్ గంగూలీ బోర్డులోని ప్రతి సభ్యుడితో ఈ విషయమై చర్చించటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. టెస్ట్ క్రికెట్ యొక్క దీర్ఘకాలిక భవిష్యత్తు డే-నైట్ టెస్టులేనని సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు.

2018-19 బోర్డర్-గవాస్కర్ సిరిస్‌లో భాగంగా ఈ ఏడాది జనవరిలో అడిలైడ్ వేదికగా డే-నైట్ టెస్టు మ్యాచ్ నిర్వహించాలని ఆస్ట్రేలియా బోర్డు ప్రయత్నాలు చేసినప్పటికీ బీసీసీఐ మాత్రం అందుకు అంగీకరించలేదు. అయితే, గంగూలీ ఆధ్వర్యంలోని కొత్త పాలన వారి తదుపరి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఆలోచనకు అంగీకరించవచ్చు.

వచ్చే వేసవిలో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ "దీని గురించి ఆలోచిస్తాం. మేము దీనిపై ఎలా పని చేస్తాం అనే దానిపై ఇప్పుడే మాట్లాడితే తొందరపాటు అవుతుంది. ముందు నన్ను పదవిని చేపట్టనివ్వండి. ఆ తర్వాత ప్రతి సభ్యుడితో చర్చిస్తాం" అని అన్నాడు.

"ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో డే-నైట్ టెస్టులు ఉన్నాయి ఎందుకంటే అడిలైడ్ మైదానం పింక్-బాల్ టెస్టులకు ఆతిథ్యమిస్తోంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో డే-నైట్ టెస్టులు ఉండవని చెప్పడం సరైన పిలుపు అని నేను అనుకోవడం లేదు. డే-నైట్ టెస్టులు ముందుకు సాగాలి. ప్రతి ఒక్క జట్టు కూడా డే-నైట్ టెస్టులు ఆడాలి. టెస్టు క్రికెట్‌కు అదే భవిష్యత్తు" అని గంగూలీ తెలిపాడు.

"టీమిండియా ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది. డే-నైట్ టెస్టు మ్యాచ్‌లను తప్పక గెలుస్తుంది. పగటిపూట టెస్టులకు డే-నైట్ టెస్టులకు పెద్ద తేడా ఉండదు. బంతి మాత్రమే తేడా. క్లాస్ ప్లేయర్లు ఉన్నారు... వారు తప్పకుండా డే-నైట్ టస్టుల్లో టీమిండియాను గెలిపిస్తారు" అని సౌరవ్ గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు.

Story first published: Thursday, October 17, 2019, 16:21 [IST]
Other articles published on Oct 17, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+