న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ashes 2021: కేప్టెన్‌గా తొలి టెస్ట్..కుమ్మేసిన కమ్మిన్స్: బైర్లు కమ్మిన ఇంగ్లాండ్

Ashes 1st test 2021 at Gabba: 5-wicket haul for Pat Cummins on his captaincy debut for Australia

బ్రిస్బేన్: ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సాగే యాషెస్ టెస్ట్ సిరీస్ ఆరంభమైంది. ఈ రెండు జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో మొదలైంది. అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఇది. జనవరి 18వ తేదీన ముగుస్తుంది. ఈ దఫా ఆస్ట్రేలియా ఈ సిరీస్‌కు ఆతిథ్యం ఇచ్చింది. 2019లో యాషెస్ సిరీస్‌ను డ్రా ముగిసింది. ప్రస్తుతం యాషెస్ కప్ కంగారూల ఆధీనంలో ఉంది. దాన్ని తిరిగి తెచ్చుకోవాలనే పట్టుదలతో ఆసీస్ గడ్డపై అడుగు పెట్టింది ఇంగ్లాండ్.

Ashes 2021: నిప్పులు చెరిగిన ఆసీస్ పేసర్లు: తొలి ఇన్నింగ్‌లో అవమానకరంగా ఇంగ్లాండ్ ఆలౌట్Ashes 2021: నిప్పులు చెరిగిన ఆసీస్ పేసర్లు: తొలి ఇన్నింగ్‌లో అవమానకరంగా ఇంగ్లాండ్ ఆలౌట్

కుప్పకూలిన ఇంగ్లాండ్..

కుప్పకూలిన ఇంగ్లాండ్..

తొలి టెస్ట్ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్‌లో ఆస్ట్రేలియా జట్టు కుప్పకూలింది. 147 పరుగులకే చాప చుట్టేసింది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ల ధాటికి ఏ మాత్రం ఎదురొడ్డి నిలవలేకపోయింది. 11 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది. 29 పరుగుల వద్ద నాలుగో వికెట్ పడింది. ఆ తరువాత ఏ దశలోనూ కోలుకోలేకపోయింది ఇంగ్లాండ్ ఇన్నింగ్. మిడిలార్డర్ బ్యాటర్లు ఒల్లీ పోప్, వికెట్ కీపర్ జోస్ బట్లర్ మాత్రమే కొంత వరకు ప్రతిఘటించగలిగారు. వారిద్దరి మధ్య ఏర్పడిన భాగస్వామ్యమే టాప్. ఒల్లీ పోప్-35, జోస్ బట్లర్-39 పరుగులు చేశారు. ఓపెనర్ హసీబ్ హమీద్-25, లోయర్ ఆర్డర్ బ్యాటర్ క్రిస్ వోక్స్ 21 పరుగులతో ఫర్వాలేదనిపించుకున్నారు. మరెవరూ డబుల్ ఫిగర్‌ను కూడా అందుకోలేకపోయారు.

 అయిదు వికెట్లు పడగొట్టడం ఆరోసారి..

అయిదు వికెట్లు పడగొట్టడం ఆరోసారి..

పాట్రిక్ జేమ్స్ కమ్మిన్స్.. షార్ట్‌గా పాట్ కమ్మిన్స్ అని పిలుస్తుంటారు. బౌలర్‌గా 28 సంవత్సరాల వయస్సులోనే కమ్మిన్స్ నెలకొల్పిన రికార్డులు అసాధారణం. ఇప్పటిదాకా అతను ఆడింది 35 టెస్ట్ మ్యాచ్‌లే. 169 వికెట్లను పడగొట్టాడు. అతని యావరేజ్ 21.18. డజను సార్లు నాలుగు వికెట్లు తీసుకున్నాడు. మరో ఆరు సార్లు అయిదు వికెట్లు పడగొట్టిన ఘనతను అందుకున్నాడు. ఆరు సంవత్సరాల పాటు టెస్ట్ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు.

కేప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే..

అతన్ని టెస్ట్ జట్టులోకి తీసుకోవడానికి క్రికెట్ ఆస్ట్రేలియా ఏ మాత్రం ఆసక్తి చూపలేదు. 2017 తరువాత టెస్ట్‌ జట్టులో స్థానం కోల్పోయాడు.

అనూహ్యంగా క్రికెట్ ఆస్ట్రేలియా టెస్ట్ కేప్టెన్‌ను చేసింది. తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్‌లోనే ఇంగ్లాండ్ బౌలర్ల భరతం పట్టాడు. ఇక మిగిలిన అయిదు వికెట్లూ కేప్టెన్ పాట్ కమ్మిన్స్ ఖాతాలోకి వెళ్లాయి. కేప్టెన్‌గా అతనికి ఇదే తొలి టెస్ట్ మ్యాచ్. బౌలర్‌గా, కేప్టెన్‌గా తన సత్తా నిరూపించుకోగలిగాడీ ఫాస్ట్ బౌలర్.

13 ఓవర్లలోనే అయిదు..

13 ఓవర్లలోనే అయిదు..

ప్రతిష్ఠాత్మకమైన యాషెస్ టెస్ట్ సిరీస్‌ తొలి టెస్ట్.. తొలి ఇన్నింగ్‌లో తన జట్టును ఆధిక్యంలో నిలబెట్టగలిగాడు. గబ్బా స్టేడియంలో ఆరంభమైన తొలి టెస్ట్‌ తొలి ఇన్నింగ్‌లో పాట్ కమ్మిన్స్ సంధించింది 13.1 ఓవర్లే. ఇంత పరిమిత ఓవర్లలో అయిదు వికెట్లను తీసుకున్న రికార్డును కూడా అతను నెలకొల్పాడు. ఇందులో మూడు మెయిడెన్ ఓవర్లు ఉన్నాయి. మొత్తంగా 28 పరుగులు ఇచ్చి అయిదు వికెట్లు తీసుకున్నాడు. 2.89 ఎకానమీని నమోదు చేశాడు. అతని దెబ్బకు 147 పరుగులకే ఆలౌట్ అయింది ఇంగ్లాండ్ జట్టు.

కమ్మిన్స్‌కు బలైన బ్యాటర్లు వీరే..

కమ్మిన్స్‌కు బలైన బ్యాటర్లు వీరే..

నిప్పు కణికల్లాంటి కమ్మిన్స్ బంతులకు ఇంగ్లాండ్ బ్యాటర్ల వద్ద సమాధానమే లేకపోయింది. ఓపెనర్ హసీద్ హమీద్, ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్, క్రిస్‌వోక్స్, ఒల్లీ రాబిన్‌సన్, మార్క్‌వుడ్ బలి అయ్యారు. సుదీర్ఘ విరామం తరువాత మళ్లీ బ్యాట్ పట్టుకున్న ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స‌ను తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు పంపించాడు. కమ్మిన్స్ బౌలింగ్‌లో లంబుషెన్స్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు స్టోక్స్. బుల్లెట్‌లా దూసుకొచ్చిన కమ్మిన్స్ బంతిని డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. అది ఎడ్జ్ తీసుకుంది. స్లిప్స్‌లో ఉన్న లాంబుషెన్స్ ఎడమ వైపు డైవ్ చేస్తూ లో క్యాచ్‌ను అద్భుతంగా అందుకున్నాడు.

Story first published: Wednesday, December 8, 2021, 11:47 [IST]
Other articles published on Dec 8, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X