న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెప్టెంబర్‌ 4 నుంచి ఇంగ్లండ్‌లో ఆస్ట్రేలియా పర్యటన!!

Australias proposed bio-secure tour of England to begin on September 4

మెల్‌బోర్న్‌: పరిమిత ఓవర్ల క్రికెట్‌ సిరీస్‌ కోసం వచ్చే సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించే అవకాశం ఉంది. ఇంగ్లండ్‌లో ఆస్ట్రేలియా పర్యటన సెప్టెంబర్‌ 4న ప్రారంభం కానుందని ఆసీస్‌ మీడియా వెల్లడించింది. ఈ పర్యటనలో ఇంగ్లండ్‌ జట్టుతో ఆస్ట్రేలియా మూడు టీ20లు (సెప్టెంబర్‌ 4, 6, 8 తేదీల్లో), మూడు వన్డేలు (సెప్టెంబర్‌ 10, 12, 15) ఆడనుందని తెలిపింది.

ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్‌కు ప్రత్యేక విమానాల్లో చేరుకోనుండగా.. బయో సెక్యూర్‌ వాతావరణంలో ఆరు మ్యాచ్‌లు సౌతాంప్టన్‌, మాంచెస్టర్‌ వేదికగానే జరుగుతాయని వెల్లడించింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌, వెస్టిండీస్ టెస్టు సిరీస్‌కు సైతం ఈ మైదానాలే ఆతిథ్యమిస్తున్నాయి. ఈ రెండు మైదానాలకు ఆనుకుని హోటళ్లు ఉండడంతో ఆటగాళ్లకు సురక్షితమని భావించిన ఈసీబీ అక్కడే మ్యాచులను నిర్వహిస్తోంది.

ఇంగ్లండ్‌ పర్యటన కోసం ఇప్పటికే 26మంది ఆటగాళ్లతో కూడిన ప్రాథమిక బృందాన్ని ఆస్ట్రేలియా సెలెక్టర్లు ఎంపిక చేయగా.. త్వరలో తుదిజట్టును ప్రకటించనున్నారు. విండీస్ మాదిరిగానే ఆస్ట్రేలియా మ్యాచ్‌లను కూడా పూర్తి బయో సెక్యూర్‌ వాతావరణంలో నిర్వహించాలని ఈసీబీ యోచిస్తుండటంతో.. కనీసం నెల రోజుల ముందు టీమ్‌ని క్రికెట్ ఆస్ట్రేలియా అక్కడికి పంపాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ముందుగా ప్రాథమిక జట్టుని సీఏ ప్రకటించింది.

వన్డే, టీ20 సిరీస్ కోసం ప్రకటించిన ఆస్ట్రేలియా జట్టులో ఉస్మాన్ ఖవాజా, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, ట్రావిస్ హెడ్, ఆండ్రూ టైలు రీఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాష్ లీగ్‌లో అదరగొట్టిన జోష్ ఫిలిప్ మరియు డేనియల్ సామ్స్ కూడా ఎంపికయ్యారు. పీటర్ హ్యాండ్కొంబ్‌, షాన్ మార్ష్, నాథన్ కౌల్టర్-నైల్‌లకు నిరాశే ఎదురైంది.

ఆస్ట్రేలియా జట్టు:
అరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, స్టీవ్‌ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టాయినిస్, ఆండ్రూ టై, మాథ్యూ వెడ్, ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్, డీఆర్క్‌ షాట్, సీన్ అబాట్, అస్టన్ అగర్, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్కస్ లబుషేన్, నాథన్ లయన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ మెక్‌డెర్మాట్, రిలే మెరెడిత్, మైకేల్ నేసర్, జోష్ ఫిలిప్, డేనియల్ సామ్స్.

1956 తర్వాత తొలిసారి.. ఈ ఏడాది 'బాలెన్‌ డి ఓర్‌' రద్దు1956 తర్వాత తొలిసారి.. ఈ ఏడాది 'బాలెన్‌ డి ఓర్‌' రద్దు

Story first published: Tuesday, July 21, 2020, 8:54 [IST]
Other articles published on Jul 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X