న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

768 ఔట్ల తర్వాత: వికెట్ కీపింగ్ రహాస్యాన్ని వివరించిన ధోని

By Nageshwara Rao
After 768 dismissals, Dhoni reveals the secret behind his success as a wicketkeeper

హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ వికెటీ కీపర్లలో ఒకడు. స్టంప్స్ వెనుకన ధోని చేసే మాయాజాలాన్ని క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరిచిపోరు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన వికెట్ కీపర్ల జాబితాలో ధోని మూడో స్ధానంలో ఉన్నాడు.

'ప్రపంచంలో ఇప్పటికీ అత్యుత్తమ వికెట్ కీపర్ ధోనియే''ప్రపంచంలో ఇప్పటికీ అత్యుత్తమ వికెట్ కీపర్ ధోనియే'

ఈ జాబితాలో దక్షిణాఫ్రికాకు చెందిన మార్క్ బౌచర్ (998)లో అగ్రస్థానంలో ఉండగా ఆస్ట్రేలియాకు చెందిన ఆడమ్ గిల్ క్రిస్ట్ (902) ఔట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక, ధోని (768)తో మూడో స్ధానంలో కొనసాగుతున్నాడు. శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) తరపున చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో ధోని వికెట్ల వెనుకన తన సక్సెస్‌ని వివరించాడు.

వికెట్ కీపర్‌గా ధోని ఖాతాలో మరో అరుదైన రికార్డువికెట్ కీపర్‌గా ధోని ఖాతాలో మరో అరుదైన రికార్డు

'ఇదంతా కేవలం తన కీపింగ్ స్టైల్ వల్లే వచ్చింది. స్టీఫెన్ ప్లెమింగ్ (చెన్నై సూపర్ కింగ్స్ కోచ్) తన తొమ్మిదేళ్ల ఐపీఎల్ కోచింగ్‌లో నెట్ ప్రాక్టీస్‌లో నన్ను ఎప్పుడూ వికెట్ల వెనుక చూడలేదు. కీపింగ్ విషయం అంతా తన మైండ్‌లోనే ఆలోచన చేస్తూ ఉండేవాడిని' అని ధోని పేర్కొన్నాడు.

'నిజానికి కీపర్లు నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో ఎక్కువగా క్యాచ్‌లు పట్టాల్సిన అవసరం లేదు. కొంత మంది కీపర్లు ఫ్లోర్‌లో 'కప్ప స్టైల్'లో దూకుడుగా ఉంటారు. అసలు కీపర్ ఏం చేయాలంటే 100 బంతులను విడిచిపెట్టినా ఫరవాలేదు, కానీ అది క్యాచ్ అయితే మాత్రం తప్పక పట్టాల్సిందే. అదే స్టంపింగ్ విషయానికి వస్తే చేయాల్సిందే. ఇదీ కీపర్‌కు కావాల్సింది' అని ధోని తెలిపాడు.

'మంచి కీపర్‌గా ఉండాల్సిన పనిలేదు. ఎవరైతే బ్యాడ్ కీపర్ అవుతాడో అతడ ఎప్పుడు తడమాడటం చేస్తూ ఉంటాడు. అతడు క్యాచ్‌లను అందుకోవడంతో పాటు స్టంపింగ్ మిస్ అవనివ్వడు. అంతేకాదు మైదాంలో ఫీల్డింగ్ సెట్ చేయడంలో కెప్టెన్‌కు సాయపడుతుంటాడు" అని ధోని వివరించాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, January 20, 2018, 12:30 [IST]
Other articles published on Jan 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X