Asian Games 2026: మలేషియాపై ఘన విజయం.. భారత్‌కు స్వర్ణం!
ఆసియాగేమ్స్‌లో భారత్ హాకీ పురుషుల టీమ్ అదరగొట్టింది. శనివారం మలేషియాతో జరిగిన ఫైనల్లో అద్వితీయమైన ప్రదర్శన కనబర్చిన హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత్.. పసిడి పతకాన్ని ముద్దాడింది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో భారత్ 5-1తో మలేషియాను చిత్తు చేసింది. ఈ విజయంతో హాకీలో భారత్‌కు రెండు స్వర్ణాలు వచ్చినట్లు అయ్యింది. ఆసియా గేమ్స్ చరిత్రలో భారత పురుషుల హాకీ టీమ్‌కు ఇది ఐదో స్వర్ణం కాగా.. వరుసగా రెండోది.
భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్(11వ, 57వ నిమిషం) రెండు గోల్స్ చేయగా.. జుగ్రాజ్(23వ నిమిషం), హార్దిక్ (42వ నిమిషం), శిలానంద్(54వ నిమిషం) చెరో గోల్స్ నమోదు చేశారు. మ్యాచ్ ఆరంభం నుంచే భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఆట 11వ నిమిషంలో లభించిన తొలి పెనాల్టీ కార్నర్‌ను కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ డ్రాగ్ ఫ్లిక్‌తో గోల్‌గా మలిచి భారత్‌కు 1-0తో ఆధిక్యాన్ని అందించాడు.

అయితే ఈ ఆనందం ఎంతో సేపు నిల్వలేదు 14వ నిమిషంలో మలేషియా గోల్ కొట్టి స్కోర్లను 1-1తో సమం చేసింది. మలేషియా ప్లేయర్ షెల్లో సిల్వరియస్ స్టన్నింగ్ ఫీల్డ్ గోల్‌తో ఆకట్టుకున్నాడు. రెండో క్వార్టర్ 23వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను జుగ్‌రాజ్ సింగ్ అద్భుతమైన డ్రాగ్ ఫ్లిక్‌తో గోల్‌గా మలిచాడు. దాంతో ఫస్టాఫ్‌ను భారత్ 2-1తో ముగించింది.
మూడో క్వార్టర్ చివర్లో లభించిన పెనాల్టీ కార్నర్‌ను హార్దిక్ గోల్‌గా మలిచి భారత్ ఆధిక్యాన్ని 3-1 మూడింతలు చేశాడు. 54వ నిమిషంలో అభిషేక్ ఫీల్డ్ గోల్‌తో భారత్ లీడ్‌ను 4-1కి పెంచగా.. 57వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్ గోల్‌గా మలిచి 5-1తో భారత్ విజయాన్ని లాంఛనం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

