న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసీస్‌పై భారీ పరుగుల తేడాతో పాక్ రికార్డు స్థాయి విజయం

Australia slump to 373-run defeat and surrender series to Pakistan

న్యూ ఢిల్లీ: ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో త్రుటిలో విజయాన్ని చేజార్చుకున్న పాకిస్థాన్‌.. రెండో టెస్టులో మాత్రం పట్టు వదల్లేదు. యూఏఈ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ని పాకిస్థాన్ 1-0తో చేజిక్కించుకుంది. నాలుగో రోజు, శుక్రవారం ముగిసిన మ్యాచ్‌లో ఏకంగా 373 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాకిస్థాన్‌ క్రికెట్‌ చరిత్రలోనే పరుగుల తేడా పరంగా ఇదే అతి పెద్ద విజయం.

1
44239
50.4 ఓవర్లలోనే ఆస్ట్రేలియా ఆలౌట్

50.4 ఓవర్లలోనే ఆస్ట్రేలియా ఆలౌట్

తొలి ఇన్నింగ్స్‌లో 282 పరుగులు చేసిన పాక్.. రెండో ఇన్నింగ్స్‌ని 400/9 వద్ద డిక్లేర్ చేసింది. ప్రతిగా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 145 పరుగులకే కుప్పకూలిన ఆస్ట్రేలియా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 164కే ఆలౌటైంది. ఓపెనర్ అరోన్ ఫించ్ (39) మాత్రమే ఫర్వాలేదనిపించాడు. దీంతో.. 50.4 ఓవర్లలోనే ఆస్ట్రేలియా 145 పరుగులకి ఆలౌటైంది. దీంతో.. 137 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పాక్‌కి లభించింది.

 రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే కుప్పకూలి

రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే కుప్పకూలి

పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అబ్బాస్ 10/95 కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసి మ్యాచ్‌ ఫలితాన్ని శాసించాడు. తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. 538 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌.. పేసర్‌ మహ్మద్‌ అబ్బాస్‌ (5/62), స్పిన్నర్‌ యాసిర్‌ షా (3/45)ల ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే కుప్పకూలింది. ఫించ్‌ (31), హెడ్‌ (36), లబుషానె (43) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.

తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్‌ 282 పరుగులు

పాక్ క్రికెటర్లు.. బాబర్‌ అజామ్‌ (99), సర్ఫరాజ్‌ అహ్మద్‌ (81), ఫకర్‌ జమాన్‌ (66), అజహర్‌ అలీ (64), రాణించారు. ఇలా తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్‌ 282 పరుగులు చేయగా.. ఆసీస్‌ 145 పరుగులకే కుప్పకూలింది. మ్యాచ్‌ మొత్తంలో 10 వికెట్లు తీసిన అబ్బాస్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'తో పాటు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌' అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. సిరీస్‌లో అతను మొత్తం 17 వికెట్లు పడగొట్టాడు.

క్రికెట్‌ చరిత్రలోనే పరుగుల తేడా పరంగా

ఈ మ్యాచ్‌లో ఏకంగా 373 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాకిస్థాన్‌ క్రికెట్‌ చరిత్రలోనే పరుగుల తేడా పరంగా ఇదే అతి పెద్ద విజయం. బుధవారం అబుదాబి వేదికగా ఈ రెండు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది.

Story first published: Saturday, October 20, 2018, 9:31 [IST]
Other articles published on Oct 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X