చిత్తుగా ఓటమి.. ముంబై ప్లేయర్లకు అంబానీ బంపర్ ఆఫర్!
ఐపీఎల్ 2026 సీజన్లో వరుస ఎదురదెబ్బలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ జట్టుకు రిలాక్స్ అయ్యేందుకు ఓ అద్భుతమైన అవకాశం దక్కింది. చిరకాల ప్రత్యర్థి సీఎస్కే చేతిలో ఘోర పరాజయం పాలైన తర్వాత ఆటగాళ్లంతా తీవ్ర నిరాశలో ఉన్న తరుణంలో జట్టు యజమాని అంబానీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓటమి ఒత్తిడి నుంచి ప్లేయర్లకు విముక్తి కలిగించేందుకు 5 రోజుల పాటు ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
సీఎస్కే చేతిలో భారీ పరాజయం
ఏప్రిల్ 23న వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు సీఎస్కే చేతిలో 103 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ముంబై ఇండియన్స్ ఘోరంగా విఫలమై అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఈ పరాజయం తర్వాత ఆటగాళ్ల నైతిక స్థైర్యం దెబ్బతినకుండా ఉండేందుకు ముంబై యాజమాన్యం వారికి ఓ చిన్న విరామం ఇవ్వాలని నిర్ణయించింది.

జామ్‌నగర్ వంతారాలో ఆటగాళ్ల సందడి
ముంబై తన తదుపరి మ్యాచ్‌ను ఏప్రిల్ 29న ఆడనుంది. అంటే మధ్యలో ఐదు రోజుల సుదీర్ఘ విరామం దొరికింది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా.. ఆటగాళ్లందరినీ గుజరాత్, జామ్‌నగర్‌లోని అత్యంత విలాసవంతమైన వంతారా యానిమల్ రెస్క్యూ సెంటర్‌కు పంపించారు. ప్రకృతి ఒడిలో, జంతువుల మధ్య ప్రశాంతంగా గడుపుతూ రీఫ్రెష్ అయ్యేందుకు అంబానీ కుటుంబం ఈ స్పెషల్ ఆఫర్ ఇచ్చింది.
ఫ్యామిలీలతో కలిసి ఎయిర్ పోర్టులో ప్రత్యక్షం
ఈ బ్రేక్ కోసం ముంబై స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ వంటి కీలక ఆటగాళ్లు తమ భార్యాపిల్లలతో కలిసి ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేవలం క్రికెట్ గురించే ఆలోచించకుండా, ఫ్యామిలీతో గడుపుతూ మానసిక ప్రశాంతత పొందేందుకు ఈ ట్రిప్ ఎంతో దోహదపడుతుందని జట్టు వర్గాలు భావిస్తున్నాయి. వరుస ఓటములతో కుంగిపోకుండా, మళ్లీ కొత్త ఉత్సాహంతో మైదానంలోకి దిగేందుకు ఈ ఐదు రోజుల విరామం ముంబై ఇండియన్స్‌కు చాలా ముఖ్యం. ఏప్రిల్ 29న జరగబోయే తర్వాతి మ్యాచ్‌లో ముంబై జట్టు సరికొత్త వ్యూహాలతో, రీఫ్రెష్డ్ మైండ్‌తో పుంజుకుంటుందో లేదో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications