రాయుడు, ఖలీల్ మా నిరీక్షణకు తెరదించారు: విరాట్ కోహ్లీ

హైదరాబాద్: వరల్డ్‌కప్‌కు ముందే టీమిండియాకు ఇద్దరు నాణ్యమైన ఆటగాళ్లు దొరికారని కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా గురువారం తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో జరిగిన చివరి వన్డేలో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
దీంతో ఐదు వన్డేల సిరిస్‌ను టీమిండియా 3-1తో సొంతం చేసుకుంది. ఆఖరి వన్డేలో వెస్టిండిస్ నిర్దేశించిన 105 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఆడుతూ పాడుతూ 14.5 ఓవర్లకే ఛేదించింది. ఈ సిరిస్‌లో ఒక మ్యాచ్ టైగా ముగిసిన సంగతి తెలిసిందే. అంతకు ముందు విండిస్ 31.5 ఓవర్లకు 104 పరుగులకు ఆలౌటైంది.
మూడో ఫాస్ట్ బౌలర్ కోసం
ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లో మూడు సెంచరీలు బాది ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్'గా ఎంపికైన కోహ్లి మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ "జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్‌లకి తోడుగా జట్టులోకి మూడో ఫాస్ట్ బౌలర్ కోసం గత కొంతకాలంగా వెతుకుతున్నాం" అని అన్నాడు.

నెం.4 స్థానాన్ని అంబటి రాయుడు చక్కగా భర్తీ చేశాడు
"వరల్డ్ కప్ ముంగిట ఆ స్థానానికి తాను సరిపోతానని ఖలీల్ అహ్మద్ నిరూపించాడు. అలానే బ్యాటింగ్ ఆర్డర్‌లో నెం.4 స్థానాన్ని అంబటి రాయుడు చక్కగా భర్తీ చేశాడు. ఈ రెండు స్థానాల కోసమే గత కొంతకాలంగా సరైన ఆటగాళ్ల కోసం టీమిండియా నిరీక్షించింది. ఒక్క సిరీస్‌లోనే అవి రెండూ భర్తీ కావడంతో చాలా సంతోషంగా ఉంది" అని కోహ్లీ తెలిపాడు.

31.5 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌట్
ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ జట్టు 31.5 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టులో రోహిత్ శర్మ (63 నాటౌట్: 56 బంతుల్లో 5 ఫోర్లు, 4సిక్సులు), విరాట్ కోహ్లి (33 నాటౌట్: 29 బంతుల్లో 6 ఫోర్లు) దూకుడుగా ఆడారు.

3-1తో సిరిస్‌ను చేజిక్కించుకున్న కోహ్లీసేన
ఓపెనర్ శిఖర్ ధావన్(6) తొందరగా పెవిలియన్ చేరినప్పటికీ రోహిత్-కోహ్లిల జోడి మరో వికెట్ పడకుండా ఆడి భారత్‌కు భారత్ జట్టు 14.5 ఓవర్లలోనే విజయాన్ని అందించింది. దీంతో ఐదు వన్డేల సిరిస్‌లో ఈ సిరీస్‌ని భారత్ జట్టు 3-1తో చేజిక్కించుకోగా విశాఖపట్నం వేదికగా ముగిసిన రెండో వన్డే టైగా ముగిసిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications