Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్లాసెన్ కాదు.. అతడి వల్లే గెలిచాం: ప్యాట్ కమిన్స్

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన 41వ మ్యాచ్ పరుగుల వర్షాన్ని కురిపించింది. ముంబై నిర్దేశించిన 244 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్యాట్ కమిన్స్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మరో 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ గెలుపుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా 5వ విజయాన్ని నమోదు చేసిన తమ జైత్రయాత్రను కొనసాగిస్తోంది.

ముందుగా టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 44 బంతుల్లోనే తన తొలి ఐపీఎల్ సెంచరీని పూర్తి చేసి ముంబై తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును నెలకొల్పాడు. అతనికి తోడుగా విల్ జాక్స్ (46), హార్దిక్ పాండ్యా (31) రాణించడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 243 పరుగుల భారీ స్కోరు సాధించింది.

Pat Cummins Praises Salil Arora After SRH Historic 244 Run Chase Against MI in IPL 2026

అయితే ఇంతటి భారీ లక్ష్యం కూడా సన్‌రైజర్స్ బ్యాటర్ల ముందు చిన్నబోయింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ పవర్ ప్లేలోనే 92 పరుగులు పిండుకుని ముంబై బౌలర్లను వణికించారు. హెడ్ 30 బంతుల్లో 76 పరుగులతో విధ్వంసం సృష్టించగా.. మధ్యలో అభిషేక్ శర్మ (45) మంచి సహకారం అందించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ 65 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. యువ ఆటగాడు సలీల్ అరోరా 10 బంతుల్లో 30 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు.

మ్యాచ్ అనంతరం తన జట్టు బ్యాటింగ్ తీరుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ప్రశంసలు కురిపించాడు. తమ ఓపెనర్ల బ్యాటింగ్ చూస్తుంటే చాలా భయంకరంగా ఉందని.. తాను వారికి బౌలింగ్ చేయనందుకు సంతోషంగా ఉందని చమత్కరించాడు. ఐదేళ్ల క్రితం 200 పరుగులు ఛేదించడం కష్టంగా ఉండేదని.. కానీ ఇప్పుడు 240 పరుగులు కూడా సాధ్యమేనని ఈ కుర్రాళ్లు నిరూపిస్తున్నారని కమిన్స్ కొనియాడాడు.

ముఖ్యంగా యువ ఆటగాడు సలీల్ అరోరా ప్రదర్శనపై కమిన్స్ ముగ్ధుడయ్యాడు. సలీల్‌కు ఈ సీజన్‌లో ఎక్కువ అవకాశాలు రాలేదని.. కానీ ప్రీ-సీజన్‌లోనే అతను తన ప్రతిభతో ఆకట్టుకున్నాడని తెలిపాడు. యువ ఆటగాళ్లలో భయం లేని ధోరణిని పెంపొందించిన కోచింగ్ స్టాఫ్‌ను కూడా కమిన్స్ అభినందించాడు. జట్టు విజయాల్లో ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషిస్తున్నాడని చెబుతూ కమిన్స్ తన మాటలను ముగించాడు.

Story first published: Thursday, April 30, 2026, 8:39 [IST]
Other articles published on Apr 30, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+