Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: ముంబైని ముంచిన నమన్ ధీర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం!

ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా ఐదో మ్యాచ్‌లో గెలిచిన ఆరెంజ్ ఆర్మీ ఆరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బుధవారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

244 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి ముంబై ఇండియన్స్‌కు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఐపీఎల్ చరిత్రలోనే రెండో అతిపెద్ద ఛేజింగ్ రికార్డ్‌‌ను సొంతం చేసుకోవడంతో పాటు లీగ్ 100 విజయాల మైలురాయిని అందుకుంది. మరోవైపు పేలవ బౌలింగ్, చెత్త ఫీల్డింగ్‌తో ముంబై ఇండియన్స్ మూల్యం చెల్లించుకుంది.

పాపం ర్యాన్ రికెల్టన్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. ర్యాన్ రికెల్టన్(55 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో 123 నాటౌట్) అజేయ శతకంతో రాణించగా.. విల్ జాక్స్(22 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46), హార్దిక్ పాండ్యా(15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31) దూకుడుగా ఆడారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ప్రఫుల్ హింగే(2/54) రెండు వికెట్లు తీయగా.. ఇషాన్ మలింగా, సాకిబ్ హుస్సేన్, నితీష్ కుమార్ రెడ్డి తలో వికెట్ తీసారు.

IPL 2026 Travis Head and Heinrich Klaasen Power SRH to Historic 100th Win Against Mumbai Indians

అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 249 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లతో 76), హెన్రీచ్ క్లాసెన్(30 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 65 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించగా.. అభిషేక్ శర్మ(24 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 45), సలీల్ అరోరా(10 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 30 నాటౌట్) దూకుడుగా ఆడారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో అల్లా ఘజన్‌ఫర్(2/51) రెండు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ తీసారు.

కొంపముంచిన నమన్ ధీర్

244 పరుగుల భారీ లక్ష్య ఛేదన‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఫామ్‌లేమితో బాధపడిన ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్‌తో జోరు అందుకున్నాడు. అయితే అతను ఇచ్చిన మూడు క్యాచ్‌లను ముంబై ఇండియన్స్ ప్లేయర్ నమన్ ధీర్ వదిలేసాడు. ఈ క్యాచ్‌లు కాస్త కష్టమే అయినా పూర్తి చేయలేకపోయాడు.

ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో 2 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ట్రావిస్ హెడ్ ఇచ్చిన క్యాచ్‌ను నమన్ ధీర్ అందుకోలేకపోయాడు. అతని చేతి వేల్లను తాకుతూ బంతి సిక్సర్‌గా వెళ్లిపోయింది. అల్లా ఘజన్‌ఫర్ బౌలింగ్‌లో 30 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ట్రావిస్ హెడ్ ఇచ్చిన మరో క్యాచ్‌ను కూడా నమన్‌ధీర్ వదిలేసాడు. అశ్వని కుమార్ బౌలింగ్‌లో 48 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మూడోసారి ట్రావిస్ హెడ్ ఇచ్చిన క్యాచ్‌ను నమన్ ధీర్ జారవిడిచాడు. క్యాచ్ అందుకున్నా.. సమన్వయం కోల్పోయి బౌండరీ లైన్‌పై పడిపోయాడు. దాంతో ఇది కూడా సిక్సర్‌గా మారింది. ఈ అవకాశాలతో ట్రావిస్ హెడ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

అభిషేక్ శర్మతో కలిసి 8.4 ఓవర్లలోనే తొలి వికెట్‌కు 129 పరుగులు జోడించి మ్యాచ్‌ను ముంబై నుంచి లాగేసాడు. ట్రావిస్ హెడ్ క్యాచ్‌లు పట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేది. సెంచరీ దిశగా సాగిన ట్రావిస్ హెడ్‌ను హార్దిక్ పాండ్యా ఔట్ చేసినా.. హెన్రీచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి‌లు చెలరేగారు. నితీష్ ఔటైనా.. సలీల్ అరోరాతో కలిసి క్లాసెన్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

Story first published: Wednesday, April 29, 2026, 23:53 [IST]
Other articles published on Apr 29, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+