అందుకే ఆ స్టార్ ప్లేయర్ ఎంట్రీ : రజత్ పటిదార్
ఐపీఎల్ 2026లో భాగంగా శుక్రవారం రాత్రి బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ కీలక పోరులో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. చిన్నస్వామి స్టేడియం వంటి చిన్న గ్రౌండ్లలో ఛేజింగ్ చేయడం సులభం అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నాడు.
ఆర్సీబీ జట్టులో మార్పు
టాస్ గెలిచిన అనంతరం రజత్ ప\టిదార్ మాట్లాడుతూ.. తమ జట్టులో ఓ ముఖ్యమైన మార్పు ఉన్నట్లు వెల్లడించాడు. స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ గాయపడటంతో.. అతని స్థానంలో యువ ఆటగాడు జాకబ్ బెథెల్ తుది జట్టులోకి వచ్చాడు. "మేము వికెట్‌ను, ప్రస్తుత పరిస్థితిని సరిగ్గా అంచనా వేస్తున్నాం. మా ప్రణాళికలు చాలా బాగున్నాయి. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తున్నప్పటికీ, గడ్డి లేకపోవడం వల్ల మొదటి ఇన్నింగ్స్‌లో బంతి కాస్త నెమ్మదిగా వచ్చే అవకాశం ఉంది" అని రజత్ పటిదార్ తన వ్యూహాన్ని వివరించాడు.

గుజరాత్ టైటాన్స్ వ్యూహం
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగుతున్న గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. మొదట బ్యాటింగ్ చేయడం పట్ల ఎలాంటి అసంతృప్తి లేదని తెలిపాడు. "ఇక్కడ ఛేజింగ్ బాగుంటుందని మాకు తెలుసు, కానీ భారీ స్కోరు సాధిస్తామనే నమ్మకం ఉంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఎదురైన ఘోర పరాభవాన్ని పక్కన పెట్టి, సానుకూల అంశాలపై దృష్టి పెడుతున్నాం. మంచి పునాది వేసి ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచుతాం" అని గిల్ ధీమా వ్యక్తం చేశాడు. గుజరాత్ జట్టు ఈ మ్యాచ్ కోసం రెండు మార్పులు చేసింది. అనుభవజ్ఞుడైన జేసన్ హోల్డర్ జట్టులోకి రాగా.. మానవ్ సుతార్ కూడా తుది జట్టులో స్థానం సంపాదించుకున్నాడు.
ఆర్సీబీ ఈ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగి పాయింట్ల పట్టికలో టాప్ ఫోర్‌లో పటిష్టంగా కొనసాగుతోంది. మరోవైపు, వరుస ఓటములతో కుంగిపోయిన గుజరాత్ టైటాన్స్.. ఈ మ్యాచ్ ద్వారా మళ్లీ విజయాల బాట పట్టాలని భావిస్తోంది. చిన్నస్వామి వంటి హై-స్కోరింగ్ గ్రౌండ్‌లో గిల్ సేన ఎంత లక్ష్యాన్ని నిర్దేశిస్తుందో, ఆర్సీబీ దానిని ఎలా ఛేజింగ్ చేస్తుందో చూడాలి.
తుది జట్లు ఇవే..
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీప్), వాషింగ్టన్ సుందర్, షారుక్ ఖాన్, జాసన్ హోల్డర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మానవ్ సుతార్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ, రసిఖ్ సలాం దార్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications