Hockey World Cup 2026: భారత్ ఘోర పరాజయం.. సెమీస్ అవకాశాలు సంక్లిష్టం!
పురుషుల హాకీ ప్రపంచంకప్ 2026 టోర్నీలో భారత్‌కు ఊహించని షాక్ తగిలింది. అసాధారణ ప్రదర్శనతో సెకండ్ రౌండ్‌కు అర్హత సాధించిన భారత్ ఆ జోరును కొనసాగించలేకపోయింది. ఒలింపిక్ ఛాంపియన్, ఆతిథ్య నెదర్లాండ్స్‌తో జరిగిన పూల్-ఈ మ్యాచ్‌లో 3-1 తేడాతో భారత్ చిత్తయ్యింది. డచ్ ఆధిపత్యం ముందు భారత్ తేలిపోయింది. నెదర్లాండ్స్ తరఫున టెల్జెన్‌క్యాంప్ డూకో(41వ నిమిషం), హొఏదేమకేర్స్ టీజేపీ(51వ నిమిషం), వాన్ డామ్ థైస్(55వ నిమిషం)తలో గోల్ నమోదు చేశారు. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్(52వ నిమిషం) ఏకైక గోల్ రాబట్టాడు.
ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. కానీ చివర్లో భారత్ చేతులెత్తేసి గోల్స్ సమర్పించుకుంది. నెదర్లాండ్స్ కంటే భారత్‌కే ఎక్కువ పెనాల్టీ కార్నర్‌లు లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. భారత్‌కు 6 పెనాల్టీ కార్నర్‌లు లభించగా.. నెదర్లాండ్స్‌కు 4 లభించాయి. ఈ ఓటమితో భారత్ తమ సెమీస్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. తమ చివరి పూల్-ఈ మ్యాచ్‌లో అర్జెంటీనాపై గెలిచినా సెమీస్ చేరలేని పరిస్థితి నెలకొంది.

హోరాహోరీగా..
మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డాయి. దాంతో ఫస్టాఫ్ గేమ్‌లో ఇరు జట్లు గోల్స్ నమోదు చేయలేకపోయాయి. తొలి క్వార్టర్ చివర్లో నెదర్లాండ్స్‌కు ఒక పెనాల్టీ కార్నర్ లభించగా.. భారత్ అడ్డుకుంది. సెకండ్ క్వార్టర్‌లో డచ్ టీమ్ దుమ్మురేపి మూడు పెనాల్టీ కార్నర్‌లను అందుకుంది. కానీ వాటిని గోల్స్‌గా మలుచుకోలేకపోయింది. మూడో క్వార్టర్‌లో భారత్ దుమ్మురేపింది. నెదర్లాండ్స్ గోల్ పోస్ట్‌లపై దాడులు చేయడంతో భారత్‌కు ఏకంగా మూడు పెనాల్టీ కార్నర్‌లు లభించాయి. కానీ గోల్స్‌గా మల్చడంలో భారత్ ఆటగాళ్లు విఫలమయ్యారు.
కళ్లు చెదిరే గోల్‌తో..
42వ నిమిషంలో టెల్జెన్‌క్యాంప్ డూకో భారత డిఫెండర్లను తప్పిస్తూ బంతిని అద్భుతంగా గోల్ పోస్ట్‌లోకి పంపించి 1-0తో డచ్ ఖాతా తెరిచాడు. ఆ కాసేపటికే భారత్‌కు చెందిన లక్రా షిలనాద్ ఫౌల్ గేమ్ ఆడటంతో రిఫరీ గ్రీన్ కార్డ్‌తో బయటకు పంపించాడు. దాంతో భారత్ 10 మందితోనే ఆటను కొనసాగించింది. కానీ ఈ అవకాశాన్ని నెదర్లాండ్స్ సద్వినియోగం చేసుకోలేకపోయింది.
ఆఖరి క్వార్టర్‌లో భారత్ ఫుల్ స్క్వాడ్‌తో బరిలోకి దిగగా.. నెదర్లాండ్స్ దుమ్మురేపింది. తమదైన శైలిలో భారత్‌పై విరుచుకుపడి గోల్స్ నమోదు చేసింది. అప్పటికే ఒక గోల్ లీడ్‌లో ఉండటంతో భారత్ ఒత్తిడికి గురైంది. 51వ నిమిషంలో హొఏదేమకేర్స్ టీజేపీ అద్భుతమైన గోల్‌తో డచ్ ఆధిక్యాన్ని 2-0తో రెండింతలు చేయగా.. 52వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్‌గా మలిచి డచ్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించాడు. కానీ ఈ సంతోషం ఎంతో సేపు లేదు. 55వ నిమిషంలో వాన్ డామ్ థైస్ ఫీల్డ్ గోల్‌తో మెరిసి నెదర్లాండ్స్ ఆధిక్యాని 3-1కి పెంచాడు. చివరి 5 నిమిషాలు భారత్ ఎంత ప్రయత్నించినా గోల్స్ నమోదు కాలేదు. దాంతో నెదర్లాండ్స్ విజయం లాంఛనమైంది.
భారత్ సెమీస్ చేరాలంటే..?
పూల్-ఈలో ఉన్న భారత్ సెమీస్ చేరాలంటే.. అర్జెంటీనాతో జరిగే తమ ఆఖరి మ్యాచ్‌లో భారీ గోల్స్ తేడాతో విజయం సాధించాలి. నెదర్లాండ్స్ తమ తదుపరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించాలి. ఇలా జరిగితేనే భారత్ పూల్-ఈ నుంచి రెండో స్థానంలో నిలిచి సెమీస్ చేరుతుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
