Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బెంగళూరుకు బిగ్ ఝలక్

ఐపీఎల్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే సగం టోర్నమెంట్ ముగిసింది. నాలుగు మినహా మిగిలిన అన్ని జట్లూ పదేసి చొప్పున మ్యాచ్ లు ఆడేశాయి. పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో స్థానంలో నిలవగా.. సన్ హైదరాబాద్ మూడో పొజీషన్ లో ఉంది. రాజస్థాన్ రాయల్స్ నాలుగో స్థానానికి పరిమితమైంది ప్రస్తుతానికి. నేడు సన్ రైజర్స్ తో తలపడబోతోంది పంజాబ్ కింగ్స్. ఈ మ్యాచ్ ఫలితం.. తొలి నాలుగు స్థానాలను ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదు.

ఈ పరిస్థితుల్లో బీసీసీఐ.. మరింత ఊపు తెచ్చిందీ టోర్నమెంట్ కు. ఐపీఎల్ వేదికలు ఖరారు చేసింది. ఫైనల్, ప్లేఆఫ్స్ ఆడే స్టేడియాలను నిర్ధారించింది. ఈ నెల 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ షెడ్యూల్ అయింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానం కావడం, దీని భారీ సీటింగ్ సామర్థ్యం కారణంగా బీసీసీఐ దీనికి ప్రాధాన్యత ఇచ్చింది.

4 IPL Finals in 5 Years at Ahmedabad Narendra Modi Stadium as Qualifier 1 Qualifier 2 Venue Fixed

తుదిపోరుకు నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యాన్ని ఇవ్వడం వరుసగా ఇది. గత ఏడాది కూడా ఫైనల్ ఇక్కడే జరిగిన విషయం తెలిసిందే. ఈ అయిదు సంవత్సరాల వ్యవధిలో నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ నిర్వహించబోతోండటం ఇది నాలుగోసారి. ఈ ఏడాది ఫైనల్ మ్యాచ్.. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సొంత గడ్డ చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుందని మొదట భావించారు.

స్థానిక అధికారులు, రాష్ట్ర సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్న కొన్ని డిమాండ్ల వల్ల వేదిక మార్చాల్సి వచ్చిందని బీసీసీఐ తెలిపింది. ఈ సీజన్‌లో బీసీసీఐ ఒక ప్రత్యేక ఏర్పాటు కింద లాజిస్టికల్, కార్యాచరణ కారణాల దృష్ట్యా ప్లేఆఫ్ వేదికలను మూడు నగరాల్లో నిర్వహించబోతోంది. ఐపీఎల్ ప్లేఆఫ్ తొలి క్వాలిఫయర్ మే 26న ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. లీగ్ తొలి రెండు స్థానాల్లో ఉండే జట్లు తలపడే ఈ మ్యాచ్ విజేత నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది.

ప్లేఆఫ్‌లు న్యూ చండీగఢ్‌లోని న్యూ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి మారతాయి. అక్కడ మే 27న ఎలిమినేటర్, మే 29న క్వాలిఫైయర్ 2 జరుగుతాయి. క్వాలిఫైయర్ 2లో క్వాలిఫైయర్ 1లో ఓడిన జట్టు, ఎలిమినేటర్ విజేత తలపడటంతో రెండో ఫైనలిస్ట్ ఖరారవుతుంది. తక్కువ సామర్థ్యం గల బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఫైనల్ నిర్వహించడానికి బీసీసీఐ సుముఖంగా లేదు. గత ఏడాది ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం దీనికి ప్రధాన కారణం.

Story first published: Wednesday, May 6, 2026, 14:37 [IST]
Other articles published on May 6, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+