ఐపీఎల్‌కి నన్నెందుకు తీసుకోలేదు, స్టార్ క్రికెటర్ ఆవేదన

Posted By:
Kevin Pietersen says Tymal Mills £1.4m IPL move is another slap in Test crickets face

హైదరాబాద్: మా దేశ ప్రస్తుత ట్వంటీ20 స్పెషలిస్టు ఇక ధనిక క్రికెటర్ అయిపోయాడు. ఐపీఎల్లో మిల్స్‌కు రూ.12 కోట్లు ధర పలకడం టెస్టు క్రికెట్‌కు కచ్చితంగా చెంపపెట్టే. టెస్టు క్రికెట్ ఎంత అథమ స్థాయిలో ఉందో ఐపీఎల్ వేలాన్ని బట్టి అర్ధమవుతోంది' ఈ మాటలు ఐపీఎల్ 10వ సీజన్ వేలం అనంతరం స్టార్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ తైమిల్ మిల్స్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు.

ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్|ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్

తైమిల్ మిల్స్‌ ఐపీఎల్ 10 ధర రూ.12 కోట్లు:

తైమిల్ మిల్స్‌ ఐపీఎల్ 10 ధర రూ.12 కోట్లు:

అలాంటి తైమిల్ మిల్స్‌ను ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో ఏ జట్టు తీసుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 11 సీజన్లో తాను ఆడకపోవడంపై మిల్స్ ఇలా స్పందించాడు. 'ఏ ఆటగాడికైనా ఇలాంటి ఘటన ఎదురుకావడం కష్టంగానే ఉంటుంది. కానీ ఎవరో మనల్ని ఎంపిక చేయలేదనో, నమ్మలేదనో భయాల్ని పెంచుకోవాల్సిన అవసరం లేదు.'

భయం ఉంటే వేలానికి దూరం:

భయం ఉంటే వేలానికి దూరం:

తమను కొనుగోలు చేస్తారా లేదా అనే భయం ఉంటే మాత్రం ఆ ఆటగాళ్లు వేలానికి దూరంగా ఉండటమే ఉత్తమం. గతేడాది భారీ ధరకు నన్ను తీసుకున్నందుకు చాలా సంతోషపడ్డాను. ఈ సీజన్లో తీసుకోలేదని ఏ జట్టుపై నాకు కోపం లేదు. ఏది జరిగినా మన మంచికే అని భావించాలి. ఈ ఏడాది వేలంలో నన్ను ఏ జట్టు ఎంపిక చేయనుందున పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్‌ (పీఎస్‌ఎల్) లో కరాచీ కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాను.

 కరాచీ కింగ్స్ ఓడిపోయి:

కరాచీ కింగ్స్ ఓడిపోయి:

పెషావర్ జల్మీతో జరిగిన సెమీ ఫైనల్లో దురదృష్టవశాత్తూ మా కరాచీ కింగ్స్ ఓడిపోయింది. కానీ పాక్‌లో సెక్యూరిటీ చాలా బాగుంది. ఆసియాలో ఎక్కడ మ్యాచ్‌లు జరిగినా క్రికెట్ అభిమానులతో స్టేడియాలు నిండిపోతాయి. గతేడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు భారీ ధరలకు మిల్స్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

జీవితంలో కష్టసుఖాలు ఉంటాయి:

జీవితంలో కష్టసుఖాలు ఉంటాయి:

నాణేనికి రెండు వైపులా ఉన్నట్లు జీవితంలో కష్టసుఖాలు ఉంటాయని, ప్రస్తుతం దేశవాలీ లీగ్స్, జాతీయ జట్టుకు ఆడుతూ ఆటను మెరుగు పరుచుకోవడంపైనే దృష్టి పెట్టినట్లు మిల్స్ తెలిపాడు. తనను ఎంతగానో ఆదరించిన ససెక్స్ జట్టుకు మళ్లీ ఆడతానని పేర్కొన్నాడు. గతేడాది విఫలమైన సందర్భంలో భారీ ధరకు తీసుకున్నారని, కానీ ఈ ఏడాది అద్భుతంగా రాణించినా ఏ ఫ్రాంచైజీ తనను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదన్నాడు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Friday, April 6, 2018, 11:05 [IST]
Other articles published on Apr 6, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి