Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాకిస్తాన్ ప్లేయర్లకు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్న భారత్- బిగ్ యూటర్న్

క్రీడా మంత్రిత్వ శాఖ బుధవారం కీలక ప్రకటన చేసింది. గత ఏడాది పాకిస్తాన్‌తో విధించిన ద్వైపాక్షిక క్రీడా సంబంధాల పూర్తి నిషేధం కొనసాగుతుందని, మల్టీ నేషనల్ ఈవెంట్లు ఆడే పాకిస్తాన్ ప్లేయర్లు, అథ్లెట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపబోమని స్పష్టం చేసింది. అంతర్జాతీయ ఈవెంట్లల్లో ఆడటానికి భారత్ కు రావొచ్చని తేల్చి చెప్పింది. ద్వైపాక్షిక అంటే భారత్- పాకిస్తాన్ రెండు దేశాలు మాత్రమే ఆడే టోర్నమెంట్లు, సిరీస్ లపై మాత్రం నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది.

భారత్ ను ప్రపంచ క్రీడలకు ప్రధాన గమ్యస్థానంగా మార్చే విషయంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. వివిధ దేశాల క్రీడాకారులు, జట్టు అధికారులు, సాంకేతిక సిబ్బంది, సపోర్టింగ్ స్టాఫ్, అంతర్జాతీయ క్రీడా పాలకమండలి కార్యనిర్వాహకుల తరహాలోనే ఇకపై పాకిస్తాన్ కూడా భారత్ కు రావొచ్చని, ఆయా ఈవెంట్లల్లో భాగస్వామ్యం కావొచ్చని తేల్చి చెప్పింది. అందరిలాగే పాకిస్తాన్ ప్లేయర్లకూ వీసా ప్రక్రియను సులభతరం చేస్తామని క్రీడా మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది.

India has formally opened the door for Pakistani Players and athletes to compete on its soil visa

జాతీయ క్రీడా సమాఖ్యలు (NSF), భారత ఒలింపిక్ సంఘం (IOA), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI), ఇతర అనుబంధ సంస్థలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఈ మేరకు సర్క్యులర్‌ పంపించింది. ఇందులో.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను పొందుపరిచింది. అన్ని ఈవెంట్లకూ వర్తించిన నిషేధాన్ని పాక్షికంగా సడలించింది కేంద్రం. ద్వైపాక్షిక క్రీడా ఈవెంట్‌లలో భారత్ - పాకిస్తాన్‌లో ఎప్పటికీ పోటీపడబోవని, పాకిస్తాన్ జట్లను భారత్‌లో ఆడేందుకు అనుమతించట్లేదని పేర్కొంది.

అంతర్జాతీయ ఈవెంట్లు, ఐసీసీ, ఐఓఏ వంటి ఇంటర్నేషనల్ కార్యక్రమాలకు ఈ నిషేధం వర్తించబోదు. అవన్నీ కూడా భారత క్రీడాకారుల ప్రయోజనాల ఆధారంగా జరుగుతాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. పాకిస్తాన్ జట్లు పాల్గొనే అంతర్జాతీయ ఈవెంట్‌లలో భారత క్రీడాకారులు పాల్గొంటారని, అలాగే భారత్ ఆతిథ్యం ఇచ్చే బహుళపాక్షిక ఈవెంట్‌లలో పాకిస్తాన్ క్రీడాకారులు, జట్లు పాల్గొంటాయని ఆ సర్క్యులర్‌లో తెలిపింది.

2030 కామన్వెల్త్ గేమ్స్, 2036 ఒలింపిక్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వాలని భారత్ ఆకాంక్షిస్తోంది. ప్రపంచ ఈవెంట్‌లకు స్నేహపూర్వక ఆతిథ్యాన్ని అందించేందుకు ఒలింపిక్ చార్టర్, దాని సమీకరణ తత్వాన్ని పాటిస్తుందని ఈ విధానం స్పష్టం చేస్తోంది. అంతర్జాతీయ క్రీడా ఈవెంట్‌లకు భారత్‌ను ప్రాధాన్య గమ్యస్థానంగా నిలపడానికి, క్రీడాకారులు, జట్టు అధికారులు, సాంకేతిక సిబ్బంది, అంతర్జాతీయ క్రీడా పాలకమండలి కార్యనిర్వాహకుల వీసా ప్రక్రియను సులభతరం చేస్తామని హామీ ఇచ్చింది.

Story first published: Wednesday, May 6, 2026, 15:48 [IST]
Other articles published on May 6, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+