న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆసియా గేమ్స్: ఇరాన్ చేతిలో ఓటమి, మహిళల కబడ్డీ జట్టుకు రజతం

By Nageshwara Rao
Asian Games 2018 Day 6: India women settle for silver in kabaddi

హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్‌లో భారత క్రీడాకారులు నిరాశపరుస్తున్నారు. స్వర్ణ పతకం ఖాయమనుకున్న క్రీడలో ఒకటైన కబడ్డీలో భారత్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ ఆసియా గేమ్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన భారత మహిళల కబడ్డీ జట్టు ఫైనల్స్‌లో ఓటమిపాలైంది.

శుక్రవారం ఇరాన్‌తో జరిగిన ఫైనల్లో భారత మహిళల కబడ్డీ జట్టు 24-27 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో భారత్‌ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే పురుషుల జట్టు సెమీస్‌లో ఓడిపోయి కాంస్యంతో సరిపెట్టుకోగా.. తాజాగా మహిళల జట్టు ఫైనల్లో నిరాశ పరచడం విశేషం.

ఈ మ్యాచ్‌లో తొలుత ఇరాన్‌పై 6-2తో ఆధిపత్యం సాధించింది. ఆట తొలి అర్ధభాగం పూర్తయ్యే సరికి భారత్‌ 13-11తో ముందంజలో ఉంది. ఆ తర్వాత ఇరాన్‌ అద్భుతంగా పుంజుకుంది. వరుసగా పాయింట్లు సాధిస్తూ 17-13తో భారత్‌పై పైచేయి సాధించింది. ఆ తర్వాత భారత్‌ను ఏ దశలోనూ ప్రత్యర్థికి పోటీనివ్వలేకపోయింది.

చివరికి 27-24 పాయింట్లతో ఓటమి చవిచూసింది. దీంతో స్వర్ణం సాధిస్తుందనుకున్న భారత మహిళల కబడ్డీ రజతంతో సరిపెట్టుకుంది. తాజా పతకంతో ఆసియా గేమ్స్‌లో భారత్ పతకాల సంఖ్య 24కు చేరింది. ప్రస్తుతం భారత ఖాతాలో 5 స్వర్ణ, 5 రజత, 14 కాంస్య పతకాలు ఉన్నాయి.

Story first published: Friday, August 24, 2018, 15:01 [IST]
Other articles published on Aug 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X