న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విరాట్ వర్కౌట్ వీడియోపై పీటర్సన్ సెటైర్.. అదిరే పంచ్ ఇచ్చిన కోహ్లీ!!

After retirement: Virat Kohli posts cheeky reply for Kevin Pietersen on his training video

ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలో చిరుతలా మ్యాచ్ మొత్తం పరుగెత్తగల సామర్థ్యం అతని సొంతం. జట్టు సభ్యులంతా రెండు గంటలు కసరత్తులు చేస్తే.. కోహ్లీ నాలుగు గంటలు కష్టపడతాడు. ఎక్కువ సేపు జిమ్‌లో గడుపుతూ భారత ఆటగాళ్లందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అయితే కరోనా వైరస్ కారణంగా జిమ్‌కు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో కోహ్లీ తమ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి ఇంట్లోనే కష్టపడుతున్నాడు.

'పబ్‌కు వెళ్లి మందు తాగొచ్చు కానీ.. క్రికెట్ మాత్రం ఆడకూడదా?''పబ్‌కు వెళ్లి మందు తాగొచ్చు కానీ.. క్రికెట్ మాత్రం ఆడకూడదా?'

విరాట్ వర్కౌట్ వీడియో:

గాల్లో ఎగురుతూ పుష్‌ అప్స్‌ చేసిన వీడియోను గురువారం అభిమానులతో షేర్ చేసుకున్న విరాట్ కోహ్లీ.. శుక్రవారం మరో వీడియోను పంచుకున్నాడు. అందులో పెద్ద సైజులో ఉన్న డుంబుల్స్ (వెయిట్‌లిఫ్టింగ్‌ పుషప్‌) ఎత్తి వర్కౌట్ చేసాడు. అది తన ఫేవరెట్ అని కూడా చెప్పాడు. 'నేను రోజూ ఏదైనా ఎక్సర్‌సైజ్ చేయాలని అనుకుంటే అది ఇదే.. లవ్ ది పవర్ స్నాచ్' అని ట్విట్టర్‌లో కాప్షన్ రాసుకొచ్చాడు కోహ్లీ. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

బైక్‌పై వచ్చేయ్‌.. ఇద్దరం కలిసి చేద్దాం:

బైక్‌పై వచ్చేయ్‌.. ఇద్దరం కలిసి చేద్దాం:

విరాట్ కోహ్లీ వర్కౌట్ వీడియో చూసిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్, ప్రముఖ వ్యాఖ్యాత కెవిన్ పీట‌ర్స‌న్ సరదాగా సెటైర్ వేసాడు. 'ఏయ్‌ కోహ్లీ .. బైక్‌పై వచ్చేయ్‌.. ఇద్దరం కలిసి చేద్దాం' అని కామెంట్ చేసాడు. దీనికి విరాట్ అదిరే పంచ్ ఇచ్చాడు. 'రిటైర్మెంట్ తర్వాత తప్పకుండా వస్తా పీట‌ర్స‌న్' అని కోహ్లీ బదులిచ్చాడు. ఈ సంభాషణ అభిమానులను ఆకట్టుకుంటోంది. పీట‌ర్స‌న్, కోహ్లీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరు ఇప్పటికే లైవ్ షోలు నిర్వహించి పలు విషయాలు పంచుకున్నారు.

యో-యో పాసవ్వడం తప్పనిసరి:

యో-యో పాసవ్వడం తప్పనిసరి:

2017 మధ్య నుంచి భారత క్రికెట్‌లో ఫిట్‌నెస్‌కి సంబంధించి యో-యో పరీక్షలు తప్పనిసరిగా నిర్వహిస్తున్నారు. ఇండియన్ క్రికెట్‌లో ఆటగాళ్లు యో-యో టెస్ట్ పాస్ అవ్వక తప్పదు. అందులో పాస్ అయితేనే జట్టులోకి ఎంపికవుతారు. దీంతో ప్రతిఒక్కరు ఫిట్‌నెస్ మెరుగుపరుచుకునేందుకు నిత్యం కష్టపడుతున్నారు. విరాట్ కోహ్లీ రాకముందు ఆటగాళ్లు ఫిట్‌నెస్‌పై అంతగా దృష్టి సారించలేదు. 2008లో టీమింయాలోకి ఎంట్రీ ఇచ్చిన కోహ్లీ.. గ్రౌండ్ పైనే కాదు బాడీపైనా దృష్టి పెట్టాడు. ఫిట్‌నెస్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన క్రికెటర్. ఆటలోనే కాదు ఫిట్‌నెస్ విషయంలోనూ కోహ్లీనే ముందుండి టీమ్‌ని నడిపిస్తున్నాడు. అతడిని చూసి మిగతా భారత క్రికెటర్లు ఫిట్‌నెస్‌పై దృష్టిసారించారు.

86 టెస్టులు, 248 వన్డేలు, 82 టీ20లు:

86 టెస్టులు, 248 వన్డేలు, 82 టీ20లు:

విరాట్ కోహ్లీ భారత్ తరఫున 86 టెస్టులు, 248 వన్డేలు, 82 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి ఇప్పటికే 20 వేలకు పైగా రన్స్ బాదాడు. మరోవైపు దక్షిణాఫ్రికా సంతతికి చెందిన కెవిన్ పీటర్సన్‌ ఇంగ్లండ్‌ తరఫున క్రికెట్‌ ఆడి సక్సెస్‌ అయ్యాడు. 104 టెస్టుల్లో 8,181 పరుగులు చేయగా.. 136 వన్డేల్లో 4,440 పరుగులు చేశాడు. క్రికెట్ నుంచి తప్పుకున్నాక పీటర్సన్‌ వ్యాఖ్యాతగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Story first published: Saturday, July 4, 2020, 16:10 [IST]
Other articles published on Jul 4, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X