న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దేవ్‌ధర్‌ ట్రోఫీ: ఆఖరి ఓవర్లో కర్ణాటక ఉత్కంఠ విజయం

By Nageshwara Rao
Deodhar Trophy: Manoj Tiwary ton in vain as Karnataka gain narrow win over India B

హైదరాబాద్: ధర్మశాల వేదికగా సోమవారం జరిగిన దేవ్‌ధర్‌ ట్రోఫీలో కర్ణాటక శుభారంభం చేసింది. సమర్థ్‌ (117) సెంచరీ సాధించడంతో దేవధర్‌ ట్రోఫీలో కర్ణాటక 6 పరుగుల తేడాతో భారత్‌-బిపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 296 పరుగులు చేసింది.

మయాంక్‌ అగర్వాల్‌ (44), దేశ్‌పాండే (46) కూడా రాణించారు. ఛేదనలో శ్రేయస్‌ గోపాల్‌ (3/29), కృష్ణ (2/45) ధాటికి భారత్‌-బి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 290 పరుగులకు పరిమితమైంది. మనోజ్‌ తివారి (120) సెంచరీ చేసినప్పటికీ జట్టును గెలిపించలేక పోయాడు.

ఛేదనలో 'భారత్‌-బి' జట్టు 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్‌లో భారత్‌-బి విజయానికి 6 బంతుల్లో 11 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో సిద్దేశ్‌ లాడ్‌ (70) దూకుడుగా ఆడుతున్నాడు. చివరి ఓవర్‌ వేసేందుకు ఆఫ్‌ స్పిన్నర్‌ కృష్ణప్ప గౌతమ్‌ బంతినందుకున్నాడు.

ఈ స్థితిలో 'బి' జట్టే గెలిచేలా కనిపిచింది. కానీ గౌతమ్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి లాడ్‌ను ఔట్‌ చేయడంతో పాటు నాలుగు పరుగులిచ్చాడు. దీంతో సోమవారం జరిగిన దేవధర్‌ ట్రోఫీ వన్డే మ్యాచ్‌లో కర్ణాటక 6 పరుగులతో నెగ్గింది. కర్ణాకట బౌలర్ శ్రేయాస్‌ గోపాల్‌ 3 వికెట్లు తీశాడు.

Story first published: Tuesday, March 6, 2018, 10:56 [IST]
Other articles published on Mar 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X