Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: చరిత్ర సృష్టించిన ర్యాన్ రికెల్టన్.. 18 ఏళ్ల రికార్డ్ బద్దలు!

ముంబై ఇండియన్స్ ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ చరిత్ర సృష్టించాడు. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ర్యాన్ రికెల్టన్(55 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స్‌లతో 123 నాటౌట్) అజేయ శతకం సాధించడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు.

ఈ క్రమంలో 18 ఏళ్ల రికార్డ్‌ను ర్యాన్ రికెల్టన్ బద్దలు కొట్టాడు. ఐపీఎల్ 2008 సీజన్‌లో సనత్ జయసూర్య ముంబై ఇండియన్స్ తరఫున చెన్నై సూపర్ కింగ్స్‌పై 114 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ తరఫున ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉండగా.. తాజా ఇన్నింగ్స్‌తో ర్యాన్‌రికెల్టన్ అధిగమించాడు.

ఈ జాబితాలో ర్యాన్ రికెల్టన్(123 నాటౌట్), సనత్ జయసూర్య(114 నాటౌట్) తర్వాత క్వింటన్ డికాక్(112 నాటౌట్), రోహిత్ శర్మ(109 నాటౌట్), రోహిత్ శర్మ (105 నాటౌట్) కొనసాగుతున్నారు. ముంబై ఇండియన్స్ తరఫున అత్యంత వేగంగా సెంచరీ బాదిన ఆటగాడిగా కూడా ర్యాన్ రికెల్టన్ నిలిచాడు.

MI vs SRH Ryan Rickelton Rampage Fastest Hundred and Highest Individual Score for Mumbai Indians

ముంబై ఇండియన్స్ టాప్ 5 వ్యక్తిగత స్కోర్లు

123* ర్యాన్ రికెల్టన్ SRH వాంఖడే 2026
114* సనత్ జయసూర్య CSK వాంఖడే 2008
112* క్వింటన్ డి కాక్ PBKS వాంఖడే 2026
109* రోహిత్ శర్మ KKR కోల్‌కతా 2012
105* రోహిత్ శర్మ CSK వాంఖడే

ముంబై ఇండియన్స్ రికార్డ్ స్కోర్..

ర్యాన్ రికెల్టన్ అజేయ శతకంతో ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 243/5 రికార్డ్ స్కోర్ నమోదు చేసింది. ర్యాన్ రికెల్టన్‌తో పాటు మరో ఓపెనర్ విల్ జాక్స్(22 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46), హార్దిక్ పాండ్యా(15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31) దూకుడుగా ఆడారు. ఐపీఎల్ చరిత్రలోనే ముంబై ఇండియన్స్‌కు ఇది మూడో అత్యధిక స్కోర్. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మాత్రం ఇదే అత్యధిక స్కోర్.

ముంబై ఇండియన్స్ అత్యధిక స్కోర్లు..

247/9 DC ఢిల్లీ 2024 రెండో ఇన్నింగ్స్
246/5 SRH హైదరాబాద్ 2024 రెండో ఇన్నింగ్స్
243/5 SRH వాంఖడే 2026 తొలి ఇన్నింగ్స్
235/9 SRH అబుదాబి 2021 తొలి ఇన్నింగ్స్
234/5 DC వాంఖడే 2024 తొలి ఇన్నింగ్స్

Story first published: Wednesday, April 29, 2026, 22:44 [IST]
Other articles published on Apr 29, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+