న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శాస్త్రి పర్యవేక్షణలో భారత పేస్ ఎటాక్ బౌలింగ్ ప్రాక్టీస్ (వీడియో)

By Nageshwara Rao
WATCH: India’s new-look pace attack practicing under coach Ravi Shastri’s supervision ahead of 1st SL T20I

హైదరాబాద్: భారత-శ్రీలంక జట్ల మధ్య ముగిసిన మూడు టెస్టుల సిరిస్‌ను 1-0తో, మూడు వన్డేల సిరిస్‌ను 2-1తో కైవసం చేసుకున్న టీమిండియా ఇప్పుడు టీ20పై కన్నేసింది. ఇందులో భాగంగా టీమిండియా యువ పేసర్లను పరిచయం చేస్తూ రూపొందించిన వీడియోని బీసీసీఐ అభిమానులతో పంచుకుంది.

మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య తొలి టీ20 బుధవారం రాత్రి జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి పర్యవేక్షణలో యువ బౌలర్లు జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ షిరాజ్, బసిల్ థంపీ నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీస్ చేశారు.

దక్షిణాఫ్రికా పర్యటనను దృష్టిలో పెట్టుకుని టీమిండియా ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు సెలక్టర్లు విశ్రాంతి కల్పించిన సంగతి తెలిసిందే. దీంతో జస్ప్రీత్ బుమ్రాతో కలిసి తొలి పవర్‌ప్లే‌లో ఈ ముగ్గురిలో ఒకరు బంతిని పంచుకోనున్నారు. మరోవైపు రవిశాస్త్రి కూడా యువ పేసర్ల గురించి ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.

పిచ్ పరిస్థితి:
2015లో ఇదే స్టేడియంలో ఓ టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్‌ ఓడింది. ఈ స్టేడియంలో తక్కువ స్కోరు నమోదయ్యే అవకాశం ఉంది.

జట్ల అంచనా:
భారత్ :
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, దినేశ్ కార్తీక్, ధోని, హార్ధిక్ పాండ్యా, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, జయదేవ్

శ్రీలంక:
తిసారా పెరీరా(కెప్టెన్), నిరోషాన్ డిక్వెల్లా, ఉపుల్ తరంగ, కుశాల్ జనిత్ పెరీరా, ఏంజెలో మాథ్యూస్, అసేలా గుణరత్న, దాసున్ షనక, పతిరన, నువాన్ ప్రదీప్, విశ్వా ఫెర్నాడో, చమీరా, గుణతిలక, ధనంజయ

రాత్రి గం. 7.00 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌-1లో ప్రత్యక్ష ప్రసారం

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, December 20, 2017, 12:19 [IST]
Other articles published on Dec 20, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X