న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్ ఆస్ట్రేలియా కమిటీ వీళ్లు సూచిస్తే జట్టు సమకూరుతోంది: గంగూలీ

At Its Lowest Ever: Sourav Ganguly Slams Australian Cricket Over Quality Of Selection

కోల్‌కతా: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నప్పటి రోజు నుంచి ఇప్పటివరకూ తన శైలిని మార్చుకోలేదు. ఏ విషయమైనా సూటిగా చెబుతుంటాడు. సోమవారం మీడియా సమావేశంలో పాల్గొన్న గంగూలీ ఆస్ట్రేలియా క్రికెట్ దిగజారిపోతుందంటూ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌కు ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న గంగూలీ.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ స్టీవ్ వా సోషల్ మీడియాలో చేసిన ట్వీట్‌ పట్ల వ్యంగ్యంగా స్పందించాడు. ఎట్టకేలకు ఆసీస్ క్రికెట్ ఈ స్థితికి దిగజారిందంటూ అభిప్రాయపడ్డాడు.

సెలక్షన్ కమిటీ ఇంతటి దుస్థితి

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ స్టీవ్ వా అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా సిడ్నీలో జరగనున్న నాలుగో టెస్టుకు జట్టును సూచించాడు. బ్యాటింగ్‌లో ఆర్డర్ ఇలా ఉంటే బాగుందంటూ క్రికెట్ ఆస్ట్రేలియాకు సూచించాడు. సిడ్నీ టెస్టుకు ఎంపికైన ఆసీస్ జట్టులో బ్యాటింగ్ ఆర్డర్ ఇలా ఉంటే బాగుంటుదంటూ పేర్కొన్నాడు. దీనిపై మాజీ కెప్టెన్ గంగూలీ మండిపడ్డాడు. క్రికెట్ సెలక్షన్ కమిటీ ఇంతటి దుస్థితికి చేరుకుంది. గొప్పగొప్ప వాళ్లంతా జట్టును ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసి మరి సూచనలు చేస్తున్నారు. ఆ తర్వాత గంగూలీ అశ్విన్ ఫిట్‌నెస్ గురించి మాట్లాడాడు.

అశ్విన్ ఫిట్‌నెస్ విషయంలో చాలా బాధపడ్డా

అశ్విన్ ఫిట్‌నెస్ విషయంలో చాలా బాధపడ్డా

'రవిచంద్రన్ అశ్విన్ ఫిట్‌నెస్ విషయంలో చాలా బాధపడ్డాను. ప్రముఖమైన టెస్టులకు అశ్విన్ హాజరుకాలేకపోతున్నాడు. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలతో పాటు ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనలోనూ అదే జరిగింది. జట్టుకు ఇప్పుడు తన అవసరం ఎంతగానో ఉంది. కానీ, అతను జట్టుకు దూరంగా ఉన్నాడు. తప్పిదాలను పునరావృతం చేయడం ఎంతమాత్రం మంచిది కాదు' అని గంగూలీ వెల్లడించాడు.

ఫిట్‌నెస్ లోపంతోనే బాధపడుతుండటంతో

ఫిట్‌నెస్ లోపంతోనే బాధపడుతుండటంతో

ప్రత్యర్థి జట్టు ఆస్ట్రేలియాలో స్పిన్నర్ అద్భుత ప్రదర్శన చేసిన నాథన్ లయన్ టీమిండియా ఎనిమిది వికెట్లను పడగొట్టాడు. ఈ ఏడాది విదేశాల్లో జరిగిన టెస్టు మ్యాచ్‌లలో అశ్విన్ మిస్సయ్యిన వాటిలో ఇది 11వది. జోహన్నెస్‌బర్గ్ వేదికగా ఆడిన టెస్టులో భారత్ నలుగురు ఫేసర్లు అవసరమైన నేపథ్యంలో అశ్విన్‌ను దూరంగా పెట్టింది. సౌతాంప్టన్ టెస్టులోనూ ఫిట్‌నెస్ లోపంతో బాధపడుతుండటంతో జట్టుకు దూరమైయ్యాడు.

Story first published: Monday, December 31, 2018, 18:20 [IST]
Other articles published on Dec 31, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X