న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేను కూడా జంక్ ఫుడ్ తిన్నా: విరాట్ కోహ్లీ

Virat Kohli Reveals His Past Food Habits And How Hes Changed It

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ ఫ్రీక్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచంలోనే అత్యంత ఫిట్‌గా ఉన్న క్రికెటర్ విరాట్ కోహ్లీ ఒక్కడే అని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. గత ఎనిమిదేళ్లలో ఒక్కసారి కూడా నేషనల్ క్రికెట్‌ అకాడమీ (NCA) వైద్య సేవలను వినియోగించుకోని ఏకైక భారత క్రికెటర్‌ ఎవరైనా ఉన్నారా? అదే ఒక్క కోహ్లీనే. ఫిట్‌నెస్ సమస్యలతో జట్టుకు దూరమైన సందర్భాలు కూడా లేవు. సౌతాఫ్రికా పర్యటనలో వెన్ను నొప్పితో ఒకే ఒక్క మ్యాచ్ విరాట్ ఆడలేదు. అంతే తప్పా ప్రతీ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు.

అత్యంత ఫిట్‌గా ఉంటూ యువ ఆటగాళ్లకు విరాట్ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆహారం విషయంలో క్రమశిక్షణ పాటించడంతోనే తాను ఇంత ఫిట్‌గా ఉన్నానని చాలా సార్లు చెప్పిన విరాట్ కోహ్లీ.. గతంలో తాను కూడా అందరిలానే ఉండేవాడినని తాజాగా వెల్లడించాడు. టీనేజ్‌ వయసులో ప్రపంచంలో ఉన్న జంక్ ఫుడ్ మొత్తం తిన్నానని, ఆ తర్వాత తన ఆహార నియమాలను మార్చుకొని ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టానని తెలిపాడు.

'ఎవరైనా సరే 25 ఏళ్ల వయసు వచ్చే వరకు డైట్‌ విషయంలో పెద్దగా కట్టుదిట్టంగా ఉండరు. నేను కూడా ప్రపంచంలోని అన్ని జంక్‌ ఫుడ్‌లను తిన్నా. అప్పట్లో నాకు విచిత్రంగా ఉండేది. అలాంటి వయసులో అది సాధారణమే'అని కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

కొంతకాలం ఫామ్‌తో ఇబ్బంది పడిన విరాట్.. గత ఆసియా కప్‌ నుంచి మాత్రం చెలరేగిపోతున్నాడు. వరుసగా సెంచరీల మీద సెంచరీలు బాదేస్తున్నాడు. ఈ క్రమంలో వన్డేల్లో 46 శతకాలతో కొనసాగుతున్న కోహ్లీ మరో మూడు చేస్తే సచిన్‌ (49)తో సమంగా నిలుస్తాడు. నాలుగు సెంచరీలు పూర్తి చేసుకొంటే మాత్రం వన్డేల్లో అత్యధికంగా శతకాలు బాదిన బ్యాటర్‌గా అవతరిస్తాడు. ఈ ఏడాది పెద్ద ఎత్తున వన్డే మ్యాచ్‌లు ఉన్నాయి. ఫిట్‌నెస్‌ పరంగా అత్యున్నత స్థాయిలో ఉన్న విరాట్‌కు ఇదేమీ సమస్య కాబోదు.

ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌ కోసం విరాట్ కోహ్లీ సన్నద్ధమవుతున్నాడు. ఆసీస్‌ మీద మంచి రికార్డు ఉన్న విరాట్.. తన టెస్టు సెంచరీల దాహాన్ని తీర్చుకోవాలని ఎదురు చూస్తున్నాడు. ఈ సిరీస్‌లో భారత్‌ విజయం సాధిస్తే.. టెస్టుల్లోనూ నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరడంతోపాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుకుంటుంది.

Story first published: Wednesday, February 1, 2023, 16:54 [IST]
Other articles published on Feb 1, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X