Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asian Games History: All Editions, Host Cities, Winners, Medal Tally & Records

Aichi-Nagoya 2026

చైనాలోని హాంగ్జౌ నగరం 19వ ఆసియా క్రీడలకు వేదికగా నిలుస్తోంది.ఈసారి థీమ్ థ్రిల్లింగ్ గేమ్స్, సామరస్యమైన ఆసియా. 2022లోనే ఆసియా క్రీడలు షెడ్యూలు ప్రకారం జరగాల్సి ఉండగా.. కరోనాతో 2026కు వాయిదా పడ్డాయి. ఇక ఈ క్రీడలు చాలా ఘనంగా నిర్వహించేందుకు చైనా సిద్ధమైంది. ప్రపంచానికి చైనా సంస్కృతి మరియు సాంకేతికతను సృజనాత్మకతను పరిచయం చేసేందుకు ఈ వేదికను సరిగ్గా వినియోగించుకుంటోంది. 45 దేశాల నుంచి 10వేల మంది క్రీడాకారులు ఆసియా క్రీడల్లో పాల్గొంటారు. హాంగ్జౌ‌లో జరిగే ఆసియా క్రీడలతో మానవవనరులు, అంతర్జాతీయ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించగలదని చైనా ప్రపంచానికి చాటనుంది.

Jakarta and Palembang 2018

18వ ఆసియా క్రీడలు ఇండోనేషియాలో జరిగాయి. జకార్తా, పాలెంబాంగ్‌ నగరాలు సంయుక్తంగా నిర్వహించాయి.45 దేశాల నుంచి 11వేలకు పైగా క్రీడాకారులు 40 రకాల క్రీడల్లో పాల్గొన్నారు. అప్పటి థీమ్ ఎనర్జీ ఆఫ్ ఏషియా. ఇండోనేషియా ఘనమైన సంస్కృతి, సంప్రదాయంతో పాటు సుస్థిరత, పర్యావరణంపై అవగాహనను ఈ క్రీడల ద్వారా ప్రమోట్ చేసుకుంది.

Incheon 2014

17వ ఆసియా క్రీడలను దక్షిణ కొరియా దేశంలోని ఇంచియాన్ నగరం ఆతిథ్యం ఇచ్చింది. ఇందులో 9500 మంది క్రీడాకారులు 45 దేశాల నుంచి పాల్గొన్నారు. వైవిధ్యత ఇక్కడ ప్రకాశిస్తుంది అన్న థీమ్‌తో ఈ క్రీడలు సాగాయి. ఈ క్రీడలు సాంస్కృతిక వైవిధ్యం, ఏకత్వం అనే అంశాల మేళవింపుతో జరిగాయి. ఈ క్రీడలు విజయవంతం చేసేందుకు ఇంచియాన్ క్రీడా వనరులపై భారీగా పెట్టుబడులు పెట్టింది. ఈ క్రమంలోనే పట్టణ సదుపాయాలను మెరుగుపరిచి నగరం అభివృద్ధికి దోహదపడేలా చేసింది.

Guangzhou 2010

చైనా దేశంలోని గ్వాంగ్జౌ నగరం 16వ ఆసియా క్రీడలను నిర్వహించింది. 45 దేశాల నుంచి 9700 మంది క్రీడాకారులు 42 క్రీడల్లో పాల్గొన్నారు. ఈ క్రీడలను ఆర్థికాభివృద్ధిని, సాంకేతికతను ప్రపంచానికి చాటేందుకు చైనా ఒక చక్కటి అవకాశంగా మలుచుకుంది. థ్రిల్లింగ్ గేమ్స్, హార్మోనియస్ ఏషియా ఇతివృత్తంతో ఈ ఆటలను నిర్వహించింది. ఈ క్రీడలు వివిధ ఆసియా దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి, అదే సమయంలో ఆయా దేశాల సంస్కృతులను ప్రమోట్ చేసేందుకు ఉపయోగపడ్డాయి.

Doha 2006

దోహా, ఖతార్, ఆసియా క్రీడలకు ఆతిథ్యమిచ్చిన మొదటి మధ్యప్రాచ్య నగరాలుగా చరిత్రకెక్కాయి. 45 దేశాల నుండి 9,520 మంది అథ్లెట్లు 39 క్రీడలలో పాల్గొన్నారు. ఈవెంట్ యొక్క థీమ్, ది గేమ్స్ ఆఫ్ యువర్ లైఫ్, వ్యక్తిగత శ్రేష్ఠతను ప్రేరేపించే లక్ష్యంతో ఈ ఇతివృత్తం ఉంది. అత్యాధునిక వేదికలు మరియు సౌకర్యాలను సృష్టించడం, మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు పెట్టింది ఖతార్. స్పోర్ట్స్‌లో గ్లోబల్ స్పోర్ట్స్ హబ్‌గా మారాలనే తన ఆశయాన్ని ఖతార్ బయటపెట్టింది.

Busan 2002

దక్షిణ కొరియాలోని బుసాన్ నగరం 14వ ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది.44 దేశాల నుండి 7,711 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. డ్రీమ్ ఫర్ యూనిటీ అనే థీమ్‌తో, ఆటలు సహకారం మరియు సామరస్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ క్రీడలు నిర్వహించారు. బుసాన్ వేదికగా జరిగిన ఆసియా క్రీడలు ఆరంభం మరియు ముగింపు వేడుకలు చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించారు.దక్షిణ కొరియా టెక్నాలజీ పరంగా ఎలా దూసుకుపోతోందో ఇక్కడే తెలిసిపోయింది.ఆసియా దేశాల మధ్య స్నేహం చిగురించడంలో అదే సమయంలో ఆయా దేశాల మధ్య సంస్కృతిని అర్థం చేసుకోవడంలో ఈ క్రీడలు దోహదపడ్డాయి.

Bangkok 1998

బ్యాంకాక్ 13వ ఆసియా క్రీడలను నిర్వహించింది.41 దేశాల నుంచి 6554 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఆర్థిక పరిపుష్టిని ప్రమోట్ చేయడంలో ఈ క్రీడలు దోహదపడ్డాయి.అదే సమయంలో అభివృద్ధిని, ఆధునీకరణను కూడా బ్యాంకాక్ చూపించగలిగింది.13వ ఆసియా క్రీడలు ఎన్నో వైవిధ్యమైన క్రీడలకు వేదికగా నిలిచాయి. మరోసారి థాయ్‌లాండ్‌ ఈ ప్రతిష్టాత్మకమైన క్రీడలను నిర్వహించగలదని 13వ ఆసియా క్రీడల ద్వారా నిరూపించింది.

Hiroshima 1994

జపాన్ దేశంలోని హిరోషిమా నగరం 12వ ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది. రేపటి రోజును సృష్టిద్దాం అనే థీమ్‌తో ఈ క్రీడలను నిర్వహించింది.42 దేశాల నుంచి 6828 మంది క్రీడాకారులు 34 క్రీడల్లో పాల్గొన్నారు. ఈ క్రీడలు ప్రధానంగా పర్యావరణ సుస్థిరత,టెక్నలాజికల్ అడ్వాన్స్‌మెంట్ పై దృష్టి సారించాయి.హిరోషిమా నగరం పై అణుబాంబు దాడుల తర్వాత తిరిగి ఎలా కోలుకుని ప్రపంచ దేశాలతో పోటీ పడుతోందో ఈ క్రీడల ద్వారా జపాన్ చాటిచెప్పింది.

Beijing 1990

11వ ఆసియా క్రీడలను తొలిసారిగా చైనాలోని బీజింగ్ నగరం ఆతిథ్యం ఇచ్చింది. 36 దేశాల నుంచి 27 క్రీడల్లో పాల్గొనేందుకు 6,122 మంది క్రీడాకారులు వచ్చారు. ప్రపంచలోని అగ్రదేశాలతో చైనా ఎలా పోటీ పడుతోందో ఈ క్రీడల నిర్వహణ ద్వారా చాటింది.ఈ క్రీడలను విజయవంతంగా చైనా నిర్వహించింది. చైనా నిర్మించిన వేదికలు, కల్పించిన సదుపాయాలు చూస్తే అంతర్జాతీయ క్రీడా రంగంలో గట్టిపోటీ ఇచ్చేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్లు అర్థమైంది.

Seoul 1986

10వ ఆసియా క్రీడలకు దక్షిణ కొరియాలోని సియోల్ ఆతిథ్యం ఇచ్చింది. 27 దేశాల నుంచి 25 క్రీడల్లో 4,839 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.1988 సియోల్ ఒలింపిక్స్‌ నిర్వహించిన దక్షిణ కొరియా మరోసారి అంతర్జాతీ క్రీడలు నిర్వహించి సత్తా చాటింది. సియోల్ నగరంలో నిర్వహించిన ఈ క్రీడలు సక్సెస్ కావడంతో ఆసియా క్రీడా చరిత్రలోనే ఒక మైలురాయిగా మిగిలింది. సియోల్‌లో నిర్వహించిన ఆసియా క్రీడల నుంచే పోటీల్లో పాల్గొనే దేశాల సంఖ్య పెరగడం ప్రారంభమైంది.సదుపాయాలు మెరుగుపర్చడం, క్రీడల ద్వారా ఆసియా దేశాల మధ్య స్నేహబంధం పెంపొందించడంలో ఈ క్రీడలు వేదికగా నిలిచాయి. ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ, భవిష్యత్ క్రీడలకు సియోల్ ఆసియా క్రీడలు బాట వేశాయి.

Bangkok 1978

మూడు సార్లు ఆసియా క్రీడలను నిర్వహించిన ఘనత థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ నగరానికే చెందుతుంది. 8వ ఆసియా క్రీడలకు వేదికగా బ్యాంకాక్ నగరం నిలిచింది.25 దేశాల నుంచి 3,842 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ క్రీడల ద్వారా ప్రాంతీయ క్రీడాస్ఫూర్తి పెంపొందింది.ఈ క్రీడల్లో దివ్యాంగులు కూడా పాల్గొనడం సంచలనం సృష్టించింది.భవిష్యత్తులో మరిన్ని క్రీడలకు ఇది బాట వేసింది.

Tehran 1974

7వ ఆసియా క్రీడలను ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో నిర్వహించారు.25 దేశాల నుంచి 3010 అథ్లెట్లు ఈ క్రీడల్లో పాల్గొన్నారు. ఈ క్రీడల్లో చాలా రకాల క్రీడలను నిర్వహించడంతో పాటు సాంకేతికంగా కూడా ఆకట్టుకున్నాయి. ఈ క్రీడలతో ఎలక్ట్రానిక్ స్కోర్‌బోర్డులను పరిచయం చేశారు.డోపింగ్ టెస్టులు తొలిసారిగా ప్రవేశపెట్టారు. సంస్కృతిని సామర్థ్యాన్ని ప్రదర్శించి ప్రపంచ దేశాలను ఇరాన్ ఆకట్టుకుంది.అయితే కొన్ని దేశాల మధ్య రాజకీయ విబేధాలు, నిషేధాలు ఉన్నప్పటికీ ఇరాన్ ఆసియా క్రీడలు మాత్రం విజయం సాధించాయి.

Bangkok 1970

6వ ఆసియా క్రీడలకు బ్యాంకాక్ ఆతిథ్యం ఇచ్చింది. వాస్తవానికి దక్షిణ కొరియా నగరం సియోల్ నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఆర్థిక సంక్షోభం, భద్రత పరంగా భయాలు నెలకొనడంతో ఈ క్రీడల నిర్వహణ నుంచి దక్షిణ కొరియా తప్పుకుంది.18 దేశాల నుంచి 14 క్రీడల్లో 2400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ క్రీడలను విజయవంతంగా నిర్వహించడం ద్వారా ఇలాంటి మరెన్నో అంతర్జాతీయ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించగలమని థాయ్‌లాండ్ నిరూపించింది.

Bangkok 1966

5వ ఆసియా క్రీడలకు థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ నగరం ఆతిథ్యం ఇచ్చింది. 1966 డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 20 వరకు ఈ క్రీడలు నిర్వహించారు.ఇక తొలిసారిగా క్రీడల్లో పాల్గొనే సంఖ్య 20కి చేరింది.వివిధ దేశాల సంస్కృతులను ఈ క్రీడల ద్వారా థాయ్‌లాండ్ ఏకం చేసింది.జిమ్నాస్టిక్స్ సెపాక్ తాక్రా‌లాంటి క్రీడలను 5వ ఆసియా క్రీడల్లోనే తీసుకొచ్చారు. ఈ క్రీడల ద్వారా ఆయా ఆసియా దేశాల మధ్య సహృదభావం పెంపొందించడమే కాకుండా సామరస్యతను కూడా పెంపొందించాయి.

Jakarta 1962

4వ ఆసియా క్రీడలకు ఇండోనేషియాలోని జకార్తా నగరం ఆతిథ్యం ఇచ్చింది. 1962 ఆగష్టు 24 నుంచి సెప్టెంబర్ 4 వరకు ఈ క్రీడలు జరిగాయి. ఈ క్రీడలకు ఎంతో గుర్తింపు దక్కింది. ఇందుకు కారణం ఒక చిన్న దేశమైన ఇండోనేషియా ప్రతిష్టాత్మక క్రీడలను చాలా విజయవంతంగా నిర్వహించడమే. క్రీడాకారుల సంఖ్యతో పాటు క్రీడల సంఖ్య పెరుగుదల కూడా 4వ ఆసియా క్రీడల్లో కనిపించింది.ఆర్చరీ, బాస్కెట్‌బాల్‌ క్రీడలను 4వ ఆసియా క్రీడల్లో తీసుకొచ్చారు.స్నేహపూర్వకమైన పోటీతత్వం ఈ క్రీడల్లో కనిపించింది. మొత్తం 17 దేశాలు పాల్గొన్నాయి. అంతర్జాతీయ సహకారం, సహృద్భావ వాతావరణంకు జకార్తా ఆసియా క్రీడలు వేదికగా నిలిచాయి.

Tokyo 1958

3వ ఆసియా క్రీడలకు జపాన్‌లోని టోక్యో నగరం వేదికగా నిలిచింది. 1958 మే 24 నుంచి జూన్ 1 వరకు ఈ క్రీడలు జరిగాయి.20 దేశాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడారంగంలో ఆసియా దేశాలు దూసుకెళుతున్నాయన్న సందేశం ఈ వేదిక ద్వారా ప్రపంచానికి తెలిసింది.ప్రాంతీయ సామరస్యతను టోక్యో క్రీడలు చాటాయి. జూడో, బాస్కెట్‌బాల్ లాంటి ట్రెండింగ్ క్రీడలను 3వ ఆసియా క్రీడా జాబితాలో చేర్చారు. అతిపెద్ద క్రీడాపోటీలను నిర్వహించగల సత్తా ఆసియా దేశాలకు ఉందని టోక్యోలో నిర్వహించిన ఆసియా క్రీడల ద్వారా బయట ప్రపంచానికి తెలిసింది.

Manila 1954

ఫిలిప్పైన్స్‌లోని మనీలా దేశం 2వ ఆసియా క్రీడలకు ఆతిథ్యమిచ్చింది. 1954 మే 1 నుంచి మే 9వరకు ఈ క్రీడలు జరిగాయి. 18 దేశాల వరకు ఈ క్రీడల్లో పాల్గొన్నాయి.ఈ క్రీడల్లో కొత్తగా ఆఫ్గానిస్తాన్,కంబోడియా, దక్షిణ కొరియా దేశాలు చేరాయి. క్రీడారంగంలో సత్తా చాటుతూ తొలిసారిగా బాక్సింగ్, షూటింగ్ క్రీడలను పరిచయం చేశాయి. దేశాల మధ్య స్నేహబంధం పెంపొందించడం, క్రీడాస్ఫూర్తిని నింపడంతో పాటు అంతర్జాతీయ సహాయసహకారాలకు ఈ క్రీడావేదిక బీజం వేసింది.

New Delhi 1951

1951లో తొలి ఆసియా క్రీడలను భారత్‌లోని న్యూఢిల్లీ నగరంలో నిర్వహించారు. 1951 మార్చి 4వ తేదీ నుంచి మార్చి 11వ తేదీ వరకు ఈ క్రీడలు జరిగాయి.ఆసియా గేమ్స్ ఫ్రెడరేషన్ ఈ క్రీడలను అత్యంత వైభవంగా నిర్వహించింది. ఆసియా దేశాల మధ్య స్నేహబంధం పెంపొందించేం ముఖ్య ఉద్దేశంతో ఈ క్రీడలను నిర్వహించడం జరిగింది.అథ్లెటిక్స్, బాస్కెట్ బాల్, ఫుట్‌బాల్, స్విమ్మింగ్, టెన్నిస్, వెయిట్‌ లిఫ్టింగ్ లాంటి క్రీడల్లో పోటీలు జరిగాయి. భారత్ పతకాల పట్టికలో తొలిస్థానంలో నిలిచింది.మొత్తం 11 దేశాలు పాల్గొన్న ఈ తొలి ఆసియా క్రీడల్లో...దేశాల మధ్య క్రీడా సంప్రదాయానికి తెరలేచింది.అదే సమయంలో పలు దేశాల మధ్య విభిన్న సంస్కృతులను అర్థం చేసుకునేందుకు ఈ వేదిక చక్కగా ఉపయోగపడింది.

Asian Games History FAQs

  • When were the first Asian Games held?
    The first Asian Games were held in New Delhi, India, from March 4 to March 11, 1951.
  • Which country hosted the first Asian Games?
    India hosted the inaugural Asian Games in New Delhi in 1951.
  • How many countries participated in the first Asian Games?
    Eleven countries participated in the inaugural Asian Games held in New Delhi in 1951.
  • Which city has hosted the Asian Games the most times?
    Bangkok has hosted the Asian Games three times, in 1966, 1970 and 1978.
  • Which country has hosted the Asian Games the most times?
    China has hosted the Asian Games three times: Beijing in 1990, Guangzhou in 2010 and Hangzhou in 2023.
  • Which country is the most successful in Asian Games history?
    China is the most successful nation in Asian Games history in terms of overall medal performance and gold medals.
  • How many medals did India win at the 2023 Asian Games?
    India won 107 medals at the Hangzhou 2023 Asian Games, including 28 gold, 38 silver and 41 bronze medals.
  • When will the next Asian Games be held?
    The 2026 Asian Games will be held in Aichi-Nagoya, Japan, from September 19 to October 4, 2026.
  • Where will the Asian Games 2026 be held?
    The 2026 Asian Games will be hosted in Aichi-Nagoya, Japan.
  • How often are the Asian Games held?
    The Asian Games are generally held once every four years.
  • What were the sports in the first Asian Games?
    The first Asian Games featured athletics, basketball, football, swimming, tennis and weightlifting.
  • When did China first participate in the Asian Games?
    China began participating in the Asian Games in 1974 and has since become the dominant nation in the medal standings.
  • When did India host the Asian Games?
    India hosted the Asian Games twice, in New Delhi in 1951 and again in 1982.
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+