సన్‌రైజర్స్ అభిమానులకు గుడ్ న్యూస్!
సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు శుభవార్త. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్‌తో కీలక పోరుకు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అందుబాటులోకి రావడం నిజంగా గుడ్ న్యూసే. రేపు(ఏప్రిల్ 25) రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరగబోయే మ్యాచ్ లో తాను బరిలోకి దిగుతున్నానని స్వయంగా ప్యాట్ కమిన్స్ ప్రకటించడం గమనార్హం. ఈ మేరకు కమిన్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు.
కమిన్స్ తన ఇన్ స్టాలో పూర్తిస్థాయిలో బౌలింగ్ చేస్తూ కనిపించిన చిత్రాలను పంచుకుంటూ, "చాలా కాలం తర్వాత వస్తున్నాను, రేపు మళ్లీ మైదానంలోకి దిగడానికి ఆతృతగా ఉన్నాను," అని రాశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ కూడా 'వస్తున్నాడు' అంటూ ఎక్స్ వేదికగా కమిన్స్ ఫోటోను షేర్ చేసింది. ఈ సీజన్‌లో తొలి ఏడు మ్యాచ్‌లకు దూరమయ్యాక అతని ఈ ఉత్సాహం స్పష్టమైంది. అతని జట్టు సహచరుడు ట్రావిస్ హెడ్ "ఈ ఏఐ చిత్రాలు రోజురోజుకూ మెరుగుపడుతున్నాయి" అని సరదాగా వ్యాఖ్యానించాడు.

కమిన్స్ లేకపోవడంతో ఇషాన్ కిషన్ సన్‌రైజర్స్‌కు ఐపీఎల్ కెప్టెన్‌గా నాయకత్వం వహించాడు. కాగా, గతేడాది జులై నుంచి వెన్ను గాయంతో బాధపడుతున్న ఈ ఆస్ట్రేలియా ఆటగాడు టీ20 ప్రపంచ కప్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత డిసెంబర్‌లో ఒకే యాషెస్ టెస్టులో మాత్రమే కనిపించాడు. ప్యాట్ కమిన్స్ పేస్ బౌలింగ్, నాయకత్వ సామర్థ్యాలకు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా, ఈ సుదీర్ఘ విరామం జాతీయ జట్టుకూ, ఫ్రాంచైజీకి ఆందోళన కలిగించింది. మార్చి 27న జట్టుతో చేరినప్పటికీ.. ఏప్రిల్ 4న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్ తర్వాత చివరి వైద్య పరీక్షల కోసం స్వదేశం వెళ్ళాడు. ఆస్ట్రేలియాలో ఫిట్‌నెస్ పరీక్షను పూర్తి చేసుకుని, ఇప్పుడు సన్‌రైజర్స్ తరపున తిరిగి రంగప్రవేశం చేస్తున్నాడు.
సన్‌రైజర్స్ ప్రారంభంలో మొదటి 4 మ్యాచ్‌లలో మూడు ఓడిపోయి.. అనంతరం వరుసగా 3 విజయాలతో పుంజుకున్నారు. అంటే 7 మ్యాచ్ లలో 4 గెలిచి 8 పాయింట్లు, +0.820 నెట్ రన్ రేట్‌తో పాయింట్ల పట్టికలో టాప్ ఫోర్‌లోకి దూసుకెళ్లారు.
ఢిల్లీ క్యాపిటల్స్‌పై సాధించిన 47 పరుగుల తేడాతో విజయం తర్వాత సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌లోకి వస్తోంది. ఆ మ్యాచ్‌లో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో అభిషేక్ శర్మ అజేయంగా 135 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ విజయ ఉత్సాహంలో వారు రియాన్ పరాగ్ నాయకత్వంలోని రాజస్థాన్ రాయల్స్‌ను ఎదుర్కోనున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications