న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'యాషెస్ టెస్ట్ ముగింపులో బొటనవేలు విరిగింది.. అయినా అలానే ఆడా'

Ashes series: My thumb was broken towards the end of 5th Ashes Test: Tim Paine

మెల్బోర్న్: యాషెస్ టెస్ట్ ముగింపులో బొటనవేలు విరిగింది. సమయం లేకపోవడంతో అలానే ఆడాను అని ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ టీమ్ పైనీ తెలిపాడు. పీటర్ సిడిల్ తుంటి గాయంతో బౌలింగ్ చేశాడని తెలిపాడు. చివరి టెస్టులో ఇంగ్లండ్‌ 135 పరుగులు తేడాతో ఘన విజయం సాధించడంతో ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీస్‌ 2-2తో సమం అయింది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌ 2-2తో సమం కాగా.. రెండో టెస్ట్‌ డ్రాగా ముగిసింది.

వైరల్ ఫొటోలు: నగ్నంగా మొదటి వెడ్డింగ్ జరుపుకున్న జంట.. ఎవరో తెలుసా?!!వైరల్ ఫొటోలు: నగ్నంగా మొదటి వెడ్డింగ్ జరుపుకున్న జంట.. ఎవరో తెలుసా?!!

తాజాగా టీమ్ పైనీ మాట్లాడుతూ... 'చివరి టెస్ట్ ముగిసే సమయానికి నా బొటనవేలు విరిగింది. సమయం లేకపోవడంతో అలానే ఆడా. ఇక త్వరగా కోలుకుని శిక్షణలోకి వెళ్ళాలి. ఈ టెస్ట్ జట్టును మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నా. బీబీఎల్‌ను వదులుకోవాలని నిర్ణయించుకున్నా. రెడ్ బాల్ క్రికెట్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నా. ఒక కెప్టెన్‌గా జట్టుకు అవసరమయిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నా. ప్రస్తుతానికి నా దృష్టి అంతా జట్టుపైనే ఉంది. పీటర్ సిడిల్ కూడా గాయంతోనే బౌలింగ్ చేసాడు. సిడిల్ బాగా బౌలింగ్ చేయగలడని జట్టుకు తెలుసు. చాలా మంది అలా భావించరు. జోష్ హాజిల్‌వుడ్, పాట్ కమ్మిన్స్‌లపై పనిభారం పడకుండా చూసుకోవాలి' అని చెప్పుకొచ్చాడు.

చివరి టెస్టులో బౌలర్లు స్టువర్ట్ బ్రాడ్ (4/62) జాక్ లీచ్ (4/49) రాణించడంతో 135 పరుగుల తేడాతో ఇంగ్లండ్ గెలిచింది. 399 పరుగుల లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా 263 పరుగులకు ఆలౌటైంది. మథ్యూ వేడ్ (166 బంతుల్లో 117 ; 17ఫోర్లు, సిక్సర్) సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. యాషెస్ సిరీస్‌ 2-2తో సమమైనా.. స్వదేశంలో జరిగిన గత యాషెస్‌ను గెల్చుకున్నందున ట్రోఫీ ఆ్రస్టేలియా వద్దనే ఉండనుంది. 1972 (47ఏళ్లు) తర్వాత యాషెస్ సిరీస్ సమం కావడం ఇదే తొలిసారి. ఈ సిరీస్‌తో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా చెరో 56 పాయింట్లు సాధించాయి.

Story first published: Wednesday, September 18, 2019, 17:05 [IST]
Other articles published on Sep 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X