Hockey World Cup 2026: ముగిసిన భారత్ పోరాటం.. అర్జెంటీనా ఘన విజయం!
హాకీ ప్రపంచకప్ 2026 టోర్నీలో భారత పురుషుల టీమ్ పోరాటం ముగిసింది. అమ్మాయిల తరహాలోనే సెమీఫైనల్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. సోమవారం జరిగిన పూల్-ఈ మ్యాచ్‌లో భారత్ 3-5 తేడాతో అర్జెంటీనా చేతిలో ఓటమిపాలైంది. అర్జెంటీనా తరఫున టోమాస్ డొమెనె(33, 45వ నిమిషాలు) రెండు గోల్స్ నమోదు చేయగా.. జోక్విన్ టోస్కోని(1వ నిమిషం), నికోల్ డెల్లా టోర్నే(6వ నిమిషం), టోస్కోని లుకాస్ (53వ నిమిషం)తలో గోల్ నమోదు చేశారు.
భారత్ తరఫున సుఖ్‌జీత్ సింగ్(10వ నిమిషం, 58వ నిమిషం) రెండు గోల్స్ నమోదు చేయగా.. హార్దిక్ సింగ్(60వ నిమిషం) చెరో గోల్ నమోదు చేసినా ఫలితం లేకపోయింది. అర్జెంటీనా కు మూడు పెనాల్టీ కార్నర్‌లు లభించగా అందులో ఒక్కదాన్నే గోల్‌గా మలిచింది. మూడు ఫీల్డ్ గోల్స్ నమోదు చేయగా.. ఒక పెనాల్టీ స్ట్రోక్ ద్వారా వచ్చింది. మరోవైపు భారత్ 7 పెనాల్టీ కార్నర్ లభించినా ఒక్క గోల్ నమోదు చేయలేకపోయింది. 2 ఫీల్డ్ గోల్స్ చేసిన భారత్.. మరొకటి పెనాల్టీ స్ట్రోక్ ద్వారా రాబట్టింది.

అర్జెంటీనాదే ఆధిపత్యం..
ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడు కనబర్చింది. తొలి నిమిషంలోనే జోక్విన్ టోస్కోని ఫీల్డ్ గోల్ చేసి అర్జెంటీనా ఖాతా తెరిచాడు. 6వ నిమిషంలో నికోల్ డెల్లా టోర్నే మరో ఫీల్డ్ గోల్‌తో అర్జెంటీనా ఆధిక్యాన్ని 2-0తో డబుల్ చేశాడు. అనంతరం పుంజుకున్న భారత్ 10వ నిమిషంలో ఫీల్డ్ గోల్ చేసి అర్జెంటీనా ఆధిక్యాన్ని 2-1కు తగ్గించాడు.
రెండో క్వార్టర్‌లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడటంతో గోల్స్ నమోదు కాలేదు. దాంతో ఫస్టాప్ 2-1తో ముగిసింది.సెకండాఫ్ ఆరంభంలోనే డోమెనె టొమాస్ అద్భుతమైన ఫీల్డ్ గోల్‌తో అర్జెంటీనా ఆధిక్యాన్ని 3-1కి పెంచాడు. ఆ తర్వాత భారత్ ఆధిపత్యం చెలాయించడంతో వరుసగా ఐదు పెనాల్టీ కార్నర్‌లు లభించాయి. కానీ వాటిని హర్మన్ సేన సద్వినియోగం చేసుకోలేకపోయింది. మరోవైపు మూడో క్వార్టర్ ఆఖరి నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్‌ను డోమెనె టొమాస్ గోల్‌గా మలిచిన అర్జెంటీనా ఆధిక్యాన్ని 4-1కి పెంచాడు.
భారత్ పోరాడినా..
ఆఖరి క్వార్టర్‌లో దుమ్మురేపిన అర్జెంటీనా 53వ నిమిషంలో టోస్కోని లుకాస్ ఫీల్డ్ గోల్‌తో ఆధిక్యాన్ని 5-1కి పెంచుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. ఆ వెంటనే భారత్ 58, 60 నిమిషంలో వరుసగా గోల్స్ నమోదు చేసినా ఫలితం లేకపోయింది. సుఖ్‌జిత్ సింగ్ 58వ నిమిషంలో ఫీల్డ్ గోల్ చేయగా.. హార్దిక్ సింగ్ పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

