న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మళ్లీ తెరపైకి No. 4: 'శంకర్ బెస్ట్, ధోని ప్రశాంతత భారత్‌కు అవసరం'

Not MS Dhoni, Sanjay Manjrekar backs THIS player for crucial No. 4 spot in ICC World Cup

హైదరాబాద్: భారత జట్టులో నెంబర్‌ 4 బ్యాట్స్‌మన్‌ కథ మళ్లీ మొదటికొచ్చింది. వన్డేల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసే కీలక ఆటగాడి కోసం టీమిండియా మూడేళ్లుగా ఎన్నో ప్రయోగాలు చేసింది. నెంబర్‌ 4 స్థానంలో బరిలోకి దిగే ఆటగాడు అటు టాపార్డర్‌కు ఇటు లోయర్ ఆర్డర్‌కు మధ్య సంధానకర్తగా ఉంటూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాలి. అంతేకాదు మిగతా ఆటగాళ్లపై ఒత్తిడి పడకుండా బ్యాటింగ్‌ చేస్తూ చివర్లో దూకుడుగా ఆడాల్సి ఉంటుంది. 2015 వరల్డ్‌కప్ నుంచి ఆ ఒక్కడి కోసం వెతుకులాట సాగుతూనే ఉంది.

'సగం కెప్టెన్ ధోనీనే, అతడు లేకపోతే కోహ్లీ మొరటుగా కనిపిస్తాడు''సగం కెప్టెన్ ధోనీనే, అతడు లేకపోతే కోహ్లీ మొరటుగా కనిపిస్తాడు'

ఇందులో భాగంగా దినేశ్‌ కార్తీక్‌, అజింక్యె రహానే, మనీష్‌ పాండే, కేఎల్‌ రాహుల్‌‌లను జట్టు మేనేజ్‌మెంట్ ఈ స్థానంలో ఆడించింది. అయితే, వీరి నిలకడలేమి అంబటి రాయుడుకు కలిసొచ్చింది. ఆసియా కప్‌లో అద్భుత ప్రదర్శన చేయడం.. ఆ తర్వాత వెస్టిండిస్‌తో స్వదేశంలో జరిగిన వన్డే సిరిస్‌లో అంబటి రాయుడు తన అద్భుత ఆటతీరుతో అంచనాలు అందుకున్నా.. కీలక వరల్డ్‌కప్‌కు ముందు అతడి ఆటలో నిలకడ లోపించింది.

రాయుడు ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేయలేకపోతున్నాడు

రాయుడు ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేయలేకపోతున్నాడు

క్రీజులో ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్‌ చేయలేకపోతున్నాడు. చివరి 14 ఇన్నింగ్స్‌లో రాయుడు నుంచి వచ్చిన మెరుగైన స్కోర్లు 73, 100, 90 మాత్రమే. ఏడుసార్లు 25 రన్స్‌లోపే అవుటయ్యాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్‌లో తొలి మూడు వన్డేల్లో 13, 18, 2 పరుగులే చేయడంతో వరల్డ్‌కప్ జట్టులో రాయుడికి చోటు అనుమానంగా మారింది.

No. 4ను ఎవరితో భర్తీ చేయాలి

No. 4ను ఎవరితో భర్తీ చేయాలి

దీంతో భారత్ మళ్లీ ఎవరితో భర్తీ చేయాలనే ఆలోచనల్లో పడింది. ఈ నేఫథ్యంలో ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను ఆ స్థానంలో బరిలో దించే ప్రయత్నం చేయాలని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ "స్ట్రయిక్ రొటేట్ చేయడంతో పాటు అలవోకగా సిక్స్‌లు బాదే సామర్థ్యం కలిగిన విజయ్‌ను నాలుగో నంబర్‌లో ఆడిస్తే బాగుంటుందనేది నా ఆలోచన" అని చెప్పాడు.

రాయుడిని పరిగణనలోకి తీసుకుంటారా?

రాయుడిని పరిగణనలోకి తీసుకుంటారా?

"బౌలర్‌గా శంకర్‌కు 3 ఓవర్ల బౌలింగ్ ఇస్తే చాలు. ఏడు లేదా పూర్తి కోటా 10 ఓవర్లు బౌలింగ్ చేయించాల్సిన అవసరం లేదు. నాలుగో నంబర్ బ్యాట్స్‌మన్‌గా అంబటి రాయుడిని కూడా పరిగణనలోకి తీసుకుంటారా? అని అడిగిన ప్రశ్నకు గాను వెల్లింగ్టన్‌లో కివీస్‌తో మ్యాచ్‌లో 90 పరుగుల తర్వాత.. అతడు ఆ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి సరిగ్గా సరిపోతాడని.. తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడని భావించా" అని మంజ్రేకర్ అన్నాడు.

అంబటి రాయుడు స్థానం ప్రశ్నార్థకంగా మారింది

అంబటి రాయుడు స్థానం ప్రశ్నార్థకంగా మారింది

"అయితే, ప్రస్తుతం ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల్లో తక్కువ స్కోరుకే వెనుదిరగడం.. విజయ్ శంకర్ రాణిస్తుండటంతో ప్రస్తుతం జట్టులో అంబటి రాయుడు స్థానం ప్రశ్నార్థకంగా మారింది. ఇక, కోహ్లీ కచ్చితంగా మూడో స్థానంలోనే బ్యాటింగ్‌కు దిగాలి. ఈ జట్టుకు విజయాన్ని అందించే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందకి పంపడం సరికాదు" అని సంజయ్ మంజ్రేకర్ అన్నారు.

ధోనీ ప్రశాంతత భారత్‌కు అవసరం

ధోనీ ప్రశాంతత భారత్‌కు అవసరం

ఇక, ప్రస్తుతం టీమిండియా బౌలింగ్ అద్భుతంగా ఉందని సంజయ్ మంజ్రేకర్ కొనియాడాడు. "ప్రపంచంలో అత్యుత్తమ జట్టు భారత్ అయినప్పటికీ కచ్చితంగా వచ్చే వరల్డ్‌కప్‌లో గెలుస్తారని మాత్రం చెప్పలేను. ధోని అనుభవం జట్టుకు ఎంతో అవసరం. ధోని అద్భుతమైన వికెట్ కీపర్. ఇద్దరు మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, చాహల్ ఎదుగుదలలో అతడి పాత్ర ఎంతో ఉంది. వరల్డ్‌కప్‌లో ధోనీ ప్రశాంతత భారత్‌కు అవసరం ఉంది" అని సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, March 12, 2019, 13:13 [IST]
Other articles published on Mar 12, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X