
సెంచరీ కొట్టి.. షార్జాకప్ ముద్దాడి..
సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఇదే రోజు (ఏప్రిల్ 24, 1998)న దుబాయ్ వేదికగా జరిగిన కొకకోలా షార్జ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన ఈ ట్రై సిరీస్ ఫైనల్లో సచిన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 131 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 134 పరుగులతో వీరవిహారం చేసిన మాస్టర్.. ఒంటిచేత్తో భారత్‌ను గెలిపించాడు. అతని పోరాటం భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ ఒక్క మ్యాచ్‌లోనే కాదు సచిన్ ఆ సిరీస్‌లో మొత్తం 434 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికయ్యాడు. అప్పట్లో తన సూపర్ బ్యాటింగ్‌ను కొనియాడుతూ క్రికెట్ విశ్లేషకులు ‘ఏడారిలో సచిన్ తుఫాన్'అంటూ అభివర్ణించారు.
మేం దేశం కోసం ఆడితే.. భారత క్రికెటర్లు వ్యక్తిగత రికార్డుల కోసం ఆడారు: పాక్ మాజీ క్రికెటర్

273 పరుగుల భారీ లక్ష్యం..
నాటి ఫైనల్ మ్యాచ్‌లో మహ్మద్ అజారుద్దీన్ నేతృత్వంలోని భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 272 పరుగులు చేసింది. స్టీవ్ వా (70), డారెన్ లెహ్‌మన్(70) టాప్ స్కోర్లర్లుగా నిలిచారు. అనంతరం ఛేజింగ్‌కు దిగిన భారత్.. సచిన్ సూపర్ సెంచరీతో 48.3 ఓవర్లలో 4 వికెట్లకు 275 పరుగులు చేసిన 9 బంతులు మిగిలి ఉండగానే విజయాన్నందుకుంది.
రికార్డులు ధోనీ పేరిటనే ఉన్నా.. నా బెస్ట్ కెప్టెన్ మాత్రం అతనే: గంభీర్

షేన్‌వార్న్ ఉతికారేసిన సచిన్..
ఓపెనర్‌గా బరిలోకి దిగిన సచిన్.. సౌరవ్ గంగూలీ (23), నయాన్ మోంగియా (28) నిరాశపరిచినా.. పట్టుదలగా క్రీజులో నిలిచాడు. అతడ్ని నిలువరించేందుకు దిగ్గజ స్పిన్నర్ షేన్‌వార్న్‌ని పదే పదే కెప్టెన్ స్టీవ్‌వా ప్రయోగించగా.. స్వీప్ షాట్స్‌తో పాటు క్రీజు వెలుపలికి వచ్చి మరీ సచిన్ భారీ షాట్లు ఆడాడు. సచిన్ ధాటికి షేన్‌వార్న్ 10 ఓవర్లలో వికెట్ లేకుండా 61 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక సచిన్ 248 పరుగుల వద్ద ఔటవ్వగా.. అజారుద్దీన్(58), అజయ్ జడేజా(11 నాటౌట్), రుషికేష్(6 నాటౌట్) మిగతా పనిని పూర్తి చేశారు.
నా ఫేవరేట్ హీరో ప్రభాస్: స్టార్ క్రికెటర్

సచిన్ వల్లే ఫైనల్‌కు...
భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య ఈ షార్జా కప్ జరగ్గా.. ఒక్కో దేశం నాలుగు లీగ్ మ్యాచ్‌లు ఆడింది. అయితే భారత్, న్యూజిలాండ్ చెరొక విజయమే సాధించడంతో రన్ రేట్ కీలకమైంది. దీంతో ఆసీస్‌తో జరిగిన ఆఖరి లీగ్ భారత్‌కు తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. కానీ సచిన్ మెరుపు ఇన్నింగ్స్ వల్ల మెరుగైన రన్‌రేట్‌తో ఫైనల్‌కు చేరి కప్‌ను ముద్దాడింది. ఈ మ్యాచ్‌లో సచిన్ 131 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 143 పరుగులతో వీరవిహారం చేశాడు.


Click it and Unblock the Notifications
