కుల పిచ్చోడికి స్టార్ క్రికెటర్ స్ట్రాంగ్ కౌంటర్!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్ స్టార్ దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే) అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన ఈ పార్టీ ఏకంగా 108 స్థానాలను కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది. ఈ అద్భుత విజయంపై టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ.. విజయ్‌ను అభినందించారు. తాను కేవలం విజయ్ అనే నటుడికే అభిమానిని కాదని.. ఆయన చూపించే బాటలో నడిచే నాయకుడిని అనుసరించాలని కోరుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నారు.
బ్రాహ్మణుడు అంటూ నెటిజన్ ట్రోలింగ్
రవిచంద్రన్ అశ్విన్ చేసిన ఈ పోస్టుపై ఓ నెటిజన్ అభ్యంతరకరంగా స్పందించాడు. రవిచంద్రన్ అశ్విన్‌ను ఉద్దేశిస్తూ.. "ద్రవిడ పాలన అంటే భయపడే ఓ బ్రాహ్మణుడు" అని కామెంట్ చేస్తూ ఓ ఉడుత ఫోటోను షేర్ చేశాడు. అశ్విన్ కులాన్ని ప్రస్తావిస్తూ ఆయనను తక్కువ చేసి చూపేలా ఆ నెటిజన్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. అయితే మైదానంలోనే కాదు సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉండే అశ్విన్.. ఈ కామెంట్లపై తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు.

అశ్విన్ ఇచ్చిన నోరుమూయించే సమాధానం
ట్రోలర్ కామెంట్లకు అశ్విన్ స్పందిస్తూ.. "నేను ఎక్కడ జన్మించాలనేది నా ఇష్టం కాదు. కానీ మంచి తల్లిదండ్రుల వద్ద పుట్టినందుకు నేను గర్విస్తున్నాను. నాయకత్వం అంటే ఎదుటి వ్యక్తి కష్టాల పట్ల సానుభూతి కలిగి ఉండటం, ఆటంకాలను దాటి అభివృద్ధిని సాధ్యం చేయడం అని నా తల్లిదండ్రులు, గురువులు నేర్పారు. మనం వంశం లేదా కులం గురించి మాట్లాడుకోవడం మానేసే రోజు వరకు నేను బ్రతకాలని కోరుకుంటున్నాను" అని అశ్విన్ రాసుకొచ్చారు. అశ్విన్ ఇచ్చిన ఈ సమాధానం నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.
విజయ్ ప్రభంజనం
మరోవైపు ఈ ఎన్నికల్లో విజయ్ రెండు స్థానాల (పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్) నుండి పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు. అధికార డీఎంకే కేవలం 59 స్థానాలకే పరిమితం కాగా.. స్వయంగా సీఎం ఎంకే స్టాలిన్ కూడా ఓటమి పాలుకావడం గమనార్హం. ఓ నటుడిగా కాకుండా పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా విజయ్ తమిళనాట కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications