అభిషేక్- వైభవ్.. ఐపీఎల్ స్వరూపాన్నే మార్చేస్తారు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్లలో గత కొన్ని సీజన్‌ల నుంచి బ్యాటింగ్ విధానం పూర్తిగా మారింది. 30-గజాల సర్కిల్ వెలుపల ఇద్దరు ఫీల్డర్ల నిబంధనను సద్వినియోగం చేసుకుంటూ, పవర్‌ప్లేలో పరుగులు రాబట్టడంలో జట్లు అసాధారణ దూకుడును ప్రదర్శిస్తున్నాయి. ఇది కొన్ని అద్భుతమైన స్కోర్‌లకు దారితీసింది.కొన్నిసార్లు ఓవర్‌కు 18 పరుగులు కూడా నమోదయ్యాయి. పవర్ ప్లే.. పేరుకు తగ్గట్టుగా ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు.
ఈ పరిణామాలపై టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. పవర్ ప్లేలో భారీగా పరుగులు చేస్తేనే మ్యాచ్ గెలిచినట్లు భావించాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. అదే కంటిన్యూ అయితే ఐపీఎల్ టైటిల్ కూడా దక్కించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. స్పోర్ట్స్‌స్టార్ 'ఇన్‌సైట్ ఎడ్జ్' పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడారు. మొదటి ఆరు ఓవర్లలో వీలైనన్ని పరుగులు చేస్తేనే మ్యాచ్ గెలిచినట్టవుతోందని, ఈ విషయంలో ఎటువంటి గేమ్ ప్లాన్ కూడా పెద్దగా వర్కవుట్ కావట్లేదని పేర్కొన్నారు.

పవర్ ప్లేలో బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తే సులువగా మ్యాచ్ గెలిచినట్టేనని మంజ్రేకర్ తేల్చి చెప్పారు. అలా ఆడిన జట్టు చివరికి టైటిల్ గెలిచినా కూడా ఆశ్చర్యపోనక్ర్లేదని, అంతా పవర్ ప్లే పైనే ఆధారపడి ఉందని ఆయన పేర్కొన్నారు. పవర్‌ప్లేను తొలగించాలని తాను ఒకప్పుడు కోరుకున్నానని, దాని ప్రస్తుత పరిణామం తనకు కనువిప్పు కలిగించిందని మంజ్రేకర్ అన్నారు.
బౌలర్‌లకు అవకాశం ఇవ్వడం కోసం అప్పట్లో తాను ఈ ప్రతిపాదనను తీసుకొచ్చానని, బ్యాటింగ్ 'అమ్యునిషన్' పుష్కలంగా ఉందని ఆటగాళ్లు, జట్లు గ్రహించాయని వ్యాఖ్యానించారు. ఐపీఎల్ కొనసాగుతున్న కొద్దీ మొదటి ఆరు ఓవర్లు కీలకంగా మారాయని, టీ20 క్రికెట్‌లో ఇది అత్యంత వేగవంతమైన పరిణామమని అన్నారు. ఈ పరిణామం తనకు కూడా కనువిప్పు కలిగించిందని వివరించారు. ఈ మార్పునకు భారత యువ బ్యాటర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీలే కారణమని మంజ్రేకర్ ప్రశంసించారు.
ఈ ఇద్దరు బ్యాటర్లు దూకుడుగా ఆడటాన్ని ప్రోత్సహిస్తోన్నారని చెప్పారు. ఇతర జట్ల ఓపెనర్లు కూడా దీన్నే అనుసరిస్తోన్నారని అన్నారు. మొదట అభిషేక్ శర్మ, ఆ తర్వాత వైభవ్ సూర్యవంశీ ఈ రకమైన ట్రెండ్ ను సెట్ చేశారని చెప్పారు. దీని ఫలితంగా భవిష్యత్తులో ఐపీఎల్ రూపురేఖలు మారిపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఓపెనర్లు పవర్‌ప్లేను సద్వినియోగం చేసుకుని 40-45 బంతుల్లోనే సెంచరీలు బాదుతున్నారని, 140 స్ట్రైక్ రేట్‌తో ఆడుతున్నారంటే దీనికి కారణం అభిషేక్, సూర్యవంశీలేనని అన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications