న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెండో పరుగుకి అవకాశం లేకున్నా.. అతి నమ్మకంతోనే కోహ్లీ భారీ మూల్యం!

 Virat Kohli dismissed run-out 3rd T20I against Sri Lanka at Pune

హైదరాబాద్: పూణె వేదికగా శుక్రవారం శ్రీలంకతో జరిగిన చివరిదైన మూడో టీ20లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రనౌటైన సంగతి తెలిసిందే. ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన లాహిరు తిరుమానె బౌలింగ్‌లో బంతిని బ్యాక్‌వర్డ్ స్వ్కేర్‌ లెగ్‌ దిశగా నెట్టిన విరాట్ కోహ్లీ తొలుత సింగిల్ తీశాడు.

అయితే, బంతి ఫీల్డర్ గుణతిలక చేతిలో ఉండగానే రెండో పరుగు కోసం కూడా కోహ్లీ పిలిచాడు. దీంతో తొలుత వద్దని చెప్పిన మనీశ్ పాండే ఆ తర్వాత క్రీజులో నుంచి కదిలాడు. అయితే, అప్పటికే బంతి అందుకున్న గుణతిలక నేరుగా కీపర్ పెరీరాకి బంతిని త్రో చేయడంతో కోహ్లీ రనౌటయ్యాడు.

<strong>వారి కోసమే కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు: శిఖర్ ధావన్</strong>వారి కోసమే కోహ్లీ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు: శిఖర్ ధావన్

రెండో పరుగుకి అవకాశం లేకున్నా

రెండో పరుగుకి అవకాశం లేకున్నా

నిజానికి రెండో పరుగుకి అవకాశం లేకున్నా కోహ్లీ అనవసరంగా పరుగుకి ప్రయత్నించాడు. నిజానికి మరో ఎండ్‌లో ఉన్న మనీశ్ పాండే బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోవడం వల్లే కోహ్లీ రనౌట్ అయ్యాడని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. పాండే రెండో పరుగుకి నో చెప్పి ఉండాల్సింది.

కోహ్లీ పరుగు అందుకోగానే

కోహ్లీ పరుగు అందుకోగానే

కోహ్లీ పరుగు అందుకోగానే.. మనీశ్ పాండే కూడా అదే తరహాలో స్పందించాడు. దీంతో క్రీజుకి కోహ్లీ చాలా దూరంలో ఉండగానే శ్రీలంక వికెట్ కీపర్ కుశాల్ పెరీరా వికెట్లను గీరాటేశాడు. దీంతో కోహ్లీ నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. అంతేకాదు కోహ్లీ అతి నమ్మకంతో పరుగుకి వెళ్లి మూల్యం చెల్లించుకున్నాడు.

17 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ

17 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ

ఈ మ్యాచ్‌లో 17 బంతులు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ 2 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 26 పరుగులు చేయగా.. మనీశ్ పాండే 18 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 31 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (54), శిఖర్ ధావన్ (52) హాఫ్ సెంచరీలతో రాణించారు.

201 పరుగులు చేసిన టీమిండియా

201 పరుగులు చేసిన టీమిండియా

ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. అయితే, భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక భారత బౌలర్ల దెబ్బకు 15.5 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌటై మూడు టీ20ల సిరిస్‌ను 2-0తో చేజార్చుకుంది.

Story first published: Saturday, January 11, 2020, 18:33 [IST]
Other articles published on Jan 11, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X