లైవ్ టీవీలోనే బోరున ఏడ్చేసిన స్టార్ ప్లేయర్! (వీడియో)
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీరుపై ఆ దేశ స్టార్ బ్యాటర్ ఖుష్దిల్ షా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లో కరాచీ కింగ్స్ తరపున ఆడుతున్న ఖుష్దిల్ షా.. తనను జాతీయ జట్టు నుంచి తప్పించడంపై లైవ్ టీవీలోనే భావోద్వేగానికి గురయ్యారు. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో లాహోర్ ఖలందర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో కరాచీ కింగ్స్ విజయం సాధించిన తర్వాత ఖుష్దిల్ షా మాట్లాడాడు. కేవలం 14 బంతుల్లోనే 44 పరుగులు చేసి జట్టును గెలిపించిన ఖుష్దిల్.. ఈ మ్యాచ్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచారు. అనంతరం మాజీ క్రికెటర్ రమీజ్ రాజాతో మాట్లాడుతూ తన ఆవేదనను పంచుకున్నాడు.
డొమెస్టిక్ క్రికెట్‌లో రాణించినా గుర్తింపు లేదు..
మీడియా సమావేశంలో ఖుష్దిల్ మాట్లాడుతూ.. "నేను మిగిలిన ప్లేయర్ల కంటే భిన్నంగా ఉంటాను. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండను, నాపై జరిగిన అన్యాయాల గురించి ఎప్పుడూ ఏడవలేదు. కానీ ఇటీవల దేశవాళీ క్రికెట్‌లో 5వ లేదా 6వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి దాదాపు 700 నుంచి 800 పరుగులు సాధించాను. అందులో డబుల్ సెంచరీలు, భారీ ఇన్నింగ్స్‌లు కూడా ఉన్నాయి. ఇన్ని చేసినా నన్ను జట్టు నుంచి తప్పించారు" అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన
ఈ మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ నిర్దేశించిన 200 పరుగుల భారీ లక్ష్యాన్ని కరాచీ కింగ్స్ మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఖుష్దిల్ షా 314.28 స్ట్రైక్ రేట్‌తో విరుచుకుపడి 5 సిక్సర్ల సాయంతో అజేయంగా 44 పరుగులు చేశాడు. మరోవైపు డేవిడ్ వార్నర్ కూడా 44 బంతుల్లో 63 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ గెలుపుతో కరాచీ కింగ్స్ ప్లే ఆఫ్ రేసులో నిలిచింది.
ఖుష్దిల్ షా ఇప్పటివరకు పాకిస్థాన్ తరపున 15 వన్డేలు, 38 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2025 సెప్టెంబర్‌లో యూఏఈతో జరిగిన టీ20 తర్వాత మళ్లీ ఆయనకు జాతీయ జట్టులో చోటు దక్కలేదు. ఐపీఎల్ మాదిరిగానే పీఎస్ఎల్‌లో కూడా ఆటగాళ్లు తమ ప్రతిభను చాటుకుంటున్నప్పటికీ.. ఎంపిక విషయంలో బోర్డు వ్యవహరిస్తున్న తీరుపై ఖుష్దిల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు పాక్ క్రికెట్‌లో చర్చనీయాంశంగా మారాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications