న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆరు వికెట్లు తీసిన ఆర్చర్‌: ఆసీస్‌ 225 ఆలౌట్‌, ఇంగ్లాండ్‌కు స్వల్ప ఆధిక్యం

Ashes 2019, Oval Test, Day 2, Highlights: Archer six-for puts England in prime position to draw series

హైదరాబాద్: యాషెస్ సిరిస్‌లో చివరిదైన ఓవల్ టెస్టులో ఇంగ్లాండ్‌కు స్వల్ప ఆధిక్యం లభించింది. పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ (6/62) విజృంభణతో ఆస్ట్రేలియా తడబడింది. ఈ సిరిస్‌లో అసాంతం అద్భుత ప్రదర్శన చేసిన స్టీవ్ స్మిత్ (145 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో 80) మరోసారి ఒంటరిపోరాటం చేశాడు. దీంతో ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో 68.5 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది.

ఈ సిరీస్‌లో తొలిసారి తుది జట్టులోకి వచ్చిన ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌ (3/46) కూడా సత్తా చాటడంతో ఆస్ట్రేలియా తక్కువ స్కోరుకే కుప్పకూలింది. ఈ సిరిస్‌లో డేవిడ్‌ వార్నర్‌ (5) దారుణ ఫామ్‌ కొనసాగుతోంది. రెండో ఓవర్‌లోనే అతడిని ఆర్చర్‌ పెవిలియన్‌కు చేర్చాడు. అయితే కీపర్‌ బెయిర్‌స్టో అందుకున్న ఈ క్యాచ్‌పై ఇంగ్లండ్‌ రివ్యూకు వెళ్లగా రీప్లేలో బ్యాట్‌కు బంతికి గ్యాప్‌ స్పష్టంగా కనిపించింది.

మరోసారి నిరాశపరిచిన వార్నర్

మరోసారి నిరాశపరిచిన వార్నర్

కానీ అల్ట్రా ఎడ్జ్‌లో చిన్న స్పైక్‌ కనిపించడంతో థర్డ్ అంపైర్‌ ఔట్‌గా ప్రకటించాడు. దీంతో ఓ యాషెస్‌ సిరీస్‌లో 8 సార్లు సింగిల్‌ డిజిట్‌కే ఔటైన చెత్త రికార్డును వార్నర్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. మరో ఓపెనర్‌ హ్యారిస్‌ (3) కూడా నిరాశపరిచాడు. దీంతో 14 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది. ఈ దశలో స్టీవ్‌ స్మిత్‌ (80) మరోసారి నిలిచాడు.

లబుషేన్‌ నిలకడగా ఆడడంతో

లబుషేన్‌ నిలకడగా ఆడడంతో

లబుషేన్‌ నిలకడగా ఆడడంతో వీరిద్దరి జోడీ మూడో వికెట్‌కు 69 పరుగులు జోడించింది. అయితే, హాఫ్ సెంచరీ ముంగిట లబుషేన్‌ (48)ను ఔట్‌ చేసి ఈ భాగస్వామ్యాన్ని కూడా ఆర్చరే విడదీశాడు. ఆ తర్వాత స్టీవ్ స్మిత్‌ పోరాడుతున్నా అతడికి సరైన సహకారం అందలేదు. ఈ క్రమంలో స్టీవ్ స్మిత్‌ వరుసగా పదో అర్ధసెంచరీ సాధించాడు.

స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత

స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత

దీంతో ఓ జట్టుపై ఇలాంటి ఫీట్‌ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఇంజమామ్‌ ఇంగ్లండ్‌పైనే 9 హాఫ్‌ సెంచరీలు చేశాడు. ఈ జాబితాలో స్మిత్‌, హక్‌ల తర్వాత స్థానాల్లో వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ క్లైవ్‌ లాయిడ్‌(8, ఇంగ్లండ్‌పై), దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ జాక్వస్‌ కల్లిస్‌(8, పాకిస్తాన్‌పై), శ్రీలంక మాజీ కెప్టెన్‌ కుమార సంగక్కరా(8, బంగ్లాదేశ్‌పై ) సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు.మరోవైపు ఆర్చర్‌, కర్రాన్‌ విజృంభించడంతో ఆసీస్‌ వేగంగా వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోరు 187 పరుగుల వద్ద స్మిత్‌ను వోక్స్‌ ఎల్బీగా పంపాడు. 69వ ఓవర్‌లో ఆర్చర్‌ చెలరేగి చివరి 2వికెట్లను తీయడంతో ఆసీస్‌ ఆలౌటైంది.

తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 294 ఆలౌట్

తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 294 ఆలౌట్

అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లాండ్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 9/0తో నిలిచింది. క్రీజులో బర్న్స్‌ (4), డెన్లీ (1) ఉన్నారు. అంతకుముందు ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 294 పరుగులకు ఆలౌటైంది. మిచెల్‌ మార్ష్‌కు ఐదు, కమిన్స్‌కు మూడు వికెట్లు పడగొట్టారు.

Story first published: Saturday, September 14, 2019, 11:58 [IST]
Other articles published on Sep 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X