న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నాకు నేనుగా చెప్పుకున్నా: సింధుపై గెలిచి మారిన్ మరో చరిత్ర

By Nageshwara Rao
I told myself PV Sindhu is leading, I have to fight, says Carolina Marin after BWF World Championships win

హైదరాబాద్: చైనాలోని నాన్‌జింగ్ వేదికగా జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు 21-19, 21-10 తేడాతో కరోలినా మారిన్‌ చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ విజయంతో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మూడుసార్లు స్వర్ణ పతకం నెగ్గిన ఏకైక షట్లర్‌గా 25 ఏళ్ల మారిన్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది.

2014, 2015లో వరుసగా రెండేళ్లు ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ విజేతగా నిలిచిన మారిన్ మరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 2016 రియో ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన తర్వాత గాయం కారణంగా ఆటలో వెనుకబడింది. ఈ ఏడాది యూరోపియన్‌ ఓపెన్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌తో ఫామ్‌లో కొచ్చింది.

సింధుపై గెలవడం చాలా సంతోషంగా ఉంది

సింధుపై గెలవడం చాలా సంతోషంగా ఉంది

తాజాగా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి మరోసారి సత్తా చాటింది. ఫైనల్లో పీవీ సింధుపై నెగ్గిన అనంతరం మారిన్ మాట్లాడుతూ "చాలా సంతోషంగా ఉంది. నాలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు చెప్పలేను. ఈ వారంలో ఏం సాధించానో నాకు నమ్మశక్యంగా లేదు. మూడుసార్లు స్వర్ణ పతకం నెగ్గిన తొలి షట్లర్‌ నేనే. ఇదంతా నా టీమ్ లేకుండా సాధ్యం కాదు" అని తెలిపింది.

సైనాతో ఆడిన మ్యాచ్ నా కెరీర్‌లో గొప్ప మ్యాచ్

సైనాతో ఆడిన మ్యాచ్ నా కెరీర్‌లో గొప్ప మ్యాచ్

"సైనా నెహ్వాల్‌తో ఆడిన మ్యాచ్ నా కెరీర్‌లో ఒక గొప్ప మ్యాచ్. ఈ మ్యాచ్‌లో నేను ఎలా ఆడానన్నది ముఖ్యం కాదు. సైనాతో పోరుకు నేను ఎలా సన్నద్ధమయ్యానన్నదే ముఖ్యం. కోర్టులో సైనాను ఎలా ఓడించాలనన్నదే ముఖ్యం. ఇక, ఈరోజు సింధు కూడా అద్భుత ప్రదర్శన చేసింది. ఫైనల్లో ఆమెను ఓడించడం ఎప్పటికీ ప్రత్యేకమే" అని మారిన్ వెల్లడించింది.

సింధుపై ఫైట్ చేయాలని నాకు నేను చెప్పుకున్నా

సింధుపై ఫైట్ చేయాలని నాకు నేను చెప్పుకున్నా

"గేమ్ మధ్యలో సింధు లీడింగ్‌లో ఉన్నప్పుడు నాను నేను చెప్పుకున్నా. నేను ఫైట్ చేయాలి. ఈరోజు సింధు నాపై నెగ్గలేదు అని ప్రపంచానికి చాటి చెప్పాలి. రెండో గేమ్‌లో సరిగ్గా అలానే చేసి చూపించా" అని కరోలినా మారిన్ తెలిపింది. తాజా విజయంతో సింధుపై గెలుపోటముల రికార్డును మారిన్‌ 7-5తో మెరుగుపరుచుకుంది.

ప్రపంచ ఛాంపియన్‌ కావడం మూడోసారి

ప్రపంచ ఛాంపియన్‌ కావడం మూడోసారి

కాగా, కరోలినా మారిన్‌ ప్రపంచ ఛాంపియన్‌ కావడమిది మూడోసారి. అంతకముందు 2014, 2015ల్లోనూ టైటిల్‌ గెలిచింది. ఇక, సింధు విషయానికి వస్తే, 4వ ప్రపంచ పతకం. రెండు కాంస్యాలు (2013, 2014), రెండు రజతాలు (2017, 2018) గెలిచింది. భారత షట్లర్లలో సింధు తర్వాత అత్యధికంగా సైనా రెండు పతకాలు (రజతం, కాంస్యం) సాధించింది.

 ఫైనల్లో సింధు ఓడటమిది ఎనిమిదోసారి

ఫైనల్లో సింధు ఓడటమిది ఎనిమిదోసారి

2016 రియో ఒలింపిక్స్‌ నుంచి మేజర్‌ టోర్నీల ఫైనల్లో సింధు ఓడటమిది ఎనిమిదోసారి. రియో తర్వాత రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ (2017, 18)లో, రెండుసార్లు హాంకాంగ్‌ ఓపెన్‌ (2017, 18)లో.. ఒక్కోసారి సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌(2017), ఇండియా ఓపెన్‌ (2018), థాయ్‌లాండ్‌ ఓపెన్‌ (2018)లో సింధు ఫైనల్‌ ఓడింది.

Story first published: Monday, August 6, 2018, 15:53 [IST]
Other articles published on Aug 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X