న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హాంకాంగ్‌పై పాక్ గెలిచేసింది!!

Asia Cup 2018 Highlights: Pakistan beat Hong Kong by eight wickets

హైదరాబాద్: ఆసియాకప్‌లో పాకిస్థాన్‌ ఘనంగా బోణీ కొట్టింది. ఫేసర్లు ఉస్మాన్‌ఖాన్‌, హసన్‌ అలీతో పాటు స్పిన్నర్‌ షాదాబ్‌ఖాన్‌ విజృంభించడంతో గ్రూప్‌-ఎ మ్యాచ్‌లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో పసికూన హాంకాంగ్‌ను చిత్తుగా ఓడించింది. బుధవారం జరిగే పోరులో పాకిస్థాన్‌.. చిరకాల ప్రత్యర్థి భారత్‌తో తలపడనుంది. ఆదివారం మొదట బ్యాటింగ్‌ చేసిన హాంకాంగ్‌ జట్టు పాక్‌ బౌలర్లు ఉస్మాన్‌ఖాన్‌ (3/19), హసన్‌ అలీ (2/19), షాదాబ్‌ఖాన్‌ (2/31) ధాటికి 37.1 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది.

పాక్‌ బౌలర్ల ధాటికి విలవిల్లాడిన హాంగ్ కాంగ్:

పాక్‌ బౌలర్ల ధాటికి విలవిల్లాడిన హాంగ్ కాంగ్:

ఇమాముల్‌ హక్‌ (50 నాటౌట్‌; 69 బంతుల్లో 3×ఎఫోర్లు, ఒక సిక్సు రాణించడంతో లక్ష్యాన్ని పాక్‌ 23.4 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి ఛేదించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న హాంకాంగ్‌.. పాక్‌ బౌలర్ల ధాటికి విలవిల్లాడింది. ముఖ్యంగా పేసర్లు ఉస్మాన్‌ఖాన్‌, హాసన్‌ అలీ అద్భుతంగా బౌలింగ్‌ చేసి హాంకాంగ్‌ బ్యాట్స్‌మెన్‌ను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఆరంభంలో 17/0తో ఉన్న హాంకాంగ్‌.. పాక్‌ పేసర్ల దెబ్బకు 44 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.

శుభారంభాన్నిచ్చిన ఫకార్‌, ఇమాముల్‌ :

శుభారంభాన్నిచ్చిన ఫకార్‌, ఇమాముల్‌ :

అజీజ్‌ ఖాన్‌ (27), కించిత్‌ షా (26) నిలబడడంతో హాంకాంగ్‌ 97/5తో ఫర్వాలేదనిపించింది. కానీ ఈ స్థితిలో విజృంభించిన ఉస్మాన్‌ఖాన్‌ ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టడంతో హాంకాంగ్‌ 97/8తో నిలిచింది. ఆ తర్వాత మరో ఏడు ఓవర్లలోనే ఆ జట్టు ఆలౌటైంది. స్వల్ప ఛేదనలో పాక్‌కు ఓపెనర్లు ఫకార్‌ జమాన్‌ (24), ఇమాముల్‌ హక్‌ శుభారంభం ఇచ్చారు. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన ఈ జోడీ.. క్రమంగా జోరు పెంచింది.

జట్టును విజయతీరాలకు చేర్చిన ఇమాముల్‌

జట్టును విజయతీరాలకు చేర్చిన ఇమాముల్‌

ఎహ్‌సన్‌ బౌలింగ్‌లో జమాన్‌.. వికెట్‌కీపర్‌ మెంకజీకి చిక్కడంతో పాక్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. జమాన్‌-హక్‌ జోడీ తొలి వికెట్‌కు 41 పరుగులు జత చేసింది. కానీ బాబర్‌ అజాం (33)తో కలిసి ఇమాముల్‌ పరుగుల వేట సాగించడంతో పాక్‌ సాఫీగా లక్ష్యం దిశగా సాగిపోయింది. ఆఖర్లో షోయబ్‌ మాలిక్‌ (9 నాటౌట్‌)తో కలిసి . పాక్‌ జట్టు 23.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

రెండో మ్యాచ్ భారత్‌తో.. భారత్ రెండో మ్యాచ్ పాక్‌తో :

రెండో మ్యాచ్ భారత్‌తో.. భారత్ రెండో మ్యాచ్ పాక్‌తో :

ఇదే ఆసియా కప్‌లో భాగంగా హాంగ్ కాంగ్ రెండో మ్యాచ్‌ను భారత్‌తో సెప్టెంబర్ 18న ఆడనుంది. కాగా, ఇదే క్రమంలో భారత్ తన రెండో మ్యాచ్‌ను సెప్టెంబర్ 19న పాకిస్తాన్‌తో ఆడనుంది. భారత్-పాక్‌ల మధ్య మ్యాచ్‌కు తీవ్ర ఉత్కంఠ నెలకొనడంతో టిక్కెట్ విక్రయాల జోరు ఇప్పటికే ఊపందుకుంది.

Story first published: Monday, September 17, 2018, 11:59 [IST]
Other articles published on Sep 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X