న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'డివిలియర్స్ మరి కొద్ది రోజులు ఆడి ఉంటే బాగుండేది'

 AB de Villiers Retirement is a Big Blow to South Africa: Graeme Smith

హైదరాబాద్: డివిలియర్స్ రిటైర్‌మెంట్ ప్రకటించి రోజులు మారుతున్నా.. తీవ్రత మాత్రం తగ్గటం లేదు. అతని రిటైర్‌మెంట్‌పై సీనియర్లతో సహా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ మరికొంతకాలం క్రికెట్ ఆడి ఉండాల్సిందని ఆ దేశ మాజీ కెప్టెన్ గ్రేమ్‌స్మిత్ అభిప్రాయపడ్డాడు. వారం క్రితం ఎవరూ ఊహించనిరీతిలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఏబీ డివిలియర్స్ రిటైర్మెంట్ ప్రకటించాడు.

వెన్నునొప్పి కారణంగా కొన్నిరోజులు ఆటకి దూరమైన ఏబీ డివిలియర్స్ ఏడాది పునరాగమనం తర్వాత చాలా బాగా ఆడాడని చెప్పుకొచ్చాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లోనూ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఏబీ ఇలా అనుకోకుండా నిర్ణయం ప్రకటించడం పట్ల ఆశ్యర్యం వ్యక్తం చేశాడు. కనీసం 2019 ప్రపంచకప్‌ వరకైనా ఆడతాడని భావించానని తెలిపాడు.

'దక్షిణాఫ్రికా జట్టులో అతడు లేని లోటు పూడ్చలేదనిది. జట్టులో ఇప్పుడు చాలా మంది ప్రతిభ ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. కానీ.. భారత జట్టులో విరాట్ కోహ్లి లేకపోతే.. ఎలా ఉంటుందో.. ఇప్పుడు అలా మారింది సఫారీ జట్టు. ఒంటిచేత్తో మ్యాచ్‌ని గెలిపించగల హిట్టర్‌ని దక్షిణాఫ్రికా జట్టు కోల్పోయింది' అని గ్రేమ్ స్మిత్ వెల్లడించాడు.

దక్షిణాఫ్రికా జట్టులో అతడు లేని లోటు పూడ్చలేనిదని.. భారత జట్టులో విరాట్ కోహ్లి లేకుంటే ఎలా ఉంటుందో.. ఇప్పుడు సఫారీ జట్టు పరిస్థితి అలా ఉందంటూ గ్రేమ్‌ స్మిత్ ఆవేదన వ్యక్తం చేశాడు. కనీసం.. 2019 ప్రపంచకప్‌ వరకైనా ఏబీ డివిలియర్స్ ఆడి ఉంటే బాగుండేదని స్మిత్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

Story first published: Wednesday, May 30, 2018, 16:49 [IST]
Other articles published on May 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X