Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సంజు బ్యాటింగ్ ను మస్తుగా ఎంజాయ్ చెయ్యొచ్చు: మాజీ లెజెండ్

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్.. సూపర్ విక్టరీ సాధించింది. మంగళవారం రాత్రి అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో అదరగొట్టింది. ఢిల్లీ కేపిటల్స్ ను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఢిల్లీ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని రుతురాజ్ సేన ఇంకా 15 బంతులు మిగిలివుండగానే ఛేదించింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. మొన్నటివరకు అట్టడుగున ఉన్నఈ జట్టు.. చివరి అయిదు మ్యాచ్ లల్లో మూడింట్లో నెగ్గింది. టాప్ 4 జట్లకు చెమటలు పట్టిస్తోంది. లేట్ అయినా లేటెస్ట్ గా ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది.

156 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి ప్రారంభంలోనే షాక్ తగిలింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (6) మరోసారి నిరాశపరిచాడు. ఆ తర్వాత సంజు శాంసన్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 52 బంతుల్లో 7 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సంజు శాంసన్‌కు తోడుగా కార్తీక్ శర్మ 31 బంతుల్లో 41 పరుగులు చేసి భారీ భాగస్వామ్యాన్ని అందించాడు.

Kevin Pietersen Hails CSK Opener Sanju Samson for his Power packed Batting against Delhi Capitals

పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ సందర్భంగా మాట్లాడాడు. సంజు శాంసన్. తన బ్యాటింగ్ పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. నిలకడగ సాధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. నిలకడ సాధించడానికి క్రీజ్ లోకి వచ్చిన ప్రారంభంలో ఫుట్ వర్క్ పై ఫోకస్ పెట్టానని, దానిపై వర్కవుట్ చేస్తోన్నానని, అది సత్ఫలితాలను ఇస్తోందని పేర్కొన్నాడు. బౌలర్ ను బట్టి వారిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై వ్యూహాత్మకంగా ఇది పని చేస్తోందని శాంసన్ వ్యాఖ్యానించాడు.

మిడిల్ ఓవర్లలో అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలనే దానిపై శాంసన్ ప్రణాళికల గురించి వివరించాడు. తాము ఛేదిస్తున్న లక్ష్యాన్ని, పిచ్ తీరును పరిశీలిస్తే, పవర్‌ప్లేలో వికెట్ నష్టపోకుండా 35 పరుగులు చేసినా, మిడిల్ ఓవర్లలో దాన్ని భారీ స్కోర్‌గా మార్చుకోవచ్చని చెప్పాడు. సెంచరీ చేసే అవకాశం ఉన్నా కూడా ఆ దిశగా ఆలోచన చేయకపోవడంపా శాంసన్ స్పందించాడు. ఈ సెంచరీ చేసి వుంటే సెల్ఫిష్ అయి ఉండాలనిపించిందని, తాను అలాకాదని, మ్యాచ్ గెలవడం ముఖ్యమని అనుకున్నానని బదులిచ్చాడు.

అతని బ్యాటింగ్ ను ఇంగ్లాండ్ మాజీ కేప్టెన్, లెజెండరీ ప్లేయర్ కెవిన్ పీటర్సన్ ఆకాశానికెత్తేశాడు. ఈ సీజన్ లో అద్భుతంగా రాణిస్తోన్న సంజు శాంసన్ బ్యాటింగ్ పట్ల ముగ్ధుడయ్యాడు. సంజు ఆడే విధానం ఎంతగానో నచ్చిందంటూ ప్రశంసల వర్షాన్ని కురిపించాడు. చెన్నై సూపర్ కింగ్స్ లో వచ్చినప్పుడు ప్రారంభంలో కొంత తడబడ్డా.. ఇప్పుడు నిలకడగా రాణిస్తోన్నాడని కీర్తించాడు. ఆ జట్టు ఇంకా ప్లేఆఫ్ రేసులో నిలవడానికి ప్రధాన కారకుల్లో ఒకడని అభిప్రాయపడ్డాడు.

Story first published: Wednesday, May 6, 2026, 11:52 [IST]
Other articles published on May 6, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+