న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెంచరీ ఆపేసినందుకు 9 మ్యాచ్‌ల నిషేదం

 Ban for cricketer who sparked outrage after denying batsman maiden century

హైదరాబాద్: స్టెడ్జింగ్‌కు మించిన వ్యవహారమిది. బ్యాట్స్‌మన్ పరుగులు చేయకుండా కట్టడి చేయడం బౌలర్ పని. అలాంటిది తమ జట్టు ఓడినా పర్లేదు కానీ, ఆ బ్యాట్స్‌మన్ మాత్రం సెంచరీ చేయకూడదని తలంచాడు ఓ క్లబ్ క్రికెట్ బౌలర్. దాంతో బంతిని తానే బౌండరీకి విసిరి మ్యాచ్‌ను ముగించేశాడు. వివరాల్లోకి వెళితే.. బ్యాట్స్‌మెన్‌ స్కోరు 95.. జట్టు విజయానికి కావాల్సింది ఇంకా 5 పరుగులు. ఆ ఐదు పరుగులు ఆ బ్యాట్స్‌మెన్‌ చేస్తే జట్టు విజయంతో పాటు సెంచరీ చేయాలనే అతని కల కూడా నెరవేరుతోంది.

కానీ, ఆ బౌలర్‌.. బ్యాట్స్‌మెన్‌ను సెంచరీ చేయనివ్వకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నాడు. దీంతో జట్టైతే విజయం సాధించింది కానీ బ్యాట్స్‌మన్‌కి నిరాశ తప్పలేదు. ఇంగ్లాండ్‌లో. లీగ్‌లో భాగంగా పర్నెల్‌ క్రికెట్‌ క్లబ్‌-మైన్‌హెడ్‌ క్రికెట్‌ క్లబ్‌ మధ్య ఆగస్టు 4న మ్యాచ్‌ నిర్వహించారు. ఈ మ్యాచ్‌లో బౌలర్‌ చేష్టలను చూసిన వారంతా నివ్వెరపోయారు. ఉద్దేశపూర్వకంగా ఇష్టానుసారం బంతి వేసిన పర్నెల్ జట్టు బౌలర్‌పై సోమర్‌సెట్‌ క్రికెట్‌ లీగ్‌ నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం అని తేల్చి 9 మ్యాచ్‌ల నిషేధం విధించినట్లు ప్రకటించారు. ఇంగ్లాండ్‌లో ప్రస్తుతం సోమర్‌సెట్‌ క్రికెట్‌ లీగ్‌ జరుగుతోంది. లీగ్‌లో భాగంగా ఆగస్టు 4న పర్నెల్‌ క్రికెట్‌ క్లబ్‌-మైన్‌ హెడ్ క్రికెట్‌ క్లబ్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో మైన్‌హెడ్‌ ఆటగాడు డార్నెల్‌ 95 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

అదే సమయంలో మైన్‌హెడ్‌ జట్టు విజయానికి కావాల్సింది ఐదు పరుగులే. స్ట్రైకింగ్‌ చేసేందుకు డార్నెల్‌ సిద్ధంగా ఉన్నారు. సరిగ్గా అప్పుడు పర్నెల్‌ జట్టు బౌలర్‌ ఉద్దేశపూర్వకంగా డార్నెల్‌ సెంచరీని అడ్డుకున్నాడు. నోబాల్‌ వేయడంతో పాటు అది బౌండరీ లైన్‌ దాటేలా బంతిని విసిరాడు. దీంతో ఎప్పటి నుంచో సెంచరీ సాధించాలన్న డార్నెల్‌ కల కలగానే మిగిలిపోయింది. ఇప్పటి వరకు డార్నెల్‌ తన కెరీర్‌లో ఒక్క సెంచరీ కూడా చేయలేదు.

Story first published: Thursday, August 9, 2018, 10:27 [IST]
Other articles published on Aug 9, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X