భారత్‌తో వైరం.. ఆసియా కప్ టోర్నీకి పాకిస్థాన్ దూరం!
పురుషుల హాకీ ఆసియా కప్ 2026 టోర్నీ నుంచి పాకిస్థాన్ తప్పుకుంది. భారత్ ఆతిథ్యం ఇస్తుందనే ఏకైక కారణంతో వైదొలిగింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు, భద్రతా కారణాలను చూపుతూ ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఆడలేమని పేర్కొంది. దాంతో, రిజర్వ్ జట్టుగా ఉన్న బంగ్లాదేశ్‌కు ఏషియన్ హాకీ ఫెడరేషన్ (ఏహెచ్‌ఎఫ్) టోర్నీలో పాల్గొనేందుకు అవకాశం కల్పించింది.
ఈ టోర్నీ అక్టోబర్ 27 నుంచి నవంబర్ 5 వరకు పంజాబ్‌లోని జలంధర్, మొహాలీ నగరాల్లో జరగనుంది. అయితే, తమ ఆటగాళ్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ (పీహెచ్‌ఎఫ్).. తమ మ్యాచ్‌లను ఏదైనా తటస్థ వేదికకు మార్చాలని ఏహెచ్‌ఎఫ్‌ను కోరింది. ఈ అభ్యర్థనను హాకీ ఇండియా తిరస్కరించింది. షెడ్యూల్ ప్రకారమే టోర్నీ జరుగుతుందని స్పష్టం చేయడంతో పాక్ ఈ టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

'మా ఆటగాళ్లు, అధికారుల భద్రత, గౌరవానికే మేం ప్రథమ ప్రాధాన్యత ఇస్తాం' అని పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ అధ్యక్షుడు మొహ్యుద్దీన్ అహ్మద్ వానీ తెలిపారు. పాకిస్థాన్ వైదొలగడంతో ఏహెచ్‌ఎఫ్ ఆహ్వానం మేరకు బంగ్లాదేశ్ ఈ టోర్నీలో పాల్గొనేందుకు అంగీకరించింది. దాంతో ఆతిథ్య భారత్‌తో పాటు జపాన్, చైనా, మలేషియా, సౌత్ కొరియా, బంగ్లాదేశ్ జట్లు ఆసియా కప్ టైటిల్ కోసం పోటీపడనున్నాయి.
డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్ ఇప్పటివరకు నాలుగుసార్లు ఈ టోర్నీలో విజేతగా నిలిచింది. 2018లో భారత్, పాకిస్థాన్ సంయుక్త విజేతగా నిలిచాయి. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ ఘటనల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వైరం పెరిగింది.
హాకీనే కాదు ఇతర క్రీడల్లో కూడా భారత్ వేదికగా జరిగే టోర్నీలకు పాకిస్థాన్ దూరంగా ఉంటుంది. ఇటీవల భారత్‌లో జరిగిన ఆసియా కప్, జూనియర్ వరల్డ్ కప్ వంటి టోర్నీలకు కూడా పాక్ జట్టు దూరంగా ఉంది. త్వరలోనే ఈ సవరించిన హాకీ ఆసియా కప్ టోర్నీ షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
" width="200" height="113">
