ట్రావిషేక్ పై బౌలింగ్ చేయాలంటే ఆ రూ. 18 కోట్ల బౌలర్ కు భయం
ఐపీఎల్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే సగం టోర్నమెంట్ ముగిసింది. నాలుగు మినహా మిగిలిన అన్ని జట్లూ పదేసి చొప్పున మ్యాచ్ లు ఆడేశాయి. పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో స్థానంలో నిలవగా.. సన్ హైదరాబాద్ మూడో పొజీషన్ లో ఉంది. రాజస్థాన్ రాయల్స్ నాలుగో స్థానానికి పరిమితమైంది ప్రస్తుతానికి. నేడు సన్ రైజర్స్ తో తలపడబోతోంది పంజాబ్ కింగ్స్. ఈ మ్యాచ్ ఫలితం.. తొలి నాలుగు స్థానాలను ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదు.
ఈ పరిస్థితుల్లో సంజయ్ బంగర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ కింగ్స్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ ఫామ్ పై ఆందోళన వ్యక్తం చేశాడ. చాహల్ ను పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆచితూచి వాడుతున్నాడని పేర్కొన్నాడు. రూ. 18 కోట్ల చాహల్ ఎడమచేతి వాటం బ్యాటర్లను ఎదుర్కొనడంలో ఇబ్బంది పడటం దీనికి కారణం. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వంటి లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ పై చాహల్ ను ప్రయోగించడానికి పెద్దగా ఇష్టపడకపోవచ్చని వ్యాఖ్యానించాడు.

స్టార్ స్పోర్ట్స్ షో గేమ్ ప్లాన్ లో బంగర్ మాట్లాడారు. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లలో శివమ్ దూబేకు వ్యతిరేకంగా చాహల్‌ను అయ్యర్ బౌలింగ్‌కు దించలేదని గుర్తుచేశారు. ఇద్దరు ఎడమచేతి వాటం బ్యాటర్లు క్రీజులో ఉన్నప్పుడు చాహల్ పరుగుల సగటు 12 వరకు ఉంటోందని గుర్తుచేశారు.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఎనిమిది ఇన్నింగ్స్‌లలో, చాహల్ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌లకు 64 బంతుల్లో 110 పరుగులు ఇచ్చి ఒకే ఒక వికెట్ మాత్రమే తీశారు. అతని బౌలింగ్ సగటు 110.0 కాగా, ఎకానమీ రేటు 10.31గా ఉన్నాయి. ఇది అతని వైఫల్యాన్ని ఎత్తి చూపినట్టయింది. అదే సమయంలో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలపై చాహల్ తో బౌలింగ్ చేయించడానికి అయ్యర్ అంత త్వరగా నిర్ణయం తీసుకోకపోవచ్చని సంజయ్ బంగర్ తెలిపారు.
ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌లకు వ్యతిరేకంగా గతంలో బాగా బౌలింగ్ చేసినా, ప్రస్తుతం ఇబ్బంది పడటానికి గల కారణాన్ని యుజ్వేంద్ర చాహల్ స్వయంగా అర్థం చేసుకోవాలని సంజయ్ బంగర్ సూచించారు. తన సామర్థ్యంపై నమ్మకం వ్యక్తం చేయడానికి చాహల్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో మాట్లాడాలని ఆయన సలహా ఇచ్చారు. యుజ్వేంద్ర చాహల్ కు తగినంత అనుభవం, సామర్థ్యం ఉందని, తాను వికెట్లు పడగొట్టగలననే ధైర్యాన్ని కేప్టెన్ కు ఇవ్వాల్సిన బాధ్యత అతని మీదే ఉందని స్పష్టం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications