న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అడిలైడ్‌లో ఇంగ్లాండ్ విజయానికి 178 పరుగులు: జో రూట్ గెలిపిస్తాడా?

Ashes: Joe Root leads the resistance as England dare to dream against Australia

హైద‌రాబాద్‌: ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా మధ్య రెండో యాషెస్ టెస్ట్ ఆసక్తికరంగా మారింది. 354 టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు తొలిరోజు అంత‌గా క‌లిసిరాలేదు. అయినా స‌రే వ‌రుస‌గా వికెట్లు కోల్పోతున్నా.. కెప్టెన్ రూట్ క్రీజులో నిల‌దొక్కుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు.

అడిలైడ్ టెస్ట్ : ఇంగ్లాండ్ Vs ఆస్ట్రేలియా

ఇంగ్లాండ్ జ‌ట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 176 పరుగులు చేసింది. కెప్టెన్ జో రూట్ (67 నాటౌట్), నైట్ వాచ్‌మన్ క్రిస్ వోక్స్ (5 నాటౌట్) క్రీజులో ఉన్నారు. చివరి రోజు ఇంగ్లండ్ గెలవాలంటే 178 పరుగులు అవసరం ఉండగా.. ఆస్ట్రేలియా ఆరు వికెట్ల దూరంలో నిలిచింది.

భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు ఓపెనర్లు కుక్(16), స్టోన్‌మాన్(36) మంచి ఆరంభాన్నిచ్చారు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 53 పరుగులు జోడించారు. అయితే ఈ ఇద్దరూ ఒక్క పరుగు తేడాలో ఔటవడంతో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. అక్కడి నుంచి కెప్టెన్ రూట్ భారాన్ని తనపై వేసుకున్నాడు. తొలుత విన్స్ (15)తో కలిసి మూడో వికెట్‌కు 37 పరుగులు, మలాన్ (29)తో కలిసి నాలుగో వికెట్‌కు 78 పరుగులు జోడించాడు.

అంతకుముందు ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 138 పరుగులకే కుప్పకూలింది. 4 వికెట్లకు 53 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆసీస్.. వరుసగా వికెట్లు కోల్పోతూనే ఉన్నది. టీమ్‌లో ఖవాజా, స్టార్క్ చేసిన 20 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోర్లు కావడం విశేషం.

ఆండర్సన్ 5, వోక్స్ 4 వికెట్లు తీసుకున్నారు. ఇప్పటికే తొలి టెస్ట్ గెలిచి 1-0 ఆధిక్యంలో ఉన్న ఆస్ట్రేలియా.. ఈ మ్యాచ్‌లోనూ విజయంపై కన్నేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో పోలిస్తే ఆస్ట్రేలియాకే కాస్త విజయావకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఇంగ్లాండ్‌కు ఉన్న ఒకే ఒక్క సానుకూలాంశం కెప్టెన్ రూట్ ఇంకా క్రీజులో ఉండ‌టమే..

Story first published: Tuesday, December 5, 2017, 18:32 [IST]
Other articles published on Dec 5, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X