న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జస్‌ప్రీత్ బుమ్రా మంచాన పడతాడని ఏడాది కిందటే జోస్యం - ఇదిగో సాక్ష్యం..!!

Jasprit Bumrahs back will break down, Shoaib Akhtars old video goes viral after India pacer ruled out.

ముంబై: టీ20 ప్రపంచ కప్ మెగా టోర్నమెంట్ ముంగిట్లో భారత క్రికెట్ జట్టు బౌలింగ్ బ్యాక్‌బోన్ జస్‌ప్రీత్ బుమ్రా గాయపడటం ఊహించని ఎదురు దెబ్బ. వెన్నెముకలో ఫ్రాక్చర్ వల్ల అతను దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరం అయ్యాడు. దీనితో పాటు టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌ నుంచీ వైదొలిగాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్‌కూ ఆడేది అనుమానమే. వెన్నెముకకు సర్జరీ చేయించుకోవాలనే ఉద్దేశంలో ఉన్నందున- ఇక బుమ్రా కనీసం ఆరు నెలల పాటు బెడ్ రెస్ట్‌ తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

రీప్లేస్..

రీప్లేస్..

దక్షిణాఫ్రికాతో టీమిండియా ప్రస్తుతం టీ20 సిరీస్‌ను ఆడుతోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి మ్యాచ్ ముగిసింది. ఇక మిగిలిన రెండు మ్యాచ్‌ల కోసం బుమ్రా స్థానాన్ని భర్తీ చేసింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్. అతని స్థానంలో హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు అవకాశం కల్పించింది. దీనిపై కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేసింది. కోవిడ్ నుంచి కోలుకున్న మహ్మద్ షమీ పేరును కూడా పరిశీలనలోకి తీసుకున్నప్పటికీ- సిరాజ్ వైపే మొగ్గు చూపింది.

ఏడాది కిందటే..

జస్‌ప్రీత్ బుమ్రా గాయపడొచ్చనే విషయాన్ని ముందే ఊహించగలిగాడు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్. వెన్నెముక ఖచ్చితంగా చిట్లుతుందంటూ ముందే అంచనా వేయగలిగాడు. సంవత్సరం కిందటే జోస్యం చెప్పాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. బుమ్రా తన కెరీర్‌లో మున్ముందు వెన్నెముక గాయాలతో బాధపడొచ్చిన, దానికి గల కారణాలను కూడా అఖ్తర్ ఈ వీడియోలో విశ్లేషించాడు.

ఫ్రంటల్ యాక్షన్..

ఫ్రంటల్ యాక్షన్..

బుమ్రా బౌలింగ్ మొత్తం ఫ్రంటల్ యాక్షన్‌పై ఆధారపడి ఉంటుందని, ఆ యాక్షన్‌తో బౌలింగ్‌ చేసే వారి వెన్నెముక, భుజంపై వేగం, ఒత్తిడి అధికంగా పడుతుందని అఖ్తర్ పేర్కొన్నాడు. తమ బౌలింగ్ యాక్షన్ సైడ్-ఆన్‌గా ఉండేదని, రివర్టల్ యాక్షన్ వల్ల వెనుకపై ఒత్తిడిని ఇది భర్తీ చేసేదని వ్యాఖ్యానించాడు. ఫ్రంట్ ఆన్ బౌలింగ్ యాక్షన్‌లో వెన్నెముకలో ఫ్రాక్చర్ ఏర్పడటం, భుజాల నొప్పి తరచూ సంభవిస్తుంటుందని పేర్కొన్నాడు. ఎంత ప్రయత్నించినా ఇందులో నుంచి తప్పించుకోలేరని తేల్చి చెప్పాడు.

షోల్డర్ స్పీడ్‌తో..

షోల్డర్ స్పీడ్‌తో..

బుమ్రా ప్రధానంగా షోల్డర్ స్పీడ్‌తో బంతులను సంధిస్తాడని, అతని ప్రధాన బలం అదేనని షోయబ్ అఖ్తర్ విశ్లేషించాడు. బ్యాక్ అండ్ షోల్డర్‌పై ఒత్తిడి పడేలా అతని ఫ్రంటల్ యాక్షన్ ఉంటుందని పేర్కొన్నాడు. ఇదివరకు వెస్టిండీస్ స్టార్ బౌలర్ ఇయాన్ బిషప్, న్యూజిలాండ్‌కు చెందిన షేన్ బాండ్.. ఫ్రంటల్ యాక్షన్‌లోనే బౌలింగ్ చేస్తుండేవాళ్లని చెప్పాడు. ఇప్పుడీ జాబితాలో బుమ్రా చేరాడని వ్యాఖ్యానించాడు.

వెన్నెముక విరుగుతుంది..

వెన్నెముక విరుగుతుంది..

మ్యాచ్ అయిపోయిందా..తాను టేకాఫ్ తీసుకున్నానా.. రిహాబిలిటేషన్‌కు వెళ్లానా.. అని మాత్రమే అతను ఆలోచిస్తోన్నాడని, భవిష్యత్తులో అతనికి అదే తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడుతుందని అఖ్తర్ కుండబద్దలు కొట్టాడు. ప్రతి మ్యాచ్‌ను కూడా అతను ఆడుతూ వెళ్తే.. సంవత్సరంలోగా బుమ్రా వెన్నెముకతో బాధపడి తీరతాడని అప్పట్లో తేల్చి చెప్పాడు. అలా జరక్కూడదంటే అతనికి కొన్ని మ్యాచ్‌లల్లో విశ్రాంతి ఇవ్వడం తప్పనిసరి అని అన్నాడు.

Story first published: Friday, September 30, 2022, 10:52 [IST]
Other articles published on Sep 30, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X